* ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు ఊహించని షాక్ తగిలింది. దేశ్ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఆయా రాజకీయ పార్టీలకు ఎన్నికల సలహాలు ఇస్తూ వాటి రద సారధులను ముఖ్యమంత్రి పీటం ఎక్కిస్తున్న పీకేకు రాజకీయంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం పీకే బీహార్ లో అధికారంలో ఉన్న జనతా దళ్ పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆపార్టీ అద్యక్షుడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పీకేకు పార్టీ ఉపాధ్యక్షుడిగా హోదా కల్పించారు.
*భాజపాలో చేరిన సైనా నెహ్వాల్
బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ భాజపాలో చేరారు. బుధవారం మధ్యాహ్నం భాజపా కేంద్ర కార్యాలయంలో ఆమె కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తమ పార్టీలోకి విచ్చేసిన సైనాకు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పార్టీ కండువా కప్పి సభ్యత్వ రసీదును అందజేశారు. సైనాతో పాటు ఆమె సోదరి చంద్రాన్హూ నెహ్వాల్ కూడా భాజపాలో చేరారు. ఈ సందర్భంగా సైనా మాట్లాడుతూ.. భాజపాలో చేరడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. దేశం కోసం పనిచేసే పార్టీలో చేరడం సంతోషంగా ఉందని చెప్పారు. తనకు కష్టపడేవారంటే ఎంతో ఇష్టమనీ.. అందుకే దేశం కోసం కష్టపడుతున్న మోదీ నేతృత్వంలో పనిచేయాలని భాజపాలో చేరినట్టు స్పష్టంచేశారు. క్రీడాభివృద్ధికి మోదీ సర్కార్ ఎంతో చేసిందన్న సైనా.. కష్టపడి దేశానికి సేవచేయడానికి తనవంతు కృషిచేస్తానని చెప్పారు.
*కేంద్ర మంత్రిపై ఈసీ వేటు…
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మలకు ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి వీరిరువురిని తక్షణం తొలగించాలని ఎన్నికల సంఘం బుధవారంనాడు ఆదేశించింది.’దేశద్రోహులను కాల్చిచంపండి’ అంటూ ఈనెల 27న రితాలలో జరిగిన బహిరంగ సభలో పలుమార్లు ఠాకూర్ నినాదాలిచ్చినట్టు ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఒక నివేదకలో ఈసీఐకి తెలిపారు. ఠాకూర్‌కు ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు ఇస్తూ, ఈనెల 30వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ సైతం ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘లక్షలాది మంది ప్రజలు అక్కడ (షహీన్ బాగ్)లో గుమిగూడారు. వాళ్లు మీ ఇళ్లల్లోకి చొరబడొచ్చు, మీ అక్కాచెల్లెళ్లు, కూతుళ్లపై అత్యాచారాలు, హత్యలు చేయవచ్చు. ఇవాళ మీకు సమయం ఉంది. రేపు మోదీ కానీ, అమిత్‌షా కానీ మిమ్మల్ని కాపాడలేకపోవచ్చు. ఇప్పుడే ప్రజలు మేల్కోవాలి’ అని ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. వర్మ, ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది.
* కందుల కొనుగోలు సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల కారణంగా రాష్ట్రంలో అన్ని పంటల దిగుబడి అనూహ్యంగా పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన వనపర్తి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు సేకరణ కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ .. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల ద్వారా పంట పొలాలకు సాగునీరు అందించిన కారణంగా దిగుబడులు బాగా పెరిగాయని, వనపర్తి జిల్లాలో వేరుశెనగ, వరి, కందులు వంటి పంటలు బాగా పండాయి అని తెలిపారు.
* వైసీపీ నేతల భూదందాల కోసమే విశాఖ – దేవినేని ఉమ
బుధవారం నందిగామలో 20 రోజులుగా అమరావతి కోసం జరుగుతున్న నిరసన దీక్షా శిబిరాన్ని మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య తో కలిసి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించి వారికి తమ సంఘీభావం తెలియజేశారు. అనంతరం నందిగామ పట్టణంలో జరిగిన బైక్ ర్యాలీ లో దేవినేని ఉమామహేశ్వరరావు, తంగిరాల సౌమ్య లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ జిఎన్ రావు కమిటీ నివేదిక లోని అంశాలను ప్రభుత్వం తొక్కిపెట్టి నివేదికను బయటపెట్టకుండా ప్రజలను మభ్యపెట్టి విశాఖకు రాజధాని తీసుకువెళ్లాలని ప్రయత్నించారని కానీ హైకోర్టు నిర్ణయంతో నివేదికలోని అంశాలు వెలుగులోకి వచ్చాయని ప్రతి ఒక్కరూ కమిటీలోని అంశాలను గ్రామాలలో వివరించాలని కోరారు.
