NRI-NRT

లండన్‌కు ఎగబడుతున్న భారతీయ విద్యార్థులు

Indian Students Craving To Go To London

భారత విద్యార్థులు లండన్ విశ్వవిద్యాలయాల బాట పడుతున్నారు. బ్రిటన్ రాజధానికి వచ్చి చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల సంఖ్యకు సంబంధించి భారత్ మూడో స్థానాన్ని తిరిగి సాధించింది. బ్రిటన్ ఉన్నత విద్య గణాంకాల సంస్థ బుధవారం విడుదల చేసిన సమాచారం ప్రకారం.. 2018-19లో లండన్లో భారత విద్యార్థుల సంఖ్యలో 34.7 శాతం మేర పెరుగుదల నమోదైంది. 2018-19లో లండన్లోని విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య అంతకుముందు ఏడాదితో పోల్చితే 5.8 శాతం మేర పెరిగి 1.25 లక్షలకు చేరింది. 25,650 మంది విద్యార్థులతో ఈ జాబితాలో చైనా మొదటి స్థానం, 7,460 మంది విద్యార్థులతో అమెరికా రెండో స్థానం, 7,158 మంది విద్యార్థులతో భారత్ మూడో స్థానం దక్కించుకున్నాయి. 5,625 మంది విద్యార్థులతో ఇటలీ నాలుగో స్థానానికి పరిమితమైంది.