DailyDose

స్టాక్ మార్కెట్లకు బడ్జెట్ షాక్-వాణిజ్యం

స్టాక్ మార్కెట్లకు బడ్జెట్ షాక్-వాణిజ్యం

*కేంద్ర ఆర్థిఖ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్..పార్లమెంట్ చరిత్రలో సరికొత్త రికార్డును తన పేరు మీద లిఖించుకున్నారు. ఇక్కడ విశేషమేమిటంటే.. ఆమె తన రికార్డును తానే బద్దలు కొట్టారు. ఇదివరకు తన పేరు మీద ఉన్న రికార్డును తిరగ రాశారు. అదే- సుదీర్ఘ సమయం పాటు బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించడం. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్ ప్రసంగాన్ని ఆమె 2 గంటల 42 నిమిషాల పాటు చదివారు. పార్లమెంట్ చరిత్రలో ఇదో సరికొత్త ఒరవడిగా భావిస్తున్నారు.
*విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ లెక్సెస్ భారత్లో ఎల్సీ 500హెచ్ను విడుదల చేసింది. ఈ కారు ఎక్స్షోరూమ్ ధర రూ.1.96 కోట్లుగా నిర్ణయించారు. ఈ కారును తొలిసారి 2012 డెట్రాయిట్ మోటార్ షోలో ప్రదర్శించారు. 2017లో దీనిని ఉత్పత్తి దశకు చేర్చారు. అప్పటి నుంచి మొత్తం 68 దేశాల్లో ఈ కారు ఉత్పత్తిని మొదలుపెట్టారు. తాజాగా ఈ కారును విక్రయించే 69వ దేశంగా భారత్ నిలిచింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 12వేల కార్లను విక్రయించారు.
*ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో నిత్యం చురుగ్గా ఉంటూ సమకాలీన అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. తాజాగా అమెరికా ఐటీ దిగ్గజ సంస్థ ఐబీఎం ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా భారత సంతతికి చెందిన అరవింద్ కృష్ణ నియమితులైన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ నవ్వులు పూయిస్తోంది
*ప్రముఖ భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ త్వరలో తన వాహన శ్రేణిలోని 500సీసీ ఇంజిన్ బైక్ల విక్రయాలను మార్చి 31 నుంచి నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. దీంతో క్లాసిక్ 500, థండర్బర్డ్ 500, బుల్లెట్ 500 మోడళ్ల అమ్మకాలు భారత్ మార్కెట్లో నిలిచిపోనున్నాయి
*ఆరు నెలల్లో ప్రవేశపెడుతున్న రెండో ఆర్థిక సర్వే ఇది. ఈసారి సర్వే థీమ్ వెల్త్ క్రియేషన్. ఆగస్టు15న ప్రధాని సంపద సృష్టిపై మాట్లాడారు. సంపద సృష్టికర్తలను గౌరవించాలి. వారు సంపదను సృష్టించకపోతే.. సంపదను పంచలేం. ఆర్థిక సర్వే కవర్ను రూ.100 నోటు పై నుంచి తీసుకొన్న ఊదారంగును వాడాం. పాత కొత్తల ఆలోచన కలయికే ఈ ఆర్థిక సర్వే.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఐటీసీ ఏకీకృత ప్రాతిపదికన రూ.4,047.87 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.3,136.95 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 29.03 శాతం అధికం. ఇక మొత్తం అమ్మకాలు రూ.12,506.05 కోట్ల నుంచి 5.71% వృద్ధితో రూ.13,220.30 కోట్లకు చేరాయి.
*డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా ఏకీకృత ప్రాతిపదికన రూ.1,145.9 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.1,202.9 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 4.7 శాతం తక్కువ. ఇదే సమయంలో మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.8,943.7 కోట్ల నుంచి 7.9 శాతం వృద్ధితో రూ.9,654.6 కోట్లకు చేరింది.
*డిసెంబరు త్రైమాసికంలో హిందుస్థాన్ యునిలీవర్ (హెచ్యూఎల్) ఏకీకృత నికర లాభం 12.95 శాతం వృద్ధితో రూ.1,631 కోట్లకు చేరుకుంది. 2018-19 ఇదే కాలంలో లాభం రూ.1,444 కోట్లుగా ఉంది. నికర విక్రయాలు రూ.9,582 కోట్ల నుంచి 3.87 శాతం పెరిగి రూ.9,953 కోట్లకు చేరాయి. ‘గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వ్యయాలు తగ్గించడంతో గిరాకీ మందగించింది. అయినా కూడా రాణించాం
* దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో నమోదవుతున్నాయి. ఆదాయపు పన్ను పరిమితి పెంపు, శ్లాబులను సవరించినప్పటికీ.. దీన్ని ఐచ్ఛికంగా నిర్ణయించడంతో మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మందగమనానికి ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించడమే మార్గమని అందరూ భావించారు. ఈ దిశగా బడ్జెట్‌లో ఎలాంటి చర్యలూ లేకపోవడంతో సూచీలు ఒక్కసారిగా దిగజారాయి. మధ్యాహ్నం 1.31 గంటల సమయంలో సెన్సెక్స్ 588 పాయింట్లు కోల్పోయి 40,135 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 244 పాయింట్ల నష్టంతో 11,792 వద్ద ట్రేడవుతోంది. ఓ దశలో సెన్సెక్స్‌ 700 పాయింట్లు కుదేలైంది. మార్కెట్లు ఉదయం నుంచి నష్టాల్లోనే కొనసాగుతుండడం గమనార్హం.