1. బడ్జెట్ ఎఫెక్ట్… ధరలు పెరిగిన సబ్బుల వివరాలు ఇవే
పామాయిల్ ధరల పెరగడం కారణంగానే పెంచుతున్నట్లు కంపెనీ అధికారులు చెబుతున్నారు. గత 6 నెలల్లో పామాయిల్ ధర 25 నుంచి 30 శాతం పెరిగిందని హెచ్‌యుఎల్ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ శ్రీనివాస్ పాటక్ తెలిపారు.బడ్జెట్‌కు ముందే సామాన్యుడికి షాక్ ఇచ్చింది ఓ కంపెనీ. ప్రముఖ వ్యాపార వాణిజ్య సంస్థ అయిన హిందుస్థాన్ యూనిలీవర్ సామాన్యులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఎఫ్‌ఎంసిజి (FMCG)సంస్థ దశలవారీగా సబ్బు ధరలను 6 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. పామాయిల్ ధర కూడా పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీ ఈ చర్య తీసుకోబోతోందని కంపెనీ తెలిపింది. ఈ ఎఫెక్ట్‌తో సంస్థకు చెందిన చాలా ఉత్పత్తులు ప్రజలలో బాగా ప్రాచుర్యం ఉన్న ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి.
ఈ కంపెనీ బ్రాండ్‌తో ఎన్నో సబ్బులు తయారవుతున్నాయి. ప్రసిద్ధ బ్రాండ్లలో డోవ్, లక్స్, లైఫ్‌బాయ్, పియర్స్, హమామ్, లిరిల్ మరియు రెక్సోనా వంటి సబ్బులు ఉన్నాయి.వాటిని ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ తరగతిప్రజలే ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే వీటి ధరల్ని పామాయిల్ ధరల పెరగడం కారణంగానే పెంచుతున్నట్లు కంపెనీ అధికారులు చెబుతున్నారు. గత 6 నెలల్లో పామాయిల్ ధర 25 నుంచి 30 శాతం పెరిగిందని హెచ్‌యుఎల్ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ శ్రీనివాస్ పాటక్ తెలిపారు. త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన తరువాత మా పోర్ట్‌ఫోలియోలో సబ్బు ధరలను పెంచుతామనిపాథక్ కాన్ఫరెన్స్ కాల్‌లో చెప్పారు. దీని ప్రకారం చూస్తే.. సబ్బుల ధరలు 5 నుంచి 6 శాతం పెరుగుతాయి. ఈ పెరుగుదల దశల వారీగా చేయబడుతుంది. 2019 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో హెచ్‌యుఎల్ నికర లాభం 12.95 శాతం పెరిగి రూ .1,631 కోట్లకు చేరుకుంది. ఈ కాలంలో కంపెనీ అమ్మకాలు 3.87 శాతం పెరిగి రూ .9,953 కోట్లకు చేరుకున్నాయి.
**పామాయిల్ ధరలు ఎందుకు పెరిగాయి:
కాశ్మీర్‌లో సెక్షన్ 370 ను తొలగించడం, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేసిన ప్రకటన తర్వాత మలేషియా నుంచి పామాయిల్ దిగుమతి చేసుకోవడాన్ని భారత్ నిషేధించింది. భారతదేశం ఏటా 15 మిలియన్ టన్నుల కూరగాయల నూనెలను దిగుమతి చేస్తుంది. ఇందులో పామాయిల్ వాటా 9 మిలియన్ టన్నులు. మిగిలిన 6 మిలియన్ టన్నుల సోయాబీన్ మరియు పొద్దుతిరుగుడు నూనె దిగుమతి అవుతున్నాయి. పామాయిల్ ప్రధానంగా ఇండోనేషియా మరియు మలేషియా నుండి వస్తుంది.ఉద్యోగులకు కేంద్రం బడ్జెట్‌లో శుభవార్త చెప్పింది. రూ.5 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు సదుపాయం కల్పిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. రూ.5 లక్షల నుంచి 7.5లక్షల ఆదాయం ఉన్న వారికి 10 శాతమే పన్ను విధించనున్నట్లు తెలిపారు.
