* పశ్చిమ గోదావరి జిల్లా సీతానగరంలో తొమ్మిదిమంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేసిన వైనం బుధవారం చింతలపూడిలో చోటుచేసుకుంది. చింతలపూడి మండలం సీతానగరం గ్రామంలో, చింతలపూడి ఎస్సై ఆధ్వర్యంలో, బుధవారం పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో తొమ్మిది మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి 14,590 రూపాయల నగదును, 52 పేక ముక్కలను సీజ్ చేశారు.
* ఖమ్మం జిల్లా సత్తుపల్లి మునిసిపాలిటీ లో పొలింగ్ రోజు కూడా ఓటర్లను ప్రభావితం చేసే పనిలో పడ్డారు అధికార పార్టీ నాయకులు.గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంపిణికి శ్రీకారం చుట్టారు. 14 వ వార్డులో అధికార పార్టీ అభ్యర్ధి తరుపున కొందరు నాయకులు ఓటర్లను ప్రభావితం చేస్తూ డబ్బులు పంపిణీ చేస్తుండగా స్థానిక ఓటర్లు,కాంగ్రెస్ నాయకులు వారిని పట్టుకున్నారు.అధికార పార్టీ నాయకులకు,కాంగ్రెస్ పార్టీ నాయకుల మద్య స్పల్ప వివాదం జరిగటంతో పోలీసులు ఘర్షన స్థలానికి చెరుకొగానే అధికార పార్టీ నాయకులు పారిపోతుండగా స్థానికులు వెంబడించి ఇద్దరు టి.ఆర్.యస్.నాయకులను వారి వద్ద ఉన్న డబ్బులను పోలీసులకు అప్పగించారు.డబ్బులు పంచుతున్న అధికార పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అధుపులోకి తీసుకున్నారు.
* పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కెనాల్ రోడ్ లో యడ్లపాటి కృష్ణ కుచెందిన” సర్వో ఆయిల్స్, సత్య ఆగ్రో స్పేర్స్ “షాప్ లో అగ్ని ప్రమాదం సంభవించింది .విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించిందని బావిస్తున్నారు. ఆస్తి నష్టం సుమారు అయిదు లక్షలుగా అధికారులు అంచనా వేస్తున్నారు.సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలు అదుపులోకి తెచ్చారు.
* మధ్యప్రదేశ్‌లోని భిలాయ్ ప్రాంతంలో ట్రిపుల్ మర్డర్ కేసు వెలుగులోకి వచ్చింది. ఒక ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి, మహిళ కాళ్లు, చేతులు తాళ్లతో కట్టి అనంతరం వారిపై కిరోసిన్ పోసి తగలబెట్టారు. ఆ ఇద్దరితో పాటు రెండు సంవత్సరాల పాప ఊపిరాడక విగతజీవిగా మారింది. దీంతో పోలీసులు మహిళ భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
* గుంటూరులో వివిధ పార్టీల నేతలు అరెస్ట్. అమరావతి రాజధాని కోసం నేడు జిల్లా బంద్ నిర్వహిస్తున్న నేపథ్యంలో..బుధవారం ఉదయం గుంటూరులో దుకాణాలను మూయిస్తున్న సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజరు కుమార్ లతో పాటు వివిధ పార్టీల నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్టేషన్ కు తరలించారు.
* కర్ణాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు లభించిన ఘటనలో అనుమానితుడిగా భావిస్తున్న వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఉద్యోగం రాలేదనే మనస్తాపంతోనే తాను ఈ చర్యకు పాల్పడ్డట్లు పేర్కొన్నాడు. ఈ విషయం గురించి పోలీసులు మాట్లాడుతూ.. మంగళూరు ఎయిరుపోర్టు ఘటనకు బాధ్యత వహిస్తూ మణిపాల్‌కు చెందిన ఆదిత్య రావు(36) అనే వ్యక్తి తమకు లొంగిపోయాడని తెలిపారు. అతడికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం అతడిని మంగళూరు టీంకు అప్పగించనున్నట్లు వెల్లడించారు. కాగా సోమవారం ఉదయం 10 గంటల సమయంలో టికెట్ కౌంటర్ వద్ద విమానాశ్రయ పోలీసులు అనుమానాస్పద బ్యాగ్‌ను కొనుగొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న నగర పోలీసు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సదరు బ్యాగులో పేలుడు పదార్థం ఉన్నట్టుగా అనుమానించారు.