* మంత్రి మోపిదేవి వెంకటరమణ పాయింట్స్ …..
మండలి రద్దుపై కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందిమండలి రద్దును అడ్డుకునేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారుకేంద్రం నుంచి మండలి రద్దు సమాచారం రాగానే మంత్రి పదవికి రాజీనామా చేస్తాను
మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులు తమ ల్యాండ్ బ్యాంక్‌కు నష్టం జరుగుతుందనే చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారుచంద్రబాబు కనుసన్నల్లో మండలిని ఎలా నడిపిస్తారు.
* మండలి రద్దు చేస్తే వైసీపీకే నష్టం: టీడీపీ ఎమ్మెల్యే
ఏపీ శాసన మండలిని రద్దు చేయడం వల్ల భవిష్యత్ లో వైసీపీకే నష్టమని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు అన్నారు. వ్యవస్ధను రద్దు చెయ్యడం వెనుక బలమైన కారణాలుండాలి కానీ రాజధాని బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారన్న ఉక్రోశంతో మండలిని రద్దు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. వచ్చే ఏడాదికి వైసీపీకి ఉన్న ఎమ్మెల్యే సంఖ్యా పరంగా మండలిలో అధికార పార్టీ సభ్యులు పెరిగేందుకు అవకాశం ఉందని చెప్పారు. 2004లో వైఎస్సార్ మండలిని పునరుద్దరించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారని, మళ్లీ ఇప్పుడు జగన్ దాన్ని రద్దు చేస్తానని చెప్పడంపై అసహనం వ్యక్తం చేశారు. రద్దు చేయ్యాలంటే దానికి కేంద్రం, రాష్ట్రపతి ఆమోదం అవసరమని చెప్పారు.
* చెల్లికే న్యాయం చేయలేని జగన్.. రాజీనామా చేయాలి: పంచుమర్తి అనురాధ
వైఎస్ వివేకా హత్య కేసును ఎందుకు సీబీఐ విచారణకు ఇవ్వడం లేదని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. నేడు ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. తన తండ్రి హత్యపై సీబీఐ విచారణ జరపాలని ఏపీ సీఎం జగన్ చెల్లి కోర్టుకెళ్లిందన్నారు.తన చెల్లికే న్యాయం చేయలేని జగన్.. సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. సీబీఐ విచారణ జరపాలని విపక్ష నేతగా జగన్ డిమాండ్ చేయలేదా? అని అనురాధ ప్రశ్నించారు. సిట్ అధికారులను మూడు సార్లు మార్చాల్సిన అవసరమేంటని నిలదీశారు. వివేకా హత్యలో మీకు ప్రమేయం లేకుంటే.. సీబీఐ విచారణ వేయడానికి ఎందుకు భయపడుతున్నారని అనురాధ ప్రశ్నించారు
* మందబలంతో జగన్ రెచ్చిపోతున్నారు: బచ్చుల అర్జునుడు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కమిటీ నివేదికలను మార్చేసి అసెంబ్లీ, ప్రజలను తప్పుదోవపట్టించారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిని అభివృద్ధి చేయలేని దద్దమ్మ విశాఖను చేస్తారా? అని ప్రశ్నించారు. మందబలంతో జగన్‌రెడ్డి రెచ్చిపోతున్నారని విమర్శించారు. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యపై ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశించడం లేదని బచ్చుల అర్జునుడు ప్రశ్నించారు.
*అందుకే కేసీఆర్ పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు- లక్ష్మన్
ఎం ఐ ఎం అధినేత అసదుద్దీన్ వోవైసీతో మిత్రత్త్వం కోసమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని భాజపా తెలంగాణ అద్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ఈరోజు ఆయన మీదియాటి మాట్లాడుతూ సిఏఏను అడ్డుకోవడమంటే పాకిస్తాన్ ముస్లీంలకు మనదేశ పౌరసత్వ కోరడమేనని అన్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కేసేఆర్ కు తగిన బుడ్డి చెప్పారని లక్ష్మన్ అన్నారు.
