* కామారెడ్డి జిల్లా మాచారెడ్డి హెడ్ కానిస్టేబుల్ లచ్చగౌడ్ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీస్‌స్టేషన్ వెనుక ఉరివేసుకుని హెడ్‌కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డారు.
*విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ లో ఉన్న వైస్క్రీన్ సినిమాను ఆర్టీసీ అధికారులు సీజ్ చేసారని వార్త వచ్చింది. ఆర్టీసీకి దాదాపుగా రూ.కోటి మేర ఆ సంస్థ బకాయిలు పడటంతో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. వైస్క్రీన్ గత ఆరు నెలలుగా అద్దెలు చెల్లించడం లేదు. నెలకు రూ.5 లక్షలు చొప్పున చెల్లించాల్సి ఉంది. దీనికి తోడూ సొంత పాత బకాయి కూడా ఉంది.
* దేశ రాజధాని దిల్లీలోని ఏపీ భవన్ సమీపంలో కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారు రోడ్డుపై వెళ్తున్న సమయంలోనే ఒక్కసారిగా మంటల రావడంతో అందులోని ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై దిగిపోయారు. దీంతో వారికి ప్రమాదం తప్పింది. కాసేపటి తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను పూర్తిగా ఆర్పివేశారు
*వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిందని మాజీ మంత్రి తెదేపా నేత నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. వివేకా హత్యను వైఎస్ జగన్ రాజకీయ లబ్దికోసం వాడుకున్నారని ఆరోపించారు. ఈమ్రకు మంగళవారం ఆయన వరుస ట్విట్లు చేసారు.
* రంగారెడ్డి జిల్లా ఇబ్రహిపట్నం మండలం కందుకూరులో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఒంటిరిగా ఉన్న 80 ఏళ్ల వృద్ధురాలు బాలామణిని గొంతు నుమిలి హత్య చేశారు. ఆ తర్వాత ఆమె ఒంటిపై ఉన్న 10 తులాల బంగారు అభరణాలను ఎత్తుకెళ్లారు. ఇంట్లో హత్య చేసిన దుండగలు.. వృద్ధురాలు మృతదేహన్ని ఇంటి సమీపంలో పడేశారు. ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
* ప్రభుత్వ రవాణా బస్సు వేగంగా ఆటోను ఢీకొని, ఆ రెండూ రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయాయి. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో 9 మంది మరణించారు. 18 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
* మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలం సీరోలు గ్రామంలో విద్యుత్ షాక్‌తో భార్య భర్తలు మృతిచెందారు. సీరోలు ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆలకుంట్ల ఉపేందర్(25), భవాని(22) దంపతులకు ఏడు నెలల కొడుకు ఉన్నాడు. మంగళవారం కూలి పని చేసుకుని భార్యభర్తలు సాయంత్రం ఇంటికి వచ్చారు. చీకటి పడుతున్నసమయంలో భవాని బట్టలు ఉతికి ఇంట్లోని తీగపై ఆరేస్తుండగా కరెంట్ షాక్ తగిలింది. కింద పడిపోతున్న ఆమెను రక్షించే ప్రయత్నంలో ఉపేందర్ పట్టుకోవడంతో ఇద్దరు షాక్‌కు గురై అక్కడికక్కడే చనిపోయారు. బాబు ఏడుస్తుండగా ఇంటి పక్కన వారు గమనించే వచ్చి చూసేసరికి ఇద్దరూ చనిపోయి కనిపించారు.
* తిరుమల శ్రీవారి ఆలయం వెనుక అనంతాళ్వారుతోటకు సమీపంలో మంగళవారం రాత్రి గంటల సమయంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. గుర్తుతెలియని వ్యక్తి శరీరానికి అంటుకున్న మంటలతో కేకలు వేస్తూ కనిపించాడు. ఆయన్ను గమనించిన భద్రతా సిబ్బంది బెడ్ షీట్లతో మంటలు ఆర్పిహుటాహుటిన తిరుపతి రుయాస్పత్రికి తరలించారు.
* తమ నాయకుడికి వైస్ చైర్మన్ పదవి దక్కలేదన్న బాధతో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సూర్యాపేటలో చోటుచేసుకుంది.
* మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ ప్రాంతం కరోండ్‌లో కదులుతున్న కారులో ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. దీంతో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
* నెక్కొండ రైల్వే స్టేషన్లలో, స్పెషల్ టిక్కెట్ చెకింగ్ స్కాడ్ చౌవాన్ లక్ష్మణ్ , ఆర్ పి ఎఫ్, ఎఎస్ఐ నరేందర్, పరశురాం ల ఆధ్వర్యంలో, ముపై మంది టికెట్ కలెక్టర్లు, పదిహేను మంది ఆర్పిఎఫ్ సిబ్బంది తో, తనిఖీలు. భారీగా దొరికిన టికెట్ లేని ప్రయాణికులు. రైల్వే కోర్టుకి తరలింపు…
* శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఖాత్తర్, బెహరన్, కువైట్ దేశాలకు తప్పుడు పత్రాలతో కడప జిల్లా చెందిన. 3 గురు మహిళాలను పంపు తుండగా, మహిళలతో పాటు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
పక్కసమాచారం తో, ఇద్దరు ఏజెంట్లు ఖాజా, జబ్బర్. మహిళ లను అదుపులోకి తీసుకోని దర్యాప్తుచేస్తున్నా
ఏయిర్ పోర్ట్ పోలీసులు…
* రాజాంలో నిన్న పెట్రోల్ దాడిలో దాడిలో గాయపడిన మైనర్ బాలిక నేడు చికిత్స పొందుతూ మృతి చెందింది. శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు కన్నుమూసింది.
* బల్లి పడ్డ ఆహారం తిని ఇరవై అయిదు మంది వసతి గృహ విద్యార్థులు అవస్థలకు గురైన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కోటగిరి బిసి వసతి గృహంలో మంగళవారం రాత్రి విద్యార్థులు భోజనం చేస్తుండగా భోజనంలో బల్లి కనిపించింది. అన్నంలో బల్లిని చూసిన విద్యార్థులు అన్నం తినకుండా పడేశారు. ముందుగా భోజనం చేసిన విద్యార్థులు కొందరు వాంతులు చేసుకోవడంతో చికిత్స నిమిత్తం కోటగిరి ఆస్పత్రికి తీసుకొచ్చారు. 25మంది విద్యార్థుల్లో 8మంది కడుపు నోస్తుందని చెప్పడంతో వారిని బోధన్ ఆస్పత్రికి తరలించారు.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు…
* ఒడిశాలోని గంజాం జిల్లా పట్టాపూర్ పరిధి తప్తపాణి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు.
* కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో మహిళా సెక్యూరిటీ గార్డులను లైంగికంగా వేధిస్తున్న…ట్రిపుల్ ఐటీ ఎస్ఓ అర్జున్ నాయక్ (సి.ఐ) అధికారిపై వేటు పడింది.మహిళా సెక్యూరిటీ గార్డుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు రావడంతో…అతనిపై జరిగిన విచారణలో వేధింపులకు పాల్పడినట్లు రుజువు కావడంతో…ట్రిపుల్ ఐటీలో ఎస్ఓ గా విధులు నిర్వహిస్తున్న సిఐ అర్జున్ నాయక్ తమకొద్దంటూ…జిల్లా ఎస్పీ అన్బురాజన్ కు ట్రిపుల్ ఐటీ అధికారులు లేఖ పంపనున్నారు.
* మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు
*రాజధాని కోసం మరో గుండె ఆగిపోయింది. రాజధానిని తరలిస్తున్నారని మనస్తాపానికి గురై తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన భారతి (55) అనే మహిళ గుండెపోటుతో మృతి చెందారు. ఈ మేరకు ఆమె బంధువులు తెలిపారు. గత కొన్ని రోజులుగా రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనల్లో భారతి పాల్గొన్నారు.
*పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం. 13 ఏళ్ల మైనర్ బాలికపై హత్యచారం చేసిన జహంగీర్ { 30 } అనే కామాందుడు.
బాలిక తల్లిదండ్రులు , తండ్రి వాచ్మెన్ గా పని చేస్తాడు , తల్లి ఇళ్ళల్లో పనిచేస్తూ , ప్రతిరోజు ఉదయం పూట పాల ప్యాకెట్లు వేసి , సాయంత్రం డబ్బును వసూలు చేసుకునేవారు.జహంగీర్ బాలిక ఇంటి పక్కనే ఉంటాడు, స్థానికంగా ఉన్న ఎంఎస్ మక్తా లో పంచర్ షాప్ నడుస్తూ ఉంటాడు. సాయంత్రం పూట తల్లిదండ్రులు లేని సమయంలో ఈ కామాంధుడు , బాలికకు మాయమాటలు చెప్పి గత పది రోజులుగా ఆమెపై అత్యాచారం చేస్తున్నాడు. సాయంత్రం తల్లిదండ్రుల ఇంటికి రాగానే నీరసంగా కూర్చున్న తన కూతుర్ని చూసి ఏమైందమ్మా తల్లి అడిగింది , ఆ బాలిక ఏడుస్తూ జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది.తల్లిదండ్రులు జహంగీర్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు , కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.పరారీలో కామాంధుడు జహంగీర్…
*నాసిక్ ల్లాలో మంగళవారం ఓ బస్సు, ఆటో ఢీకొని పక్కనే ఉన్న బావిలో పడిన దుర్ఘటనలో కనీసం 21 మంది మరణించారు. 18 మందికి పైగా గాయపడ్డారు. ప్రయాణికులతో కిక్కిరిసిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు అతివేగంగా దూసుకువెళ్లి ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొంది. అంతే వేగంతో ఆటోను కూడా వెంట ఈడ్చుకుని వెళుతూ రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయిందని పోలీసులు తెలిపారు.
