DailyDose

తెలంగాణ భాజపాలో కుమ్ములాట-రాజకీయ

Telangana BJP Internal Groups And Feuds

*మున్సిపల్ ఫలితాలు తెలంగాణ కమలంలో గ్రూపుల ఫైట్ కు తెరలేపాయి. 120 మున్సిపాల్టీల్లో కొన్ని మున్సిపాల్తీలులో పోటీ చేసేందుకు భాజాపాకి అభ్యర్ధులు దొరకలేదు. అయితే 70 నుంచి 80మున్సిపాల్టీలలో భాజపా అభ్యర్ధులు పోటీ చేసారు. ఇక్కడి వరకు కొంతవరకు ఫర్వాలేదు. కానీ గెలిచే సీట్లు కూడా గ్రూపుల గోలతో ఓడిపోయారనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రధాన ఆరోపణ.
*మళ్ళీ డిల్లీ పీటం కేజ్రీవాల్ కే.
డిల్లి ఎన్నికల్లో కేజ్రీవాల్ సారధ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయ దుందుభీ మొగిస్తుందని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడింది. డిల్లీలో ఎన్నికల్లో మోడీ ఆకర్షణ అమిత్ షా వ్యూహాలు ఎంత మాత్రూ పని చేయలేదని హైదరాబాద్ కు చెందిన ఈ సంస్థ సర్వ్ తేల్చి చెప్పింది. కేజ్రీవాల్ ప్రభుతం అమలు చేస్తున్న సంక్షెమా పధకాలు వాళ్ళ దిల్లిలోని పేదలు మధ్య తరగతి ప్రజలు సంతృప్తిగా ఉన్నారని సగటున ఒక్కో కుటుంబం నెలకు రూ. 1500 నుంచి రూ.3000 వేలకు ఆదా చేయగాలుగుతోందని పేర్కొంది. డిల్లీలో విశ్వాసనీయత గల నేత లేకపోవడం కూడా భీజేపీకి నష్టం చేసే అంశాల్లో ఒకటని సర్వ్ తెలిపింది. షీలాదీక్షిత్ మరణంతో కాంగ్రెస్ కోలుకోలేకపోతుందని ఎన్నార్సీ సిఎఏలు పెద్దగా ప్రభావం చూపే అవకశం లేదని స్పష్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పూర్తిగా ఆప్ కు మారిందని సర్వ్ స్పష్తం చేసింది.
* మోడీ ఈ మూడు విషయాలు మాట్లాడాలి
కేంద్ర బడ్జెట్ కు మూడు రోజుల సమయం మాత్రమే ఉన్న తరుణంలో ప్రధాని మోడీ కేంద్ర మంత్రులపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం విమర్శలు గుప్పించారు. దేశ ఆర్ధిక వ్యవస్థ దిగజారుతోందని ట్యాక్స్ రెవెన్యు కారణంగా పడిపోయిందని ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆయన అన్నారు. డిల్లి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాజపా నేతల తీరు కూడా సరిగా లేదని అభ్యంతరకరమైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ పాలన వచ్చి ఆరు సంవత్సరాలు అవుతున్న ఇంకా అచ్చీ దీన్ రాలేదని ఎద్దేవా చేసారు. ప్రధాని మోడీతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులందరూ వాస్తవాలను అంగీకరించడం లేదని చిదంబరం అన్నారు. ప్రజలంతా దేశ ఆర్ధిక పరిస్థితికి సంబందించిన వాస్తవాలను తెలుసుకోవాలనుకుంటున్నారని మీ తిట్లను వాక్చాతుర్యంతో కాదని అన్నారు. డిల్లి ఎన్నికల ప్రచారం సందర్భంగా మీరు మూడు విషయాల గురించి మాట్లాడాలని సవాల్ విసిరారు. 2019 జనవరిలో 2 శాతంగా ఉన్న ద్రవ్య్లోల్భానం 2019 డిసెంబరు నాటికీ 7.35 శాతానికి ఎందుకు పెరిగింది? 2019-20 ఆర్ధిక సంవత్సరం గాను రూ. 2.5 లక్షల కోట్ల ట్యాక్స్ రెవెన్యులు వస్తాయని వేసిన బడ్జెట్ అంచనాలు ఎందుకు లక్ష్యాన్ని చేర్చుకోలేకపోయాయి ఎస్సీ, ఎస్టీ ఓబీసీ మైనార్టీ మహిలలై పిల్లల కోసం అమలు చేస్తున్న పధకాలను నిధులు ఎందుకు తగ్గాయి? ఈ మూడు అంశాలపై మాట్లాడాలని చిదంబరం సవాల్ విసిరారు.
