* ప్రభుత్వం గత బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-అసెస్‌మెంట్ పథకం కింద 44 వేల మందికి ఆదాయపుపన్ను నోటీసులు జారీ అయ్యాయి. పన్ను లెక్కల్లో పారదర్శకత తెచ్చేందుకు ప్రభుత్వం 2019 బడ్జెట్‌లో ఈ అసెస్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు నాటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనిని గత అక్టోబర్‌లో ప్రారంభించారు. దీనిలో గుర్తించిన 58,322 కేసులకు గాను 44,285 కేసుల్లో నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులకు అధికారుల నుంచి వేధింపులు తప్పించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా పన్ను రిటర్నుల పరిశీలనల్లో వ్యక్తుల జోక్యాన్ని తగ్గించేందుకు , అవినీతిని నివారించేందుకు దీనిని ప్రవేశపెట్టారు. ‘‘ సాంకేతికతను ఉపయోగించుకొని మానవ జోక్యాన్ని తగ్గించి భారత్‌ను సరికొత్త శిఖరాలకు చేర్చాము’’ అని ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
* ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన నూతన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ‘ఆల్ట్రోజ్’ కారును బుధవారం లాంచ్ చేసింది. అద్భుతమైన డిజైన్, అత్యాధునిక ఫీచర్లతో, ఆకట్టుకునే ఇంటీరియర్ డిజైన్‌తో టాటా ఆల్ట్రోజ్ ఈవీ కారును తీర్చిదిద్దింది. బీఎస్-6 ఉద్గార నిబంధనలకనుగుణంగా రెండు వేరియంట్ల ఇంజీన్ ఆప్షన్లతో 5-స్పీడ్ మ్యాన్యువల్ స్టాండర్డ్ గేర్‌బాక్స్‌తో లాంచ్ చేసింది. దేశంలో అతి భద్రమైన తమ ఆల్ట్రోజ్ వినియోగదారులకు బంగారం లాంటి అనుభవాన్ని ఇస్తుందని, హాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఈ వాహనం తమకు మంచి గుర్తింపునివ్వనుందని కంపెనీ పేర్కొంది. టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లోని 1.2 లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 86 బీహెచ్‌పి పవర్, 113ఎన్ఎమ్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 1.5-లీటర్ నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ 90 బీహెచ్‌పి పవర్, 200ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది ఎల్ఈడీ డీఆర్ఎల్స్ గల ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, సమీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, 7.0 అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లెదర్ ఫినిషింగ్‌తో మల్టిపుల్ కంట్రోల్ బటన్స్ స్టీరింగ్ వీల్, విభిన్న డ్రైవింగ్ మోడ్స్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. టాటా ఆల్ట్రోజ్ ఎక్స్ ఈ, ఎక్స్‌ఎం, ఎక్స్‌టీ, ఎక్స్ జెడ్, ఎక్స్‌జెడ్(ఒ) నాలుగు వేరియంట్లలో లభించనుంది. ఇక మార్కెట్‌లో పోటీ విషయానికి వస్తే..మారుతి సుజుకి బాలెనో, టయోటా గ్లాంజా, హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా.
* వినియోగదారులు కొంతకాలంగా వేచిచూస్తున్న హ్యుందాయ్ ఆర మంగళవారం మార్కెట్లోకి విడుదలైంది. కంపాక్ట్ సెడాన్ విభాగంలో ఈ కారు మారుతీ డిజైర్, ఫోర్డ్ అస్పైర్, హోండా అమేజ్, టాటా టిగోర్‌కు ఇది పోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు. క్యాబ్ ఆపరేటర్ మార్కెట్‌లో ఈ తరహా కార్లకు మంచి డిమాండ్ ఉండడం కలిసి రానుంది. బీఎస్-6 ప్రమాణాలతో వస్తున్న ఈ కారు పలు వేరియంట్లలో లభించనుంది. నాలుగు సిలిండర్లు, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో రానున్న వేరియంట్ 83 బీహెచ్‌పీ శక్తి, 114 ఎన్‌ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. దీనికి సీఎన్‌జీ ఆప్షన్‌ని కూడా ఇవ్వడం విశేషం. మూడు సిలిండర్లు, 1.3 లీటర్ డీజిల్ టర్బోచార్జ్ ఇంజిన్‌తో రానున్న వేరియంట్ 74 బీహెచ్‌పీ శక్తి, 190ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరికొన్ని వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక డీజిల్ వేరియంట్ 25.47 కేఎంపీఎల్, పెట్రోల్ 25 కేఎంపీఎల్ మైలేజీ ఇవ్వనున్నాయని కంపెనీ ప్రకటించింది.