*క్షమాభిక్ష పిటిషన్ను సవాలు చేస్తూ నిర్భయ దోషి ముకేశ్ కుమార్ సింగ్ వేసిన పిటిషన్కు సంబంధించిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం రిజర్వ్లో పెట్టింది. బుధవారం తీర్పును వెలువరించనున్నారు. ముకేశ్ వేసిన పిటిషన్ను జస్టిస్ ఆర్.భానుమతి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారించింది. ముకేశ్ తరపున సీనియర్ న్యాయవాది అంజనా ప్రకాశ్ హాజరుకాగా, ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. న్యాయస్థానం ఎదుట ఇరువురు తమ వాదనలు వినిపించారు.
*విజయనగరం జిల్లా వేపాడలో జాతర సందర్భంగా నిర్వహించిన గుర్రపు పందేల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. మరిడిమాంబ జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గుర్రపు పందెం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను తలకించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోటీలు ప్రారంభం కాగానే జోరందుకున్న ఓ గుర్రం జనసందోహం పైకి దూసుకొచ్చింది. ఈ హఠాత్పరిణామంతో జనం అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ క్రమంలో స్థానికులు ఒకరిమీద ఒకరు పడిపోయారు.
*ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఓ వ్యక్తిని అపహరించి హత్య చేశారు. గంగులూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని కండెనార్ గ్రామానికి చెందిన బల్దేవ్(30)ని సోమవారం రాత్రి అతని ఇంటి నుంచి అపహరించిన మావోయిస్టులు అనంతరం హతమార్చారు. బల్దేవ్ తాతి భార్య గ్రామ సర్పంచిగా పోటీ చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న వేళ మావోయిస్టులు ఈ చర్యకు పాల్పడ్డారు. తాతి గతంలో హోంగార్డుగా పని చేసినట్లు చెబుతున్నారు.
*తిరుపతి, కర్నూలు నగరాల్లో ఇద్దరు బాలురపై లైంగిక దాడి ఘటనలు చోటు చేసుకున్నాయి. తిరుపతిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న తమ కుమారుడి(14)పై అదే పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడప జిల్లా రైల్వేకోడూరు సమీప గ్రామానికి చెందిన తమ కుమారుడు తిరుపతిలో చదువుతున్నాడు. సంక్రాంతి సెలవుల అనంతరం పాఠశాలకు వెళ్లిన తమ కుమారుడిపై వ్యాయామ ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడుతున్నాడని, గాయపడ్డ తమ కుమారుణ్ని రుయాలో చేర్చామని తెలిపారు.
*పురుగుమందు పిచికారీ పనులకు వెళ్లిన ఓ మహిళ మృతి చెందిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. పెదపాడు మండలం కొత్తూరుకు చెందిన బొడ్డు నాగలక్ష్మి, పెద్దిబోయిన దుర్గ, బొడ్డు కుమారి మంగళవారం ఉదయం గ్రామంలోని మినుము, పెసర పైర్లకు పురుగు మందు పిచికారీ పనులకు వెళ్లారు. నాగలక్ష్మి భర్త దుర్గారావు పురుగు మందు పిచికారీ చేస్తుండగా.. ఆ ప్రభావానికి మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
* పంజాగుట్టలో దారుణం జరిగింది. మైనర్ బాలిక (13ఏళ్లు)పై జహంగీర్ అనే కామంధుడు అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులు పంజాగుట్టలో కూలీ పనులు చేసుకుంటున్నారు. ఆ బాలిక ఇంటి పక్కనే ఉంటున్న జహంగీర్ ఎంఎస్ మక్తాలో పంక్చర్ షాపు నడుపుతున్నాడు. అయితే బాలిక తల్లిదండ్రులు ఎవరు లేని సమయంలో మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారం చేశాడు. గత కొన్ని రోజులుగా బాలికను అత్యాచారం చేస్తున్నాడు. అయితే మంగళవారం నిరసంగా ఉన్న బాలికను తల్లిదండ్రులు ప్రశ్నించగా అసలు విషయం తెలిసింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు జహంగీర్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
* శావల్య పురం లో…. ఇంటి ముందు పార్కింగ్ చేసిన ఈనోవా కారు ను చోరి జరిగింది.. శావల్య పురం జాతీయ రహదారి రోడ్డు ప్రక్కనే ఇంటి ముందు పార్కింగ్ చేసిన కారు.
హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య-నేరవార్తలు
Related tags :