తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ-వాణిజ్య పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మలేషియా పర్యటన సందర్భంగా తెరాస మలేషియా ఎన్నారై విభాగం అధ్యక్షుడు చిరుత చిట్టిబాబు ఆధ్వర్యంలో ఆయనకి కౌలాలాంపూర్‌లో ఘనస్వాగతం పలికి సత్కరించారు. మలేషియాలోని వ్యవసాయ క్షేత్రాల అధ్యయనానికి విచ్చేసిన నిరంజన్ ఇక్కడి రైతులు అవలంబించే అత్యాధునిక పద్ధతులను స్వయంగా వీక్షించారు. అనంతరం స్థానిక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా సందర్శించారు. ఈ సందర్బంగా మంత్రి తన అనుభవాలను ఎన్నారైలతో పంచుకున్నారు. ఎన్నారైలు అడిగిన పలు ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో తెరాస మలేషియా ఆధ్వర్యంలో చేసిన కార్ ర్యాలీ, కాల్ క్యాంపైనింగ్, మరియు మిగిలిన ఎన్నారై శాఖల సభ్యులతో ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొని తెరాస ప్రభుత్వం అమలుపరుస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరువ చేయడం హర్షీంచదగిన విషయమని ఆయన కొనియాడారు. ఏజెంట్ల చేతిలో మోసపోయిన బాధితులకు, ప్రమాదవశాత్తు మరణించిన వారి పార్ఠివ దేహాలను స్వదేశానికి తరలించడంలో తెరాస మలేషియా ఎన్నారై విభాగం తీసుకున్న చర్యలను అభినందించారు. తెరాస మలేషియా హెల్ప్ లైన్ నంబర్ +60 1118772234 ద్వారా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మారుతి కుర్మ, జనరల్ సెక్రెటరీ కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి,జీవన్, రమేష్ గౌరు, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణరావ్ నడిపెల్లి, రవితేజ, రఘునాత్ నాగబండి, రవిందర్ తదితరులు పాల్గొన్నారు.
మలేషియా ప్రవాసులతో మంత్రి నిరంజన్‌రెడ్డి సమావేశం
Related tags :