రూ.7.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకు 15 శాతం పన్ను, రూ.10 లక్షల నుంచి 12.5 లక్షల వరకు 20 శాతం పన్ను, రూ.15 లక్షలకు పైగా ఆదాయం ఉంటే 30 శాతం పన్ను, రూ.15లక్షల వరకు ఆదాయమున్న వారికి రూ.78వేలు ప్రయోజనం చేకూరనున్నట్లు నిర్మల తెలిపారు. పాత రేట్ల ప్రకారం పన్ను చెల్లించేందుకు కూడా అనుమతిస్తున్నట్లు ఆమె చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు కొత్త రేట్లు ఐచ్చికమేనని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో.. పాత, కొత్త ట్యాక్స్ విధానాలు అమలులో ఉండనున్నట్లు స్పష్టమైంది. కొత్త ట్యాక్స్ విధానం ఎంచుకుంటే 80(సి) కింద వచ్చే మినహాయింపులు రావని కేంద్రం తెలిపింది. అయితే.. రియల్ ఎస్టేట్ రంగానికి కేంద్రం ఊరటనిచ్చింది. రియల్ ఎస్టేట్ కంపెనీలకు మరో ఏడాది పాటు పన్ను మినహాస్తున్నట్లు మోదీ సర్కార్ ప్రకటించింది
2. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. నరేంద్రమోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్ ఇది.
ప్రస్తుతం కొనసాగుతున్న కేంద్ర బడ్జెట్ 2020-21 లైవ్ అప్‌డేట్స్ ఇవి..
2020-21 ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్ హైలైట్స్..విద్యారంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులువిద్యారంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతివిద్య, స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి2026నాటికి 150 వర్సిటీల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం కొత్త కోర్సులుప్రధాన యూనివర్సిటీల్లో ఆన్‌లైన్‌లో డిగ్రీ కోర్సులునేషనల్ పోలీస్, ఫోరెన్సిక్ యూనివర్సిటీ ప్రారంభిస్తాం
భారత్‌లో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థుల కోసం ఇన్సాట్ పరీక్షలుప్రస్తుతం ఉన్న ప్రతి జిల్లా ఆస్పత్రికి మెడికల్ కాలేజీయువ పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి ప్రత్యేక పథకంగ్లోబలైజేషన్‌కు అనుగుణంగా పరిశ్రమల అభివృద్ధి
ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్ సెల్ ఏర్పాటుడ్ బ్యాంక్, ఇతర ప్రభుత్వ అనుమతుల కోసం ప్రత్యేక సెల్‌మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి పీపీపీ విధానంఎలక్ట్రానిక్, మాన్యుఫాక్చరింగ్‌పై ప్రత్యేక దృష్టిమొబైల్ తయారీ పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం
**రంగాలవారీగా కేటాయింపులివే..
జల్‌జీవన్ మిషన్‌కు రూ 11,500 కోట్లు విద్యారంగానికి రూ 99.300 కోట్లు నైపుణ్యాభివృద్ధికి రూ 3,000 కోట్లు కొత్తగా ఐదు స్మార్ట్ సిటీల అభివృద్ధి నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్ మిషన్ ఏర్పాటుకు రూ1480 కోట్లు పరిశ్రమలు, వాణిజ్య రంగానికి రూ 27,300 కోట్లు చిన్న ఎగుమతిదారుల కోసం నిర్విక్ పథకం త్వరలో జాతీయ లాజిస్టిక్స్ పాలసీ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్దపీట రూ 15 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి రూ 2.83 లక్షల కోట్లు
పంచాయితీరాజ్‌కు రూ 1.23 లక్షల కోట్లు ఆరోగ్య రంగానికి రూ 69,000 కోట్లు స్వచ్ఛభారత్ మిషన్‌కు రూ 12,300 కోట్లు
పైప్‌డ్ వాటర్ ప్రాజెక్టుకు రూ 3.6 లక్షల కోట్లు గ్రామీణ మహిళలకు ధాన్యలక్ష్మి ముద్ర స్కీమ్ ద్వారా గ్రామీణ మహిళలకు సాయం గ్రామీణ మహిళలకు ధాన్యలక్ష్మి పేరుతో నూతన స్కీం నాబార్డు ద్వారా రీఫైనాన్స్ పునరుద్ధరిస్తాం