* కరోనాపై మంత్రులతో కమిటీ‌: కిషన్‌రెడ్డి
కరోనా వైరస్‌పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దీనిపై ఐదుగురు మంత్రులతో టాస్క్‌ఫోర్స్‌ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు. దిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేశారని.. దీనిలో కేంద్రహోంశాఖ, మహిళా శిశు సంక్షేమశాఖ, పౌర విమానయాన శాఖ, విదేశాంగ శాఖలకు చెందిన మంత్రులు ఉన్నారని చెప్పారు. దేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆ కమిటీ చర్చిస్తోందన్నారు. ఈ వైరస్‌ సోకిన బాధితులను ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని కిషన్‌రెడ్డి వివరించారు. కేరళ సహా ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామన్నారు. రాష్ట్రాలకు మెడికల్‌ కిట్లు, వైద్య బృందాల తరలింపుపై టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చర్చిస్తుందని ఆయన తెలిపారు.
*మాజీ సిఎస్ సంకాహ్లానం సుప్రీం జడ్జీల చేతుల్లో రాజధాని భూములా?
ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ కి ప్రత్యెక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజేయకల్లం నిజంగానే సంచలన వ్యాఖ్యలు చేసారు. చితురు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని తెదేపా అధినేత నారా చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె వేదికగా వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆద్వర్యంలో అధికార వికేంద్రీకరణకు అమ్ద్దతుగా నిర్వహించిన సభకు హాజరైన సందర్భంగా అజేయ కళ్ళం చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు పెను కలకలమే రేపనున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
* ప్రజాహితంగా కేంద్ర బడ్జెట్‌: జేడీ లక్ష్మీనారాయణ
జనసేనకు తాను చేసిన రాజీనామా ఆమోదం పొందిందని.. ఆ పార్టీలో తన ప్రయాణం ముగిసిన అధ్యాయమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఇకపై ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తానని ఆయన తెలిపారు. ప్రజలు, రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషిచేస్తానని పేర్కొన్నారు. ప్రజా సేవకు రాజకీయమే అత్యుత్తమ వేదిక అని లక్ష్మీనారాయణ అన్నారు. ఇకపై కూడా ప్రజాసేవ చేస్తూనే ఉంటానన్నారు. ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లాలనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజాహితంగా ఉందని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్‌లో పలురంగాలకు కేటాయింపులు బాగున్నాయన్నారు. యువతరాన్ని వ్యవసాయం వైపు మళ్లించేలా బడ్జెట్‌ రూపొందించారని ఆయన తెలిపారు. సప్లిమెంటరీ బడ్జెట్‌లో ఏపీకి మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉందని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి మరిన్ని నిధులుతీసుకువచ్చేలా ఎంపీలు కృషి చేయాలని సూచించారు.
* తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు: ఈటల
గాంధీ ఆస్పత్రిలో వైరాలజీ ల్యాబ్‌ను మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. నేడు గాంధీ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదన్నారు. గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్‌ టెస్టులు నిర్వహిస్తున్నామన్నారు. నిన్నటి వరకు జరిపిన టెస్టుల శాంపిల్స్‌ను పుణెకు పంపించామన్నారు. 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారని మంత్రి ఈటల వెల్లడించారు.
* రాజధాని తరలిపోకుండా బీజేపీ ఆపగలదు: కామినేని శ్రీనివాస్
రాజధానిపై కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుందని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. రాజధాని అంశాన్ని త్వరలో కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఆయన వెల్లడించారు. నేడు రాజధాని రైతుల నిరసన దీక్షకు మద్దతు తెలిపిన సందర్భంగా కామినేని ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. రాజధాని తరలిపోకుండా బీజేపీ ఆపగలదని పేర్కొన్నారు. రాజధానిని తరలిస్తే ఇక్కడి భవనాలను ఏం చేస్తారని ప్రశ్నించారు. బీజేపీ, జనసేన రాజధాని విషయంలో సంయుక్త కార్యాచరణ ప్రకటించాయని కామినేని స్పష్టం చేశారు.
* బడ్జెట్‌ను ప్రజలు స్వాగతిస్తున్నారు: లక్ష్మణ్‌
పేద, మధ్యతరగతి ప్రజలు బడ్జెట్‌ను స్వాగతిస్తున్నారని తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌.. ఆర్థిక స్వావలంబన దిశగా ఉందన్నారు. అంతేకాకుండా ద్రవ్యోల్బణం అదుపులో ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్‌ కేంద్ర బడ్జెట్‌పై కూనిరాగాలు తీస్తున్నారని, అవగాహన రాహిత్యంతోనే అలా మాట్లాడుతున్నారని విమర్శించారు.శాఖలవారిగా, పథకాల వారీగా కేటాయింపులుంటాయని, అంతేగాని
జేబులు నింపుకొనేందుకు, కమిషన్లు తీసుకునేందుకు డబ్బులు కేటాయించరని లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే.. అసంబద్ధ నిర్ణయాలను తెరాస నేతలు కేంద్రంపై నెట్టేస్తున్నారని విమర్శించారు. గుజరాత్‌ రాష్ట్రం కేంద్ర నిధులపై ఆధారపడలేదని చెబుతూ..కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారని ప్రశ్నించారు. ఈ అంశంపై చర్చకు సిద్ధమా? అని సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు.
