జగన్ కేబినేట్ లో కీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు మంత్రుల మధ్య మాటామాటా వచ్చిందట.. దీంతో ఆ ఇద్దరూ కలహించుకుంటున్నారని ఈ విషయం ముఖ్యమంత్రి కార్యాలయం వరకు చేరిందని అంటున్నారు అయితే ప్రస్తుతం శాసన మండలి వేడి రాజుకోవడంతో ఈ విషయానికి అంతగా ప్రాధాన్యం లభించక పోవడం గమనార్హం. సరే విశాయంలోకి వెళ్తే కృష్ణాజిల్లా గుడివాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడాలి నాని పౌరసరఫరాలశాఖ మంత్రిగా ఉన్నారు. రాజకీయ నేతల్లో ఎక్కువ మందికి రైస్ మిల్లింగ్ వ్యవస్తాతో చాలా దగ్గర సంబందాలు ఉన్నాయి.
*బియ్యం కొనుగోలుపై..
దీంతో చాలామంది మమత్రులు తమ జిల్లాలో ధాన్యం సేకరించాలని మంత్రిపై ఒత్తిళ్ళు తెస్తున్నమాట నిజం. ప్రస్తుతం ప్రభుత్వం తెల్లరేషన్ కార్డు దారులకు నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తున్న నేపద్యంలో దాదాపు ఉత్తరంధరా సహా, సీమ జిల్లాల్లోని మిల్లర్లు, రాజకీయయంగా మంత్రులపై ఒత్తిడి తెస్తున్నారు. తమ బుయ్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని వారు కోరుతునారు దీంతో ఈ విషయం ఎంత వద్దన్నా రాజకీయంగా మారుతోంది.
*సత్తిబాబు జోక్యంతో..
ఈ నేపద్యంలో సదరు మంత్రులు అవకాశం చిక్కినప్పుడల్లా పౌర సరఫరాల మంత్రి కొడాలి నాని పై ఒత్తిడి తెస్తున్నారు. అయితే నాని వినీ విననట్టే వ్యవహరిస్తున్నారు ఇదే విషయంలో గతంలో మంత్రి రంగనాధరజుకు కొడాలి నానికి మధ్య వివాదం కూడా నడిచింది. అప్పుడు ఇలాంటి పరిస్థితే మంత్రి బొత్స సత్యనారాయణకు కొడాలి నానికి మధ్య ఏర్పడిందని అంటున్నారు. అయితే ఈ విషయంలో మీరు ఎందుకు జోక్యం చేసుకుంటారని కొడాలి నాని సిఎంవోకు జగన్ ముందే ప్రస్నించాడట. ఈవిషయం కలకలం రేపుతుంది. అయితే మండలి రద్దు నేపద్యంలో ఈవిషయం వెలుగు చూడలేదు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా రైస్ మిల్లుల విషయంలో బొత్సకు వ్యాపార భాగస్వాములు ఉన్నారు ఈ క్రమంలోనే ఆయనపై ఒత్తిడి పెరిగిందని దీంతోనే కొడాలి నానిపై ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. మరి జగన్ ఎలా సరిదిద్దుతారో చూడాలి.
జగన్ వద్దకు కొడాలి-బొత్స రగడ
Related tags :