*విశాఖలో భూదందా కోసమే జగన్ తాపత్రయం- కన్నా
విశాఖ ప్రజలపై ముఖ్యమంత్రి జగన్ కు ఎటువంటి ప్రేమాభిమానాలు లేవని కేవలం అక్కడ భూదందా కోసమే రాజధాని మారుస్తున్నారని భాజపా రాష్ట్ర శాఖ అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్సించారు. ఇందుకోసమే బీ.ఎం.రావుకమితీ వేసారని, ఆకమితీ చెప్పింది ఒక్కటేనని జగన్ చెబుతున్నది మరొకటని విమర్శించారు. ఈరోజు ఓ చానెల్ ప్రతినిధితో మాట్లాడుతూ విపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జైకొట్టి అధికారంలోకి రాగానే మాటమార్చిన జగన్ ప్రజల్ని నిలువునా వంచిస్తున్నర్నై ధ్వజమెత్తారు.
*దేశః ఆర్ధిక వ్యవస్థలను ఇలా తయారు చేసేసారు బడ్జెట్ నేపద్యంలో రాహుల్ గాంధీ ట్విట్
మోడీతో పాటు ఆయనకు తగ్గ ఆర్ధిక సలహాదారుల బృందం ఆర్ధిక వ్యవస్థను తారుమారు చేసింది. అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్త్షలు గుప్పించారు. గతంలో దేహ జీడీపీ 7.5 శాతంగా ద్రవ్యోల్బణం 3.5 శాతంగా ఉండేదని పేర్కొన్నారు. ఇప్పుడు మాత్రం జీడీపీ 3.5 శాతంగా ద్రవ్యోల్బణం 7.5 శాతంగా ఉందని విమర్శించారు. కుదేలైన ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దేందుకు తదుపరి ఏం చేయాలన్న విషయంపై ప్రధాని మోడీతో పాటు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి వడ ఎటువంటి పరిష్కారం మార్గం లేదని ఆయన ట్విట్ చేసరు.
* మోదీజీ..ఈ మూడింటిపై నోరు మెదపండి!
కేంద్ర బడ్జెట్ మరో మూడు రోజుల్లో ముందుకొస్తున్న క్రమంలో మోదీ సర్కార్‌ను లక్ష్యంగా చేసుకుని కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం విమర్శలు గుప్పించారు. మోదీ హయాంలో ఆర్థిక వ్యవస్ధ కుదేలైన తీరును ప్రస్తావించారు. పన్ను రాబడి పడిపోయిందని, రిటైల్ ద్రవ్యోల్బణం చుక్కలు చూస్తోందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి వెచ్చించే నిధుల్లో కోత వేశారని వీటిపై ప్రధాని మోదీ నోరుమెదపాలని దుయ్యబట్టారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దుందుడుకు ధోరణిని విడనాడి ఆరేళ్లలో కూడా అచ్ఛేదిన్ (మంచిరోజులు) ఎందుకు రాలేదో ఓటర్లకు వివరించాలని చురకలు వేశారు. వాస్తవాలను విస్మరించి ప్రధాని, కేంద్ర మంత్రులు భ్రమల్లో విహరిస్తున్నారని చిదంబరం ట్వీట్ చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఢిల్లీలోని తిహార్ జైలులో 100 రోజులు పైగా గడిపిన చిదంబరం బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. మోదీ సర్కార్ ఆర్థిక వ్యవస్థను సరిగ్గా నిర్వహించడం లేదని తరచూ చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
*కరీంనగర్ మేయర్‌గా సునీల్‌రావు
కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా సునీల్‌రావు పేరును తెరాస అధిష్ఠానం ఖరారు చేసింది. తాజా ఎన్నికల్లో తెరాస 33 డివిజన్లను కైవసం చేసుకుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటకు మేయర్ ఎన్నిక జరగనుంది. స్వతంత్రంగా గెలిచిన ఏడుగురు సభ్యులు తెరాసలో చేరడంతో కరీంనగర్ కార్పోరేషన్లో తెరాస బలం 40కి చేరింది. కరీంనగర్‌లోని 60 స్థానాలకుగాను తెరాస 33, భాజపా 13, ఎంఐఎం 7, ఇతరులు ఏడు డివిజన్లు గెలుచుకున్నారు. స్వతంత్ర అభ్యర్థులు ఏడుగురు నిన్న తెరాసలో చేరారు.