ఆన్‌లైన్‌లో ఆర్గానిక్ ఉత్పత్తులు 16 లక్షలమంది రైతులకు గ్రిడ్ అనుసంధానిత సోలార్ విద్యుత్ సేంద్రియ సాగుచేసే రైతులకు మరిన్ని ప్రోత్సహకాలు ఈ సారి బడ్జెట్ మూడు రంగాల వృద్ధికి ఊతమివ్వనుంది ఒకటి ఆరోగ్యం, రెండోది విద్య, మూడోది ఉద్యోగ కల్పన రైతుల సౌకర్యార్థం రిఫ్రిజిలేటర్‌తో కూడిన కిసాన్ రైలు ఏర్పాటు సివిల్ ఏవియేషన్ ద్వారా కూరగాయల సరఫరాకు కృషి ఉదాన్ పథకం జీరో బడ్జెట్ నేచురల్ ఫామింగ్‌కు చేయూతఆన్‌లైన్‌లో ఆర్గానిక్ ఉత్పత్తుల విక్రయం
**మా ప్రాధాన్యతా అంశాలు ఇవే
తొలి ప్రాధాన్యం : వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి
ద్వితీయ ప్రాధాన్యాంశం : ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరుమూడో ప్రాధాన్యాంశం : విద్య, చిన్నారుల సంక్షేమంరైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం
2022 నాటి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం బడ్జెట్ లక్ష్యంరైతు సంక్షేమానికి 16 కార్యాచరణ ప్రణాళికలు100 కరువు జిల్లాలకు తాగునీరు అందించే పథకాలు26 లక్షల మంది రైతులకు సోలార్ పంపు సెట్లుపేదరికం నుంచి 27 కోట్లమందిని బయటకు తెచ్చాంఇక నుంచి ఇన్‌కం టాక్స్ రిటర్న్‌ల ఫైలింగ్ మరింత సులభతరం చేస్తాంఆరు కోట్ల 11 లక్షల మందికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకవితను చదివి వినిపించిన నిర్మలనా దేశం దాల్ సరస్సులో విరబూసిన కమలం లాంటిదిమానవత్వం, దయతో కూడిన సమాజం అవసరంనా దేశం సైనికుల నరాల్లో ప్రవహిస్తున్న ఉడుకు రక్తంమా దే వికసిస్తున్న షాలిమార్ తోటలాంటిదిజీఎస్టీ శ్లాబుల తగ్గింపుతో సామాన్యులకు మేలుజీఎస్టీతో పన్ను వ్యవస్థలోకి కొత్తగా 60 లక్షల మంది పన్ను చెల్లింపుదారులురూ లక్ష కోట్లస వరకూ జీఎస్టీ ప్రయోజనాలు సామాన్యులకు మళ్లింపు40 కోట్ల జీఎస్టీ రిటర్నులు దాఖలయ్యాయిజీఎస్టీ సమస్యల పరిష్కారానికి జీఎస్టీ మండలి చొరవజీఎస్టీ శ్లాబుల తగ్గింపుతో సామాన్యులకు మేలు జరిగిందిజీఎస్టీ అమలు తర్వాత సామాన్యుల ఖర్చులు 4శాతం వరకు ఆదా అయ్యాయిఅదుపులో ద్రవ్యోల్బణంఎకానమీని సంఘటితపరిచేందుకు చర్యలుఆరోగ్యకరమైన వాణిజ్య వృద్ధికి తోడ్పాటుప్రభుత్వం విస్తృత సంస్కరణలు చేపట్టిందిద్రవ్యోల్బణం అదుపులో ఉందిజీఎస్టీతో సామాన్యులకు నెలకు 4 శాతం వరకూ ఆదాజీఎస్టీచరిత్రాత్మకమైనదిదేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయిఈ బడ్జెట్ దేశ ప్రజల ఆర్థిక స్థోమతను పెంచుతుందికేంద్రం చేపట్టిన సంస్కరణల్లో జీఎస్టీ చరిత్రాత్మకమైనదిఆర్థిక సంస్కరణల్లో జీఎస్టీ కీలకమైనది
*అందరికీ ఇళ్లు
సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందడం లేదురూపాయిలో 15పైసలు మాత్రమే లబ్ధిదారులకు చేరుతున్నాయిప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా అందరికీ ఇళ్లు మంజూరు చేస్తాంభారత్‌లో ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయిప్రజల కొనుగోలు శక్తిని పెంచుతాంప్రజల ఆదాయాలను మెరుగుపరచడమే బడ్జెట్ లక్ష్యంప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌ప్రజల్లో కొనుగోలు శక్తిని ముమ్మరం చేస్తాందివంగత నేత అరుణ్ జైట్లీని గుర్తుచేసిన నిర్మల
