కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లకు హోమియోపతి, యునాని ఔషధాలు సమర్ధంగా పనిచేస్తాయని కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ బుధవారం సూచించింది. కరోనా వైరస్ రాకుండా నివారించేందుకు మూడు రోజుల పాటు పరగడుపున హోమియో మందు ఆర్సెనికమ్ ఆల్బమ్ 30 తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇదే డోసేజీని నెల రోజుల తర్వాత మరోసారి వేసుకోవాలని తెలిపింది. అదే విధంగా కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ల నివారణకు ఆయుర్వేద మందులు, యునానీ డికాషన్లు, వంటింటి చిట్కాలు కూడా పనిచేస్తాయని ఆయుష్ సూచించింది. అంతేగాక వ్యక్తిగత పరిశుభ్రత కూడా ఈ వ్యాధుల నివారణకు ముఖ్యమని పేర్కొంది. తరచు కనీసం 20 సెకండ్ల పాటు సబ్బుతో చేతులు కడుక్కోవడం, చేతులు కడుక్కోకుండా కళ్లు, ముక్కు, నోటిని తాకడం చేయకూడదని, అనారోగ్యంగా ఉన్న వారితో సన్నిహితంగా ఉండడం మానుకోవాలని కూడా మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రయాణాలలో లేదా పనిచేసే సమయంలో దగ్గు లేదా తుమ్ములు వంటివి తరచు వస్తుంటే నోటికి మాస్కు ధరించాలని, కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తే నోటికి మాస్కు ధరించి వెంటనే సమీపంలోని ఆసుపత్రిని సంప్రదించాలని కూడా ఆయుష్ సూచించింది.
కరోనాపై హోమియో మందులు పనిచేస్తాయా?
Related tags :