*అప్రజాస్వామిక నిర్ణయాలను అడ్డుకుంటాంయనమల
అక్రమ, రాజ్యాంగ విరుద్ధమైన బిల్లులను అడ్డుకుంటామని శాసన మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. కాకినాడలోని జిల్లా తెదేపా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్రెడ్డి వంటి వ్యక్తులుంటారని ముందుగానే ఊహించిన అంబేడ్కర్.. రాజ్యాంగంలో చెక్ అండ్ బ్యాలెన్స్ కోసం సెలక్ట్ కమిటీ నిబంధనలు పెట్టారని గుర్తుచేశారు. మండలి రద్దుకు ఆర్డినెన్స్ తెచ్చినా, అదీ మండలికి రావాల్సిందేనని దానినీ అడ్డుకుంటామని తెలిపారు. త్వరలో గవర్నరును కలుస్తామని, అవసరమైతే అఖిల పక్షం ఆధ్వర్యంలో దిల్లీ వెళ్తామని చెప్పారు. మండలి రద్దుకు కనీసం రెండేళ్లు పడుతుందని తెలిపారు. మాజీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ.. హింసించే సీఎంగా జగన్మోహన్రెడ్డి రికార్డు సృష్టించారన్నారు.కార్యక్రమంలో ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు పాల్గొన్నారు.
*వేధించినా వెనక్కి తగ్గం: జయదేవ్
పోలీసులు కేసులు పెట్టి వేధించినా అమరావతి ఉద్యమం ఆగదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన గల్లా జయదేవ్, బత్తిన శ్రీనివాసరావు, దామోదర్‌లపై తుళ్లూరు పోలీసులు పెట్టిన రెండో కేసులో ముగ్గురూ ముందస్తు బెయిల్ దారు. ఆ పత్రాలను మంగళగిరి కోర్టులో సమర్పించగా జడ్జి వి.వి.ఎన్.వి.లక్ష్మి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీచేశారు. కోర్టు వెలుపల మీడియాతో జయదేవ్ మాట్లాడుతూ.. ఒకే ఠాణాలో, ఒకే సెక్షన్‌తో ఇద్దరు వేర్వేరు కానిస్టేబుళ్లతో తమపై కేసులు పెట్టించారన్నారు. పోలీసుల వేధింపులను తాను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు.
*మండలి వైఎస్ మానసపుత్రిక-తులసిరెడ్డి
శాసన మండలి నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మానసపుత్రిక అని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్.తులసిరెడ్డి పేర్కొన్నారు. అలాంటి మండలిని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం తీర్మానం చేయడం వైఎస్‌కు వెన్నుపోటు పొడిచినట్లు కాదా అని ప్రశ్నించారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
*విశాఖ పాలనా రాజధాని కాకుండా ఎవరూ ఆపలేరు-ఎంపీ విజయసాయిరెడ్డి
కొన్ని రోజులు ఆలస్యమవుతుందేమోగానీ విశాఖను పాలనా రాజధాని కాకుండా ప్రపంచంలో ఎవరూ ఆపలేరని వైకాపా ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం విశాఖలో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటుకు అడ్డుపడుతున్నాయని, వాటన్నింటినీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధిగమించి తన ప్రయత్నంలో విజయం సాధిస్తారని పేర్కొన్నారు. శాసన మండలి రద్దును కేంద్రం ఆమోదిస్తుందని భావిస్తున్నామన్నారు. రాజధాని మార్పునకు భాజపా వ్యతిరేకమో కాదో తెలియదుగానీ సుజనా చౌదరి మాత్రం వ్యతిరేకంగా ఉన్నారని వ్యాఖ్యానించారు
*రద్దు సబబుకాదు: గంటా
శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానించడం సరికాదని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం విశాఖలో విలేకర్లతో ఆయన మాట్లాడారు. సీఆర్డీఏ చట్టం రద్దు, పాలన వికేంద్రీకరణ బిల్లులను సెలక్టు కమిటీకి పంపుతూ మండలి తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా పరిగణించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.
*అహంతో వ్యవహరిస్తున్నారు: బుద్దా
సీఎం జగన్ అహంతో వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. మండలి రద్దుకు నిరసనగా విజయవాడలో ఆయన ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. దీంతో పోలీసులు బుద్దా వెంకన్న నివాసానికి చేరుకుని ర్యాలీకి అనుమతి లేదంటూ గృహ నిర్బంధం చేశారు.