3. ఉద్యోగులకు కేంద్రం బడ్జెట్‌లో శుభవార్త చెప్పింది. రూ.5 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు సదుపాయం కల్పిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. రూ.5 లక్షల నుంచి 7.5లక్షల ఆదాయం ఉన్న వారికి 10 శాతమే పన్ను విధించనున్నట్లు తెలిపారు.రూ.7.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకు 15 శాతం పన్ను, రూ.10 లక్షల నుంచి 12.5 లక్షల వరకు 20 శాతం పన్ను, రూ.15 లక్షలకు పైగా ఆదాయం ఉంటే 30 శాతం పన్ను, రూ.15లక్షల వరకు ఆదాయమున్న వారికి రూ.78వేలు ప్రయోజనం చేకూరనున్నట్లు నిర్మల తెలిపారు. పాత రేట్ల ప్రకారం పన్ను చెల్లించేందుకు కూడా అనుమతిస్తున్నట్లు ఆమె చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు కొత్త రేట్లు ఐచ్చికమేనని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో.. పాత, కొత్త ట్యాక్స్ విధానాలు అమలులో ఉండనున్నట్లు స్పష్టమైంది. కొత్త ట్యాక్స్ విధానం ఎంచుకుంటే 80(సి) కింద వచ్చే మినహాయింపులు రావని కేంద్రం తెలిపింది. అయితే.. రియల్ ఎస్టేట్ రంగానికి కేంద్రం ఊరటనిచ్చింది. రియల్ ఎస్టేట్ కంపెనీలకు మరో ఏడాది పాటు పన్ను మినహాస్తున్నట్లు మోదీ సర్కార్ ప్రకటించింది
4. దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో నమోదవుతున్నాయి. ఆదాయపు పన్ను పరిమితి పెంపు, శ్లాబులను సవరించినప్పటికీ.. దీన్ని ఐచ్ఛికంగా నిర్ణయించడంతో మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మందగమనానికి ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించడమే మార్గమని అందరూ భావించారు. ఈ దిశగా బడ్జెట్‌లో ఎలాంటి చర్యలూ లేకపోవడంతో సూచీలు ఒక్కసారిగా దిగజారాయి. మధ్యాహ్నం 1.31 గంటల సమయంలో సెన్సెక్స్ 588 పాయింట్లు కోల్పోయి 40,135 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 244 పాయింట్ల నష్టంతో 11,792 వద్ద ట్రేడవుతోంది. ఓ దశలో సెన్సెక్స్ 700 పాయింట్లు కుదేలైంది. మార్కెట్లు ఉదయం నుంచి నష్టాల్లోనే కొనసాగుతుండడం గమనార్హం.మారిన ఆదాయపు పన్ను శ్లాబులు ఇలా ఉన్నాయి…
* రూ.5 లక్షల నుంచి రూ.7.5లక్షల వరకు రూ.10 శాతం పన్ను.
* రూ.7.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకు 15శాతం పన్ను.
* రూ.10 లక్షల నుంచి రూ.12.5లక్షల వరకు 20శాతం పన్ను.
*రూ.12.5 లక్షల నుంచి రూ.15లక్షల వరకు 25 శాతం పన్ను.
* రూ.15లక్షలకు పైగా వేతనం పొందే వారు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. అయితే దీన్ని ఐచ్ఛికంగా నిర్ణయించారు. మినహాయింపులు పొందాలా?వద్దా? అన్నది వేతన జీవులపై ఆధారపడి ఉంటుంది. పాత విధానంతో పాటు కొత్త విధానం కూడా అమల్లో ఉండనుంది. కొత్త ట్యాక్స్ విధానం ఎంచుకుంటే 80(సి) కింద వచ్చే మినహాయింపులు రావు.
5. బడ్జెట్: ఆరోగ్యానికి రూ.69,000 కోట్లు
2020-21 కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్యానికి 69,000 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ‘టీబీ హారేగా.. దేశ్ జీతేగా’ (టీబీ ఓడిపోతుంది.. దేశం గెలుస్తుంది) అనే కార్యక్రమాన్ని 2025 వరకు కొనసాగించనున్నట్లు ప్రముఖంగా ప్రస్తావించారు. ఇక ఔషదీ కేంద్ర పథకాన్ని దేశంలోని అన్ని జిల్లాల్లో 2024 వరకు కొనసాగించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలను ఓడీఎఫ్‌లుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
6. బడ్జెట్లో జమ్మూ కశ్మీర్‌కి ఏమిచ్చారంటే..
