WorldWonders

దాసరి ప్రశాంతికి సిగ్గురాలేదు. రెండోసారి దొరికింది.

Land Ammendments AO Dasarai Prashanthi Caught In Krishna Collectorate-దాసరి ప్రశాంతికి సిగ్గురాలేదు. రెండోసారి దొరికింది.

కృష్ణా కలెక్టరేట్ లో అవినీతి తిమింగళం. రెండొసారి ఏ.సి.బి కి చిక్కిన అవినీతి అధికారిణి. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని కలెక్టరేట్లో ఎసిబి అధికారుల దాడి. రూ 3 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన భూసంస్కరణల AO. ఏసీబీ అధికారుల రైడ్ తో కలెక్టరేట్లో కలకలం. కలెక్టరేట్లో కొనసాగుతున్న ఏసీబీ అధికారుల విచారణ. ఆధీకృత అధికారి(భూసంస్కరణలు) పనిచేస్తున్న ప్రశాంతిను వలపన్ని పట్టుకున్న ఏ .సి.బి అధికారులు. సాక్షాత్తు కలెక్టర్ కార్యాలయంలోనే అవినీతి అధికారిణి ఒట్టుబడటంతో బెంబేలెత్తిపోయిన ఇతర శాఖల అధికారులు. కృష్ణాజిల్లా, తాడేపల్లి మండలం, ఉండవల్లి సెంటర్ లో నివాసముంటున్న మెకా రామలింగేశ్వరరెడ్డి పిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఏ .సి.బి అడిషనల్ ఎస్.పి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో వలపన్ని పట్టుకున్నారు. నాలుగు ఎకరాల భూమికి సంబంధించి లొసుగులు తొలిగించే నిమిత్తం 3లక్షలు లంచం రామలింగేశ్వరరెడ్డిని డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు ఏసీబీకి అందింది. ఏసీబీ అధికారులు భూసంస్కరణల AO అధికారిణి దాసరి ప్రశాంతిని రెడ్ హ్యాండేడ్‌గా పట్టుకున్నారు. అమ్మగారు గతంలో 2014లో ఏ.కొండూరు తహశీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ కూడా పట్టుబడిన ఘనచరిత్ర కలిగి ఉన్నది.