ScienceAndTech

500కోట్ల మంది చేతిలో వాట్సాప్

WahtsApp User Base Crosses 500Cr

దిగ్గజ మెసేజింగ్‌ ప్లాట్‌ఫాం వాట్సాప్‌ ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల డౌన్‌లోడ్లను సాధించింది. ఈ ఘనత సాధించిన రెండో గూగుల్‌యేతర యాప్‌గా చరిత్ర సృష్టించింది. అయితే ఇది కేవలం ప్లేస్టోర్‌ నుంచి చేసుకున్న డౌన్‌లోడ్లు మాత్రమేగాక, వివిధ సంస్థలకు చెందిన మొబైల్‌ ఫోన్లలో ప్రీఇన్‌స్టాల్‌గా వచ్చే వాటితో కలిపి ఈ ఘనత సాధించింది. వాట్సాప్‌కు నెలకు 160 కోట్ల మంది యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు. ఫేస్‌బుక్‌కు 130 కోట్ల మంది, వియ్‌చాట్‌కు 110 కోట్ల మంది యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు. సోషల్‌ నెట్‌వర్క్‌లలో ఫేస్‌బుక్, యూట్యూబ్‌ల తర్వాత వాట్సాప్‌ మూడో స్థానంలో నిలిచింది. గతేడాదిలో గూగుల్‌ 230 కోట్ల డౌన్‌లోడ్లను సాధించగా, ఫేస్‌బుక్‌ 300 కోట్ల డౌన్‌లోడ్‌లను సాధించింది. మరోవైపు టిక్‌టాక్‌ యాప్‌ 2019లో రెండో అత్యధిక డౌన్‌లోడ్‌లు సాధించిన యాప్‌గా నిలిచింది. భారత్‌తో పాటు, పలు దేశాల్లో వాట్సాప్‌ స్తంభించింది. ఫొటోలు, వీడియోలు, స్టేటస్‌ అప్‌డేట్లు చేయలేకపోయామని పలువురు యూజర్లు ట్విట్టర్‌ వేదికగా ‘వాట్సాప్‌డౌన్‌’ హాష్‌టాగ్‌తో వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 4:15 నుంచి ఈ సమస్య ఎదురైనట్లు యూజర్లు తెలిపారు. సందేశాలు అందుకోవడం, పంపడం వంటి వాటిల్లో కూడా సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పారు. భారత్, యూరోప్, మలేసియా, ఇండోనేసియా, బ్రెజిల్‌లోని పలు చోట్ల ఈ సమస్య ఎదురైంది. దాదాపు మూడు గంటల తర్వాత ఈ సమస్యను వాట్సాప్‌ ఇంజనీర్లు పరిష్కరించారు.