ఆర్టికల్ 370 రద్దు తర్వాత నరేంద్రమోదీ ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, లద్దాక్‌లకు భారీగా ప్యాకేజీలు కేటాయించింది. 2020-21 సార్వత్రిక బడ్జెట్లో భాగంగా జమ్మూ కశ్మీర్‌కు రూ.30,757 కోట్లు, లద్దాక్‌కు రూ.5,958 కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గతేడాది ఆగస్టు 5న కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు కావడంతో పాటు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడిన సంగతి తెలిసిందే.
7. రైల్వే ట్రాక్‌ల పొడవునా సోలార్ పవర్ ప్యానెళ్లు: నిర్మల
2020 బడ్జెట్‌లో భాగంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత రైల్వేలపై కీలక ప్రకటన చేశారు. 27000 కిలోమీటర్ల మేర భారత రైల్వే ట్రాక్‌లను విద్యుదీకరిస్తామనీ.. డిమాండ్-సరఫరా మధ్య అంతరాన్ని తగ్గించేందుకు రైల్వేలకు సౌరవిద్యుత్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇందుకోసం రైల్వే స్వాధీనంలో ఉన్న ట్రాక్‌ల పొడవునా సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆమె అన్నారు. దేశంలోని మరిన్ని కీలక పర్యాటక ప్రాంతాలకు కూడా తేజస్ వంటి రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 2020-21 బడ్జెట్‌లో రవాణా మౌలిక సదుపాయాల కోసం రూ.1.7 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు నిర్మల పేర్కొన్నారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేను 2023 నాటికల్లా పూర్తిచేస్తామని ఆమె పేర్కొన్నారు.
8. 5 లక్షల ఆదాయానికి పన్నులేదు..
ఏడాదికి 5 లక్షల ఆదాయం ఉన్న వారికి ఎటువంటి పన్ను ఉండదని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె.. ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త ఆదాయం పన్ను విధానాన్ని ఆమె ప్రకటించారు. వ్యక్తిగత పన్ను విధానం ద్వారా సుమారు 40వేల కోట్లు వసూల్ చేయాలని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అయితే కొత్త, పాత ఐటీ విధానాలను సమీక్షించిన తర్వాత ఈ లక్ష్యం నేరవేరే అవకాశాలు ఉన్నాయన్నారు. కొత్త వ్యక్తిగత పన్ను విధానాన్ని.. పన్నుదారులు ఆప్షనల్‌గా తీసుకోవచ్చు అని తెలిపారు. 30 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నవారికి పాత విధానం ప్రకారమే 30 శాతం పన్నును వసూల్ చేయనున్నారు. ఆదాయ పన్ను వసూళ్లలో ఉన్న సుమారు 70 పాత విధానాలను తీసివేస్తున్నట్లు ఆయన తెలిపారు. కొత్త ఆదాయ పన్ను విధానం ప్రకారం.. 5 లక్షల నుంచి 7.5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి కేవలం పది శాతం పన్ను మాత్రమే విధించనున్నారు. ఇది గతంలో 20 శాతం ఉండేది. దాన్ని ఇప్పుడు 10 శాతానికి తగ్గించారు. ఇక 7.5 లక్షల నుంచి 10 లక్షల ఆదాయం ఉన్నవారికి 15 శాతాన్ని ట్యాక్స్‌గా వసూల్ చేయనున్నారు. ఆదాయపన్ను విధానాన్ని సరళీకరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 10 నుంచి 12.5 లక్షల ఆదాయం ఉన్నవారికి పన్నును 20 శాతానికి కుదిరించినట్లు మంత్రి తెలిపారు. 12.5 లక్షల నుంచి 15 లక్షల ఆదాయం ఉన్నవారికి 25 శాతాన్ని వసూల్ చేయనున్నారు. పన్నుదారులకు సులువైన విధానాన్ని కల్పించేందుకు వ్యక్తిగత పన్ను విధానాన్ని తీసుకువచ్చినట్లు మంత్రి చెప్పారు. కార్పొరేట్ పన్నులు తగ్గించడం వల్లే ఆదాయం పడిపోయిదన్నారు. పన్నుదారులకు ఎటువంటి వేధింపులు ఉండవన్నారు.
9. లోక్‌సభ సోమవారానికి వాయిదా
2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టారు. బడ్జెట్‌పై దాదాపు రెండున్నర గంటలకు పైగా సుదీర్ఘ ప్రసంగం చేసిన నిర్మల.. అనేక కీలక ప్రకటనలు చేశారు. వ్యవసాయాభివృద్ధి, విద్యా విధానాలకు అధిక ప్రాధాన్యం కల్పించారు. ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం అనంతరం లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది
10. వ్యవసాయ రంగానికి వరాలివే..
