ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో కుర్రకారుని ఆకట్టుకున్న బ్యూటీ మెహ్రీన్ పిర్జాదా. బొద్దు అందాలతో ముద్దుగా కనిపించే ఈ హానీ బ్యూటీ, ప్రస్తుతం కెరీర్ పరంగా ఫ్రస్టేషన్ లో ఉంది. రెండు పదుల చిత్రాలకి చేరువైన ఈమె కెరీర్ లో విజయాలను వేళ్ళ మీద లెక్క కట్టవచ్చు. కానీ.., ఈ అమ్మడికి అవకాశాలకి కొదవ లేదు. అయితే వరుస చిత్రాలు చేస్తున్నా.., మెహ్రీన్ ప్లాప్స్ పరంపర మాత్రం కొనసాగుతూనే ఉంది.యిన ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘F2’ తో చివరిసారిగా సక్సెస్ అందుకుంది మెహ్రీన్. తాజాగా 2020 జనవరి నెలలో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చే అద్భుత అవకాశాన్ని దక్కించుకుంది ఈ పంజాబీ పాప. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ నెలలో మెహ్రీన్ నటించిన తమిళ చిత్రం ‘పటాస్’, తెలుగు మూవీ ‘ఎంత మంచివాడవురా’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించలేకపోయాయి.మెహ్రీన్ నటించిన ‘అశ్వద్దామ’ విడుదలకు సిద్దమైంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ మూవీ జనవరి 31 న విడుదల కాబోతోంది. ఈ చిత్రం పై మెహ్రీన్ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ కమర్షియల్ మూవీతోనైనా హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ లోకి రావాలన్నది ఈ హీరోయిన్ ఆలోచన. మరోవైపు మెహ్రీన్ నటించిన తమిళ చిత్రం ‘పటాస్’ తెలుగులో ‘లోకల్ బాయ్’ పేరుతో విడుదల కానుంది. మరి ఈ చిత్రాలతోనైనా మెహ్రిన్ విజయాన్ని అందుకొని హనీ ఈజ్ దా బెస్ట్ అనిపించుకుంటుందేమో చూడాలి.
మెహ్రీన్‌కు గడ్డుకాలం
Related tags :