పసిపిల్లలు ఉన్నట్టుండి ఏడుపు మొదలుపెడతారు. దానికి కారణాలు తెలుసుకుని… ఏం చేయాలో ఆలోచించండి. ●
నిద్ర సరిగ్గా లేకపోయినా ఏడుపు మొదలుపెడతారు బుజ్జాయిలు. అందుకే వారు హాయిగా నిద్రపోయేలా ఏర్పాట్లు చేయండి. వాళ్ల గదిలోకి వెలుతురు, శబ్దాలు, ఘాటైన వాసనల వంటివి చేరకుండా చూడాలి. అవి వచ్చినప్పుడు నిద్రాభంగమై ఏడుపు అందుకునే అవకాశం ఉంది.
చిన్నారులు పడుకునే పరుపు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. దానిపై పడే పదార్థాలు, దుమ్ము వంటివి వారికి చికాకుని కలిగిస్తాయి. దాంతో కుదురుగా పడుకోలేరు. పక్క సరిగ్గా లేకపోయినా అసౌకర్యానికి గురై… ఏడుస్తారని తెలుసుకోండి.
పాలు పట్టిన వెంటనే పడుకోబెట్టే ప్రయత్నం వద్ధు బరువుగా అనిపించి ఏడుపు మొదలు పెట్టొచ్ఛు బదులుగా కాసేపు కూర్చోబెట్టుకుని వీపు రాయండి. తేన్పు వచ్చాకే నిద్రపుచ్చండి. అయినా ఏడుస్తోంటే… పొట్టనొప్పి ఉందేమో గమనించి, అవసరమైన మందు వేయండి.