సంక్షోభంలో కూరుకుపోయిన అన్నదాతలకు కేంద్రం తీపికబురు చెప్పింది. సాగు, వ్యవసాయ రంగానికి పునర్వైభవం తీసుకొచ్చేందుకు 16 సూత్రాల కార్యాచరణ ప్రకటించింది. 2020 సార్వత్రిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈమేరకు ప్రకటించారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. 6.1 కోట్ల మంది రైతులకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అందిస్తున్నామన్నారు. వ్యవసాయంలో పోటీ తత్వం పెంచడమే తమ లక్ష్యమనీ.. వ్యవసాయంలో పెట్టుబడి లాభదాయకం కావాలని ఆమె పేర్కొన్నారు. కేంద్ర చట్టాలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు.
11. ఏ వయసులో పెళ్లి చేసుకోవాలి?
ఆడ పిల్లలకు ఏ వయసులో పెళ్లి చేయాలన్న దానిపై అధ్యయనం చేసేందుకు ఓ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. శనివారం బడ్జెట్ ప్రసంగంలో ఆమె ఈ విషయంపై ప్రకటన చేశారు. అమ్మాయిల పెళ్లి వయసుపై ఈ టాస్క్‌ఫోర్స్ కమిటీ సలహాలు, సూచనలు ఇస్తుందని చెప్పారు. బాల్య వివాహాలను నివారించేందుకు, ఆడ పిల్లల హక్కులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే స్త్రీ, శిశు సంక్షేమం పైనా ఈ టాస్క్ ఫోర్స్ అధ్యయనం చేస్తుంది.
12. ఇండ్‌శాట్’. త్వరలో కొత్త విద్యా విధానం. విద్యా రంగంలో విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం. నేషనల్ పోలీస్ వర్సిటీ, నేషనల్ ఫోరెన్సిక్ వర్సిటీ ఏర్పాటు. 2026 నాటికి 150 యూనివర్సిటీల్లో కొత్త కోర్సులు. జిల్లా ఆస్పత్రులతో మెడికల్ కాలేజీల అనుసంధానం.
11:58 February 01
విద్యారంగానికి రూ.99,300 కోట్లుఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు మరింత ప్రోత్సాహంఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా ఉద్యోగాల కల్పనకు ముందుకొచ్చేలా యువతకు ప్రోత్సాహంపెట్టుబడి పెట్టే ముందు తగిన శిక్షణ, అవకాశాలపై అవగాహన కల్పించే కేంద్రాలునూతన పెట్టుబడులకు మార్గం సుగమం చేసేందుకు ప్రత్యేక విభాగంఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు కొత్త పథకాలుమొబైల్ ఫోన్ల తయారీ, సెమీ కండక్టర్ల పరిశ్రమల కోసం ప్రత్యేక పథకం, త్వరలో విధివిధానాలురాష్ట్రాల భాగస్వామ్యంతో కొత్తగా 5 ఆకర్షణీయ నగరాలుజౌళి పరిశ్రమ మరింత అభివృద్ధికి త్వరలో ప్రత్యేక విభాగంజాతీయ జౌళి సాంకేతికత మిషన్ ద్వారా కొత్త పథకంఈ ఏడాది నుంచి ఎగుమతిదారులకు ప్రోత్సాహక పథకంచిన్నతరహా ఎగుమతిదారులకు రక్షణగా నిర్విక్ పేరుతో కొత్త బీమా పథకం2030 నాటికి అత్యధికంగా పనిచేయగలిగిన యువత ఉండే దేశంగా భారత్‌దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో ఇంజినీరింగ్ విద్యార్థులకు అప్రెంటీస్ విధానందేశంలో వైద్య నిపుణుల కొరత తీర్చేందుకు కొత్త విధానంప్రతి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి అనుబంధంగా పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు ఏర్పాటుభూమి, సౌకర్యం కల్పించే రాష్ట్రాలకు కేంద్రం నుంచి సాయంవైద్య పీజీ కోర్సుల కోసం పెద్దాస్పత్రులకు ప్రోత్సాహంవిద్యారంగంలో మార్పుల కోసం ప్రత్యేక నూతన విద్యా విధానం2026 కల్లా 150 వర్సిటీల్లో కొత్త కోర్సులువిద్యారంగానికి రూ.99,300 కోట్లునైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు రూ.3 వేల కోట్లువర్సిటీలో కోసం త్వరలో జాతీయ స్థాయి విధానం
