* దేశీయ సూచీలు ఈ వారాన్ని భారీ లాభాలతో ముగించాయి. యస్ బ్యాంక్, టెక్ మహీంద్రా వంటి కంపెనీల షేర్ల కొనుగోలు అండతో వరుసగా రెండో రోజు సూచీలు లాభాలను దక్కించుకున్నాయి. ఐటీ మినహా ఆటో, లోహ, ఎఫ్‌ఎంసీజీ, ఇన్‌ఫ్రా, బ్యాంకింగ్ రంగాల షేర్లలో కొనుగోళ్లు మార్కెట్లకు కలిసొచ్చాయి.
* ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై చీటింగ్ కేసు నమోదైంది. ఆయనతోపాటు ముజీబ్ ఖాన్, సుదేశ్ అవిక్కల్ అనే మరో ఇద్దరుపై మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఓ ట్రావెల్ కంపెనీ ఈ కేసు పెట్టింది.
* గ్రామీణ ప్రజలకు, బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు ట్రిపుల్ ప్లే సర్వీసులు అందించేందుకు ఓటీటీ కంటెంట్‌లో గ్లోబల్ లీడర్ యప్ టీవీ బీఎస్‌ఎన్‌ఎల్‌తో కలిసి పనిచేస్తుంది. ఈ ఏడాదిలో తెలంగాణ సర్కిల్‌తో పాటు సౌత్ జోన్‌లో సేవలు మొదలవనున్నాయి.
*ఓటీటీ (ఓవర్ ద టాప్) మీడియా సేవల ప్రస్తుత తీరుతెన్నులు, భవిష్యత్తులో వచ్చే మార్పులపై టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గురువారం ఇక్కడ ఒక సదస్సు నిర్వహించింది. ప్రాంతీయ స్థాయిలో ట్రాయ్ ఇటువంటి సదస్సు నిర్వహించటం ఇదే ప్రథమం.
*సూచీలు లాభపడ్డాయి. మూడు రోజుల వరుస నష్టాలకు అడ్డుకట్ట పడింది. చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిపై ఆసియా మార్కెట్లలో భయాందోళనలు కొనసాగుతున్నా, దేశీయంగా బ్యాంకింగ్, ఇంధన రంగాల షేర్లకు లభించిన కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ 271 పాయింట్లు, నిఫ్టీ 73 పాయింట్ల మేర లాభపడ్డాయి. అంతర్జాతీయ సూచీలకొస్తే షాంఘై, హాంకాంగ్, టోక్యో, సియోల్ 2.75 శాతం వరకు నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లు కూడా నష్టాల బాటలోనే ట్రేడయ్యాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 7 పైసలు నష్టపోయి 71.26 వద్ద ముగిసింది.
*ఔషధాలు, ఆహార పదార్థాల ప్యాకేజింగ్లో తేమను, ఆక్సిజన్ను పీల్చుకునేందుకు వాడే డెసికాంట్లను ఉత్పత్తి చేసే సెలికాంట్ కెమ్ హైదరాబాద్లో తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇక్కడ తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతోపాటు, రెండుమూడేళ్లలో ప్లాంటును నిర్మించనున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనీశ్ జైన్ తెలిపారు.
*ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం పోర్టులో 75 శాతం వాటా కొనుగోలు చేస్తున్న అదానీ గ్రూపు కాకినాడ సమీపంలో జీఎంఆర్ గ్రూపు నిర్మిస్తున్న నూతన నౌకాశ్రయం/ ఎస్ఈజడ్ను సైతం సొంతం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు మార్కెట్ వర్గాల్లో ప్రచారం అవుతోంది. గత కొంతకాలంగా ఈ నౌకాశ్రయం నిర్మాణంలో ఉంది. అంతేగాక దానికి అనుబంధంగా ఉన్న ఎస్ఈజడ్ (ప్రత్యేక ఆర్థిక మండలి) లో దేశీయ- విదేశీ సంస్థలను, పెట్టుబడులను ఆకర్షించేందుకు జీఎంఆర్ గ్రూపు ప్రయత్నాలు చేస్తోంది.
*బకాయిలు చెల్లించేందుకు సుప్రీంకోర్టు విధించిన గడువు గురువారంతో ముగిసినా, జమచేయని భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలపై కఠిన చర్యలు చేపట్టకూడదని టెలికాం విభాగం నిర్ణయించింది. మరికొంత గడువు ఇవ్వాలన్న ఈ సంస్థల అభ్యర్థనపై, వచ్చేవారం విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించడమే దీనికి కారణం.
*ముత్తూట్ మినీ ఫైనాన్షియర్స్ మార్పిడి రహిత డిబెంచర్ల (ఎన్సీడీ) జారీని ప్రారంభించింది. ఈ ఇష్యూ పరిమాణం రూ.100 కోట్లుగా నిర్ణయించింది. ఒకవేళ అధిక స్పందన లభిస్తే మరో రూ.100 కోట్లు అట్టే పెట్టుకొనే ఆప్షన్ను కూడా పరిశీలిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ నెల 20న ప్రారంభమైన ఇష్యూ, వచ్చే నెల 2న ముగియనుంది.
*రానున్న వేసవి సెలవులను పురస్కరించుకుని సదరన్ ట్రావెల్స్ ‘హాలీడే బజార్’ను ప్రకటించింది. ఈ నెల 24 నుంచి 26 వరకు తెలుగు రాష్ట్రాల్లో హాలీడే బజార్ నిర్వహిస్తోంది. గురువారం హైదరాబాద్లో లక్డీకాపుల్లోని సంస్థ కార్యాలయంలో సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ ఎం.రామారావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.వి.ప్రవీణ్కుమార్ వివరాలు వెల్లడించారు. 24 నుంచి మూడు రోజుల పాటు ఎంపిక చేసిన ప్రదేశాల్లో యాత్రలకు వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారు నమోదు చేసుకునేందుకు ట్రావెల్స్ ప్రతినిధులు అందుబాటులో ఉంటారని తెలిపారు.
*ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బయోకాన్ రూ.202.80 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ నమోదు చేసిన రూ.217.2 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 6.62 శాతం తక్కువ. కార్యకలాపాల ఆదాయం రూ.1,540.80 కోట్ల నుంచి రూ.1,748.10 కోట్లకు పెరిగింది. వ్యయాలు రూ.1,295.40 కోట్ల నుంచి రూ.1,465.60 కోట్లకు చేరాయి.
*నీటికి రంగు లేదు. కానీ ఆసక్తికరంగా నలుపు రంగు నీళ్లను ‘ఎవోకస్’ అనే బ్రాండు పేరుతో ఒక సంస్థ దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఏవీ ఆర్గానిక్స్ అనే గుజరాత్కు చెందిన అంకురం ఈ నలుపు నీటిని రూపొందించింది. ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఖనిజాలు, లవణాలు ఈ నీటిలో ఉంటాయని ఈ సంస్థ ప్రతినిధులు గురువారం ఇక్కడ నిర్వహించిన సమావేశంలో వివరించారు.
*హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఒలెక్ట్రా గ్రీన్టెక్, ఎంఈఐఎల్ హోల్డింగ్స్ లిమిటెడ్ అజమాయిషీలోని అనుబంధ సంస్థ అయిన ఎవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 555 విద్యుత్తు బస్సుల సరఫరా కాంట్రాక్టులు దక్కించుకుంది.
లాభాల్లో మార్కెట్లు-వాణిజ్యం
Related tags :