* ప్రకాశం జిల్లాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒంగోలు శివారుల్లో గ్యాంగ్ రేప్ జరిగిందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. కేశవరాజు కుంట శివారులో ఓ మహిళ అపస్మారక స్థితిలో వివస్త్రగా పడివుంది. దీంతో ఆమెను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్పృహలేకుండా పడి ఉన్న బాధితురాల్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలో బాధితురాలు పక్కన మహిళల లోదుస్తులు, కండోమ్స్, నల్లపూసల దండ పడివుండటాన్ని గుర్తించారు. మహిళపై గ్యాంగ్ రేప్ జరిగిందన్న అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు మహిళ ఒంటిపై గాయాలు కూడా ఉండటంతో మహిళ ఎవరో ఆమెపై అత్యాచారం చేసి వదిలేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె స్పృహలోకి వస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
* మండల కేంద్రమైన దేవనకొండ జెడ్పీ పాఠశాల ఇంగ్లిషు టీచర్ అరుణ కుమారి పదో తరగతి విద్యారి వీరేష్ ను తీవ్రంగా చితకబాదింది. సంక్రాంతి సెలవుల్లో హోం వర్క్ చేయలేదని తోటి విద్యార్థుల ముందే విచక్షణారహితంగా కర్రతో కొట్టింది. ఈ విషయం తెలుసుకున్న ఆ విద్యార్థి తల్లి స్కూలుకు చేరుకుని ఇంగ్లిషు టీచర్‌తో వాగ్వాదానికి దిగింది. తప్పు చేస్తే మందలించాలే తప్ప శరీరంపై వాతలు పడేలా కొడతారా అని నిలదీశారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
* ఫోన్ పగలగొట్టినందుకు తల్లి తిట్టిందని ఓ కూతురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోల్‌కతాలోని రిజెంట్ పార్క్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అమ్మాయి తన తల్లితో కలిసి మార్కెట్ కు వెళ్లింది. మార్కెట్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు తల్లి ఫోన్‌ను ఆమె జారవిడిచింది. ఫోన్ పగిలిపోవడంతో కూతురుని తల్లి తిట్టడమే కాకుండా ఫోన్ పై పెట్టిన శ్రద్ధ చదువుపై పెట్టాలని చీవాట్లు పెట్టింది. అంతే కాకుండా ఇంటికి వచ్చిన తరువాత తండ్రితో తిట్టించింది. బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన ఆ కూతురు గడియపెట్టుకొని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎంతకు తలుపు తీయకపోవడంతో డోర్‌ను బద్దలుకొట్టిచూడగా కూతురు ఉరేసుకొని కనిపించింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
* నిజామాబాద్ జిల్లాలో 10 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాలపల్లి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళలను రెండో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దొంగ ఓట్లు వేసేందుకు డిచ్‌పల్లి నుంచి వచ్చారని పోలీసులకు సమాచారం అందినట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
* టికెట్టు లేని ప్రయాణం నేరం.. రైళ్లల్లో, బస్సులో ఈ హెచ్చరికలు చదివే ఉంటారు కదా..! అయితే అలా ప్రయాణించిన వారు పశ్చిమ రైల్వే విభాగానికి రూ.100కోట్లు ఆదాయం సమకూర్చిపెట్టారు. అధికారుల కథనం ప్రకారం.. 2019 ఏప్రిల్-డిసెంబరు మధ్య పశ్చిమ రైల్వే విభాగంలో టికెట్టు లేకుండా ప్రయాణించిన వారు జరిమానాల రూపంలో రూ.104.10కోట్లు చెల్లించారు. వీటిలో లగేజీకి సంబంధించిన జరిమానాలు కూడా ఉన్నాయి. ఈ మేరకు రూ.21.33 లక్షల కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే 8.85శాతం కేసులు పెరిగాయని వెల్లడించారు. కేవలం ఒక్క డిసెంబరులోనే 2.13 లక్షల కేసులు నమోదయ్యాయని.. రూ.10.14 కోట్లు వసూలయ్యాయని పేర్కొన్నారు. మొత్తం 2,124 చోట్ల జరిగిన తనిఖీల్లో 1,821 మందిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. అలాగే పశ్చిమ రైల్వే విభాగం పరిధిలోని స్టేషన్ల ఆవరణలో భిక్షాటన చేస్తున్న 1,632 మందిని సంరక్షణా కేంద్రాలకు తరలించినట్లు వెల్లడించారు
* సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ గతేడాది సంచలన ఆరోపణలు చేసిన ఓ మహిళను సుప్రీంకోర్టు మళ్లీ విధుల్లోకి తీసుకున్నట్టు సమాచారం. అయితే విధుల్లో చేరగానే ఆమె దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆమెకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలను కూడా సుప్రీంకోర్టు చెల్లించినట్టు తెలిపాయి. 2014 మేలో సదరు మహిళ సుప్రీంకోర్టులో చేరింది. అయితే అక్టోబర్ 2018లో అప్పటి సీఎస్ జస్టిస్ గొగోయ్ నివాసంలోని కార్యాలయంలో నియమించిన నాటి నుంచి తనకు ఇబ్బందులు మొదలైనట్టు ఆమె ఆరోపించింది. లైంగిక వేధింపులు జరిగినట్టు ఆరోపించిన తర్వాత తనను బదిలీ చేసి, అనంతరం విధుల నుంచి తొలగించారని ఆమె ఆరోపించారు.
ఒంగోలులో గ్యాంగ్ రేప్-నేరవార్తలు
Related tags :