ఉపాధ్యాయులు, పారా మెడికోల కొరత తీర్చేలా నూతన విధానం
11:48 February 01
మిషన్ ఇంధ్రధనుస్సు ద్వారా టీకాలుఆరోగ్య పరిరక్షణకు స్వచ్ఛభారత్ ద్వారా కొత్త పథకాలుఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ప్రతిఒక్కరికీ ఆరోగ్యంఆయుష్మాన్ భారత్ పథకంలో రాని ఆస్పత్రులను ఈ పరిధిలోకి తీసుకొస్తాంటీబీ హరేగా దేశ్ బచేగా పేరుతో క్షయ వ్యాధి నివారణకు ప్రత్యేక కార్యక్రమంక్షయవ్యాధి నిర్మూలనతోనే దేశ విజయంబహిరంగ మల విసర్జన రహిత దేశంగా భారత్‌ఓడీఎఫ్ ప్లస్ ద్వారా పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యంస్వచ్ఛభారత్ మిషన్‌కు రూ.12,300 కోట్లుజల్‌జీవన్ మిషన్‌కు రూ.11,500 కోట్లుప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకానికి రూ.6,400 కోట్లుఆరోగ్య రంగానికి రూ.69 వేల కోట్లు
11:42 February 01
ఉద్యానవన పంటల అభివృద్ధికి మరింత ప్రోత్సాహం
కేంద్ర, రాష్ట్రాలు కలిసి ఉద్యాన పంటలకు అదనపు నిధుల కేటాయింపులుఉద్యాన పంటల కోసం ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటుపశువుల్లో కృత్రిమ గర్భదారణకు అదనపు సౌకర్యాలుపాల ఉత్పత్తుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు కృషిరానున్న ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.15 లక్షల కోట్లుఆల్గే, సీవీ కేజ్ కల్చర్ విధానంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సాహకాలుకోస్తా ప్రాంతాల్లోని గ్రామీణ యువతకు మత్స్య పరిశ్రమలో మరింత ఉపాధి3,400 సాగర్‌మిత్రలు ఏర్పాటుగ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాగునీరు, అనుబంధ రంగాలకు రూ.2.83 లక్షల కోట్లు11:35 February 01మరో 20 లక్షల మందికి సోలార్ పంప్‌సెట్ల పథకంనీటి కొరత తీవ్రంగా ఉంది. 100 జిల్లాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. రైతులకు సోలార్ పంప్‌సెట్ల పథకాన్ని మరో 20 లక్షల మంది కర్షకులకు విస్తరిస్తున్నాం. సాగులేని భూముల్లో సోలార్ కేంద్రాలతో రైతులకు ఆదాయం వస్తుంది. వేల సంవత్సరాల క్రితమే తమిళ మహాకవి అవ్వయ్యార్ నీటి సంరక్షణ, భూమి వినియోగం గురించి వెల్లడించారు.
11:30 February 01
ధాన్యలక్ష్మి పథకం అమలు
వర్షాభవ జిల్లాలకు అదనపు నిధులుసౌగునీటి సౌకర్యాలు కల్పించేలా ప్రాధాన్యంరైతులకు 20 లక్షల సోలార్ పంపుసెట్లుబీడు భూముల్లో సోలార్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు పెట్టుబడి సాయంరైతులకు రసాయనిక ఎరువుల నుంచి విముక్తిభూసార రక్షణకు అదనపు సాయం, సంస్కరణలురైతులకు సహాయంగా గోదాముల నిర్మాణంగోదాముల నిర్మాణానికి నాబార్డు ద్వారా సాయంపీపీపీ పద్ధతిలో ఎఫ్‌సీఐ, కేంద్ర గిడ్డంగుల సంస్థ సంయుక్తంగా గోదాముల నిర్మాణంమహిళా స్వయంసహాయక సంఘాల ద్వారా ధాన్యలక్ష్మి పథకం అమలుధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నాబార్డు ద్వారా ఎస్‌ఎస్‌జీలకు సాయంకూరగాయల సరఫరాకు కృషి ఉడాన్ యోజనకూరగాయలు, పండ్లు, పూలు ఎగుమతులు, రవాణాకు ప్రత్యేక విమానాల వినియోగం
ఉద్యానవన పంటల అభివృద్ధికి మరింత ప్రోత్సాహంకేంద్ర, రాష్ట్రాలు కలిసి ఉద్యాన పంటలకు అదనపు నిధుల కేటాయింపులు
11:26 February 01
