ScienceAndTech

ఫోన్‌పే వాడి కొట్లో డబ్బులు తీసుకోవచ్చు

PhonePe Enables Cash Withdrawl At Local Locations

ప్రముఖ డిజిటల్‌ వాలెట్‌ యాప్‌ ఫోన్‌పే తన వినియోగదారులకు ఓ సరికొత్త ఫీచర్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు ఇకపై ఫోన్‌పే యాప్‌ ద్వారా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. అందుకు గాను వారు తమ ఫోన్‌ పే యాప్‌లో ఉండే విత్‌డ్రా క్యాష్‌ ఆప్షన్‌ను ఎంచుకుని తమకు కావల్సిన మొత్తాన్ని అందులో ఎంటర్‌ చేసి దాన్ని వ్యాపారికి ట్రాన్స్‌ఫర్‌ చేయాలి. దీంతో వ్యాపారి ఆ మొత్తానికి చెందిన నగదును వినియోగదారుడికి ఇస్తాడు. ఈ క్రమంలో వినియోగదారులు ఈ విధానం ద్వారా నిత్యం రూ.1వేయి వరకు వ్యాపారుల వద్ద నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. కాగా ప్రస్తుతం ఈ సదుపాయం కేవలం ఢిల్లీలోని ఫోన్‌పే కస్టమర్లకు మాత్రమే అందుబాటులోకి రాగా.. త్వరలోనే దేశవ్యాప్తంగా ఫోన్‌పే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది.