తెలుగు అలయన్స్అఫ్ కెనడా (తాకా) ఆధ్వర్యంలో ఎటోబీకోక్‌లోని మైకేల్ పవర్ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. తాకా కార్యదర్శి నాగేంద్ర హంసాల స్వాగతోపన్యాసంతో ప్రారంభమైన ఈ సంబరాలకు రంజిత కాపర్తి, వాణి జయంతి, శైలజ కుందూరి దీప ప్రజ్వలన చేయగా, చిన్నారులకు వాణి జయంతి, కల్పన మోటూరిలు భోగిపళ్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. రాణి మద్దెల ముగ్గుల పోటీలు, చిన్నపిల్లలకు చిత్ర గీత పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. తాకా అధ్యక్షులు శ్రీనాథ్ కుందూరి అతిథులకు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం సంక్రాంతి ప్రాముఖ్యతను గురించి సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. తాకా ఫౌండర్స్ కమిటీ చైర్మన్ చారి సామంతపూడి ఈ ఏడాది జులై 11,12న జరగనున్న 10వ వార్షికోత్సవాలు గురించి సభికులతో సమాచారాన్ని పంచుకున్నారు. ఆంటారియో పార్లమెంట్ అధ్యక్షులు దీపక్ ఆనంద్ ముఖ్య అతిథిగా పాల్గొని 2020 తెలుగు కాలెండర్ ని ఆవిష్కరించారు. పూర్వ అధ్యక్షులు అరుణ్ లయం ఆధ్వర్యంలో కళానృత్యాలు, సినిమా పాటలు, డాన్సులు, ఫాషన్ షో వంటి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అరిసెలతో కూడిన తెలుగు వంటకాల విందు భోజనం అలరించింది. వేడుకల విజయవంతానికి కృషి చెసిన డైరెక్టర్లు మల్లికార్జున చారి పదిర, ప్రవీణ్ పెనుబాక, రాజారామ్ మోహన్ రాయ్ పుల్లంశెట్టి, కోశాధికారి సురేష్ కూన, ట్రస్ట్ సభ్యులు బాషా షైక్, రామ చంద్రరావు, దుగ్గిన, రాఘవ్ అల్లం, ప్రసన్న తిరుచిరాపల్లి, కేలండర్ కమిటి సభ్యులు రవి వారణాసి, రాకేష్ గరికపాటి తదితరులను తాకా అధ్యక్షులు శ్రీనాథ్ కుందూరి అభినందించారు.
కెనడాలో వైభవంగా తాకా సంక్రాంతి
Related tags :