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపున్యూఇండియా, సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, ప్రజా సంక్షేమం అనే మూడు లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నాం.2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపునకు కట్టుబడి ఉన్నాంప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా 6.11 కోట్ల మంది రైతులకు ప్రయోజనంపప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెంచడంపై దృష్టి సారించాంకృషి సించాయి యోజన ద్వారా సూక్ష్మ సాగునీటి విధానాలకు ప్రోత్సాహంగ్రామీణ సడక్ యోజన, ఆర్థిక సమ్మిళిత రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయిపొలాలు, రైతుల ఉత్పాదకత పెంచడం ద్వారా ప్రయోజనం
11:23 February 01
మూడు ప్రాధాన్యాంశాలతో ముందుకుమొదటి ప్రాధాన్యాంశం: వ్యవసాయం, సాగునీరు గ్రామీణాభివృద్ధిద్వితీయ ప్రాధాన్యాంశం: ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరుమూడో ప్రాధాన్యాంశం: విద్య, చిన్నారుల సంక్షేమం
11:20 February 01
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే
నిర్మాణాత్మక చర్యలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నాం. కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే దేశం వేగంగా ముందుకెళ్తుంది. సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ సబ్‌కా విశ్వాస్ ఈ ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి నేరుగా నిరుపేదలకు అందించేందుకు ప్రయత్నం.
11:17 February 01
భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగత ఎన్నికల్లో మోదీ ప్రభుత్వానికి భారీ మెజార్టీతో అధికారం అప్పగించారు. దార్శనికులైన అరుణ్‌జైట్లీకి నివాళి. ఆదాయాల పెంపు, కొనుగోలు శక్తి పెంచే దిశగా బడ్జెట్. యువతను మరింత శక్తిమంతం చేసేలా ప్రభుత్వ ప్రాధమ్యాలు ఉంటాయి. జీఎస్టీతో రాష్ట్రాల, కేంద్రం ఆదాయం పెరిగింది. ఎవరికీ నష్టం కలగలేదు. ఒకే పన్ను, ఒకే దేశం విధానం మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఏప్రిల్ నుంచి పన్ను చెల్లింపులు మరింత సరళతరంఇన్‌స్పెక్టర్ రాజ్‌కు కాలం చెల్లింది. ఇందులో భాగంగా అనేక చెక్‌పోస్టులు తొలగించాం. దాదాపు 10శాతం పన్ను భారం తగ్గింది. గత రెండేళ్లలో 16లక్షల పన్ను చెల్లింపుదారులు కొత్తగా చేరారు. ఏప్రిల్ 2020 నుంచి పన్ను చెల్లింపులు మరింత సరళతరం అవుతాయి.
11:14 February 01
జీఎస్టీతో సామాన్యులకు నెలవారీ ఖర్చులు 4 శాతం ఆదాజీఎస్టీలోని సమస్యల పరిష్కారానికి జీఎస్టీ కౌన్సిల్ వేగంగా పనిచేస్తోందికొత్తగా 60 లక్షలమంది ఆదాయపన్ను చెల్లింపుదారులు చేరారు40 లక్షలమంది కొత్తగా ఐటీ రిటర్న్‌లు దాఖలు చేశారుసబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ సబ్‌కా విశ్వాస్ ఈ ప్రభుత్వ లక్ష్యం
ప్రభుత్వం ఖర్చుచేసే ప్రతి రూపాయి నిరుపేదలకు నేరుగా అందించే ప్రయత్నం జరుగుతోంది
13. కేంద్ర ఆర్థిఖ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్..పార్లమెంట్ చరిత్రలో సరికొత్త రికార్డును తన పేరు మీద లిఖించుకున్నారు. ఇక్కడ విశేషమేమిటంటే.. ఆమె తన రికార్డును తానే బద్దలు కొట్టారు. ఇదివరకు తన పేరు మీద ఉన్న రికార్డును తిరగ రాశారు. అదే- సుదీర్ఘ సమయం పాటు బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించడం. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్ ప్రసంగాన్ని ఆమె 2 గంటల 42 నిమిషాల పాటు చదివారు. పార్లమెంట్ చరిత్రలో ఇదో సరికొత్త ఒరవడిగా భావిస్తున్నారు.
నేటి కేంద్ర బడ్జెట్ విశేషాలు-TNI కధనాలు
Related tags :