బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ భాజపాలో చేరారు. బుధవారం మధ్యాహ్నం భాజపా కేంద్ర కార్యాలయంలో ఆమె కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తమ పార్టీలోకి విచ్చేసిన సైనాకు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పార్టీ కండువా కప్పి సభ్యత్వ రసీదును అందజేశారు. సైనాతో పాటు ఆమె సోదరి చంద్రాన్సూ నెహ్వాల్ కూడా భాజపాలో చేరారు. ఈ సందర్భంగా సైనా మాట్లాడుతూ.. భాజపాలో చేరడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. దేశం కోసం పనిచేసే పార్టీలో చేరడం సంతోషంగా ఉందని చెప్పారు. తనకు కష్టపడేవారంటే ఎంతో ఇష్టమనీ.. అందుకే దేశం కోసం కష్టపడుతున్న మోదీ నేతృత్వంలో పనిచేయాలని భాజపాలో చేరినట్టు స్పష్టంచేశారు. క్రీడాభివృద్ధికి మోదీ సర్కార్ ఎంతో చేసిందన్న సైనా.. కష్టపడి దేశానికి సేవచేయడానికి తనవంతు కృషిచేస్తానని చెప్పారు.
భాజపాలో చేరిన సైనా
Related tags :