*నీతీశ్, ప్రశాంత్ కిశోర్ మాటల యుద్ధం
ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ నేత ప్రశాంత్ కిశోర్‌కు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నీతీశ్ కుమార్‌కు మధ్య మంగళవారం తీవ్ర మాటల యుద్ధం జరిగింది. పార్టీలో కొనసాగాలా.. వద్దా.. అన్నది ప్రశాంత్ తేల్చుకోవాలని నీతీశ్ వ్యాఖ్యానించారు.
ప్రశాంత్ కిశోర్ 2018 సెప్టెంబర్‌లో జేడీయూలో చేరారు. నీతీశ్ కుమార్ ఆయనను పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. అయితే జేడీయూ మిత్రపక్షమైన భాజపాపై ప్రశాంత్ కిశోర్ కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్నారు. పౌరసత్వ సవరణ బిల్లు విషయంలో ఆ పార్టీని సమర్థించాలన్న జేడీయూ నిర్ణయాన్ని కిశోర్ తప్పుపట్టారు. ఈ ఏడాది చివర్లో జరిగే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా కన్నా ఎక్కువ సీట్లలో తమ పార్టీ పోటీ చేయాలన్నారు. దీనికితోడు దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కోసం ఆయన పనిచేస్తున్నారు.
*జధాని రైతులకు భరోసాగా నిలుద్దాం
రాజధాని కోసం భూములను త్యాగం చేసిన రైతుల వద్దకు భాజపా, జనసేన నాయకులు సంయుక్తంగా వెళ్లి వారికి అండగా నిలవాలని ఉభయ పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో నేతలు నిర్ణయం తీసుకున్నారు. రైతులకు భరోసా కల్పించాలని, అమరావతి రాజధాని విషయంలో రెండు పార్టీలూ పోరాటం చేయాలని సంకల్పించారు. ఇరు పార్టీలు కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని నిశ్చయించుకున్నారు. క్షేత్ర స్థాయిలో కమిటీలను నియమించాలని నిర్ణయించారు. ఉభయ పార్టీల అధ్యక్షుల ఆమోదం తర్వాత కమిటీ సభ్యులను ఎంపిక చేయనున్నారు. విజయవాడలో మంగళవారం 2 పార్టీల నాయకులు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. భాజపా నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, సోము వీర్రాజు, శాంతారెడ్డి… జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, టి.శివశంకర్, కందుల దుర్గేష్, సిహెచ్.మధుసూదన్‌రెడ్డి, గంగులయ్య, శ్రీనివాస యాదవ్, నాయకర్, మనుక్రాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
*అప్రజాస్వామిక నిర్ణయాలను అడ్డుకుంటాం-యనమల
అక్రమ, రాజ్యాంగ విరుద్ధమైన బిల్లులను అడ్డుకుంటామని శాసన మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. కాకినాడలోని జిల్లా తెదేపా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్రెడ్డి వంటి వ్యక్తులుంటారని ముందుగానే ఊహించిన అంబేడ్కర్.. రాజ్యాంగంలో చెక్ అండ్ బ్యాలెన్స్ కోసం సెలక్ట్ కమిటీ నిబంధనలు పెట్టారని గుర్తుచేశారు. మండలి రద్దుకు ఆర్డినెన్స్ తెచ్చినా, అదీ మండలికి రావాల్సిందేనని దానినీ అడ్డుకుంటామని తెలిపారు. త్వరలో గవర్నరును కలుస్తామని, అవసరమైతే అఖిల పక్షం ఆధ్వర్యంలో దిల్లీ వెళ్తామని చెప్పారు.
*దేశ ప్రతిష్ఠను ధ్వంసం చేస్తున్నారు
శాంతి, సామరస్యతల దేశంగా భారత్‌కున్న ప్రతిష్ఠను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధ్వంసం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. తమ గళం అణచివేతను యువత ఏమాత్రం సహించొద్దని, దేశ భవిష్యత్తు, ఉద్యోగాలపై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. మంగళవారమిక్కడ నిర్వహించిన యువ ఆక్రోశ్ ర్యాలీలో రాహుల్‌గాంధీ మాట్లాడారు. ప్రధానమంత్రి ఆర్థికశాస్త్రం చదువుకోలేదని, ఆయన జీఎస్టీని అర్థం చేసుకోలేరని వ్యాఖ్యానించారు. మోదీ ఎక్కడకు వెళ్లినా సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ వంటి అంశాలపై మాట్లాడతారని, వాస్తవ సమస్యలైన నిరుద్యోగం వంటి వాటిపై కాదని విమర్శించారు.
పీకేకు దిమ్మతిరిగే షాక్-రాజకీయ
Related tags :