ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి అమెరికా నుండి తరలి వచ్చిన తానా నేతలు మంగళవారం నాడు తెలంగాణాలో ప్రత్యక్షమయ్యారు. హైదరాబాద్‌లో సందడి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. జులై మొదటి వారంలో వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్న తానా మహాసభల గురించి వివరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు తెలుగువారంటే ఎనలేని అభిమానమని ఆయన్ను తానా సభలకు తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నామని అధ్యక్షుడు వేమన సతీష్ తెలిపారు. మాజీ అద్యక్షుడు ఒబామా భార్య మిషెల్ ఒబామాను కూడా తానా సభలకు తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు అందజేశామని తెలిపారు. ఉప-రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ మహాసభలకు హాజరుకావడానికి అంగీకరించారని తెలిపారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి ప్రపంచం నలుమూలల నుండి ఈ మహాసభలకు 20000కు పైగా ప్రతినిధులు హాజరవుతున్నట్లు వెల్లడించారు. తానా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వేమన సతీష్‌తో పాటు తానా ప్రతినిధులు రవి మందడపు, భక్తభల్లా, యార్లగడ్డ శివరాం, గారపాటి ప్రసాద్, ప్రవాసాంధ్రుడు పోలవరపు శివ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను తానా బృందం కలుసుకుంది.
హైదరాబాద్‌లో తానా నేతల సందడి
Related tags :