Politics

శాసనమండలి రద్దుపై రాష్ట్రవ్యాప్త నిరసన

Lot of protests across state on cancelling MLC in Andhra

శాసన మండలి రద్దు తీర్మానాన్ని శాసన సభలో ఆమోదించడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. రద్దు తీర్మానం అప్రజాస్వామికంగా వర్ణించారు. జిల్లా నుంచి అయిదుగురు ఎమ్మెల్సీలుగా మండలిలో కొనసాగుతున్నారు. శాసన సభ తీర్మానం మేరకు పార్లమెంటు దీన్ని ఆమోదిస్తే అయిదుగురు ప్రజాప్రతినిధులు పదవులు కోల్పోనున్నారు. అయిదుగురులో ఇద్దరు స్థానిక సంస్థల కోటాలో ఎన్నిక కాగా.. మరొకరు ఎమ్మెల్యే కోటాలో ఎన్నికయ్యారు. ఒకరు ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి, మరొకరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. వీరందరూ పూర్తిస్థాయిలో గడువు ముగియకముందే పదవి నుంచి తప్పుకొనే పరిస్థితి ఎదురవుతోంది. జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటాలో వైవీబీ రాజేంద్రప్రసాద్‌, బుద్దా వెంకన్న జిల్లా నుంచి ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేల కోటాలో తెదేపా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బచ్చుల అర్జునుడు ఎన్నికయ్యారు. ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి రామకృష్ణ, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి లక్ష్మణరావు ఎన్నికయ్యారు.
*** వైవీబీ రాజేంద్రప్రసాద్‌
పేరు: వైవీబీ రాజేంద్రప్రసాద్‌
కోటా: స్థానిక సంస్థలు
ఎన్నిక: 2015
పదవి గడువు: 2021 జూన్‌ వరకు
*అనుభవం:
గతంలో 2007 నుంచి 2013 వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు. రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా గుర్తింపు సాధించారు. ప్రస్తుతం గౌరవ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. సర్పంచి, జడ్‌పీటీసీ, ఎంపీటీసీగా పనిచేసిన అనుభవం ఉంది. తెదేపాలో సీనియర్‌ నేతగా కొనసాగుతున్నారు.
**ప్రజల తీర్పు కోరాలి..!
మండలిని రద్దు చేసినా.. పదవులు కోల్పోయినా భయపడేది లేదు. రాజధాని కోసం.. అమరావతి పరిరక్షణ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం. అసెంబ్లీని కూడా రద్దు చేయండి. తిరిగి ప్రజాతీర్పనకు వెళదాం. జగన్‌మోహన్‌రెడ్డి బెదిరింపులకు భయపడేది లేదు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయకత్వంలో రాజీలేని పోరాటం చేస్తాం.
* బుద్దా వెంకన్న
పేరు: బుద్దా వెంకన్న
కోటా: స్థానిక సంస్థలు
ఎన్నిక: 2015
గడువు: 2021 జూన్‌ వరకు
**అనుభవం:
తొలిసారి ఎమ్మెల్సీ. తెదేపా విజయవాడ పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు. గతంలో పలు పదవులు నిర్వహించారు. మండలిలో ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. విజయవాడ కనకదుర్గ పైవంతెన కోసం నిరంతర పోరాటం చేశారు. నిరాహార దీక్షలు కొనసాగించారు.
***తుగ్లక్‌ చర్య..! :
రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన సాగుతోంది. మండలి రద్దు తీర్మానంతో చరిత్ర హీనుడుగా నిలిచిపోతారు. నేను మండలిలో అడుగు పెట్టడం చంద్రబాబునాయుడు పెట్టిన భిక్ష. రాజధాని కోసం, అమరావతి పరిరక్షణ కోసం ఆందోళన ఉద్ధృతం చేస్తాం. అప్రజాస్వామిక బిల్లులను అడ్డుకుంటున్నామనే నెపంతో రద్దు తీర్మానం ఆమోదించడం సీఎం జగన్‌ వైఖరిని తేటతెల్లం చేస్తోంది.
* బచ్చుల అర్జునుడు
పేరు: బచ్చుల అర్జునుడు
కోటా: ఎమ్మెల్యేల కేటగిరి
ఎన్నిక: 2017
గడువు: 2023 మార్చి వరకు
**అనుభవం:
తొలిసారి ఎన్నికయ్యారు. తెదేపా జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. బీసీల కోటాలో నాటి సీఎం చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కువగా నిమగ్నమయ్యారు.
***మొండి వైఖరి సరికాదు..!
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొండి వైఖరికి ఇది నిదర్శనం. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లును మండలిలో వ్యతిరేకించి ఛైర్మన్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపాడాన్ని జీర్ణించుకోలేకపోయారు. కక్షతో తీసుకొనే నిర్ణయాలు సరైనవి కావని చరిత్ర చెబుతోంది. ప్రజాసమస్యలపై నిత్యం పోరాటం చేస్తాం. మండలి వేదికగా పోరాటం చేశాం. ఇప్పుడు జనంలోకి వెళ్లి పోరాడుతాం. అమరావతిని రక్షించుకుంటాం. ఒక్క ఛాన్సు అంటూ ప్రజలను దారుణంగా మోసం చేశారు.
* కేఎస్‌ లక్ష్మణరావు
పేరు: కేఎస్‌ లక్ష్మణరావు
కోటా: కృష్ణా-గుంటూరు పట్టభద్రలు నియోజకవర్గం, ఎన్నిక: 2019 మార్చి
పదవి గడువు: 2025 మార్చి వరకు
**అనుభవం:
గతంలో 2007 నుంచి 2013 వరకు ఎమ్మెల్సీగా పని చేశారు. 25సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. గుంటూరు హిందూ కళాశాలలో ఉపాధ్యాయులుగా ఎందరో విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దారు
అనుభవం ఉంది: రెండోసారి ఏపీ శాసనమండలిలో సభ్యుడిగా కొనసాగుతున్నారు.
***తండ్రి ఆశయాలకు తూట్లు!
సీఎం జగన్‌ తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పునరుద్థరించిన శాసన మండలిని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మొహన్‌రెడ్డి రద్దు చేయడం పిరికిపంద చర్య. మండలిని పునరుద్ధరిస్తున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ప్రజా సమస్యలపై చర్చించడం కేవలం ఉపాధ్యాయ, పట్టుభధ్రుల ఎమ్మెల్సీలతోనే సాధ్యమని ఆకాంక్షించారు. తండ్రి ఆకాంక్షలను కుమారుడు తుంగలో తొక్కారు.
పేరు: ఏఎస్‌ రామకృష్ణ
కోటా: కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నిక: 2015
గడువు: 2021