*భాజపాను గద్దె దించేందుకు చేతులు కలపండి: రాజా
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)తో మత ప్రాతిపదికన సమాజాన్ని చీల్చేందుకు భాజపా ప్రయత్నిస్తోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆరోపించారు. ఆ పార్టీని అధికార పీఠం నుంచి తప్పించేందుకు దేశంలోని లౌకిక, ప్రజాస్వామ్య శక్తులన్నీ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. కోల్కతాలో సీపీఐ జాతీయ మండలి సమావేశాల తొలిరోజున ఆయన ప్రసంగించారు. ‘భాజపాను నిర్మూలించండి, దేశాన్ని రక్షించండి’ అనే నినాదంతో తమ పార్టీ దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.
*ఉగ్రవాదాన్నినిర్మూలించడమే భాజపా లక్ష్యం
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం తీవ్ర విమర్శలు చేశారు. శాసనసభ ఎన్నికల్లో భాగంగా దక్షిణ దిల్లీలోని బదర్పూర్లో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడం పాకిస్థాన్తో పాటు ఆప్ అధినేత కేజ్రీవాల్ను కూడా బాధించిందని ఆరోపించారు. అదేవిధంగా షాహిన్బాగ్లో నిరసనలపై మాట్లాడుతూ.. సాధారణ ప్రజానీకాన్ని స్తంభింపజేసేందుకే వాటిని రెచ్చగొడుతున్నట్లు విమర్శించారు. దిల్లీలో ఒకవైపున అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రధాని నరేంద్రమోదీ ఉంటే.. మరోవైపు విభజన శక్తులకు మద్దతు ఇచ్చే కాంగ్రెస్, కేజ్రీవాల్లు ఉన్నారన్నారని దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా భాజపా పనిచేస్తోందన్నారు. కానీ కేజ్రీవాల్ షాహీన్బాగ్లో నిరసనకారులకు బిర్యానీ సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. ఆప్పై యోగి చేసిన వ్యాఖ్యలపై నిరసిస్తూ.. దిల్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల నుంచి యోగిని నిషేధించాలని ఇప్పటికే ఆప్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. అదేవిధంగా ఆయనకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈసీకి రాసిన లేఖలో పేర్కొంది.
*ఆదిత్యనాథ్ను అరెస్ట్ చేయాలి
దేశ రాజధానిలో శాసనసభ ఎన్నికల ర్యాలీల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేయకుండా నిషేధం విధించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎన్నికల సంఘాన్ని (ఈసీ) కోరింది. ఆయన్ను అరెస్టుచేయాలని కూడా విజ్ఞప్తి చేసింది. సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ తమ పార్టీ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసి 48 గంటలు గడుస్తున్నా ఇప్పటికీ రాలేదని ఆప్ నేత సంజయ్సింగ్ ఆదివారమిక్కడ చెప్పారు. ‘‘మతతత్వ ప్రసంగాలు చేసినందుకు ఆయనను (ఆదిత్యనాథ్ను) తప్పనిసరిగా అరెస్టు చేయాలి. ఇందుకు సంబంధించి మేం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం’’ అని తెలిపారు.
*బడ్జెట్లో బీసీలకు మొండిచేయి: ఆర్.కృష్ణయ్య
కేంద్ర బడ్జెట్లో బీసీలకు మొండి చేయి చూపారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన 14 బీసీ సంఘాల సమావేశ అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. బీసీలకు రూ.1,046 కోట్లు కేటాయించారన్నా. జాతీయ బీసీ కార్పొరేషన్కు రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. బీసీల బడ్జెట్ను రూ.50 వేల కోట్లకు పెంచాలనే డిమాండ్తో మార్చి 15న చలో దిల్లీ చేపడుతున్నట్లు కృష్ణయ్య వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా పార్లమెంటు వద్ద వారం పాటు ధర్నాలు, కేంద్ర మంత్రుల నివాసాల ముట్టడి చేపడతామని తెలిపారు.
*విశాఖ భూములపైనే వైకాపాకు శ్రద్ధ
రాష్ట్ర ప్రభుత్వం విశాఖ భూములపై చూపుతున్న శ్రద్ధలో పదో వంతైనా కేంద్ర నిధులు రాబట్టడంపై పెట్టలేదని మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. తనపై ఉన్న కేసుల కోసమే రాష్ట్ర ప్రయోజనాలను సీఎం జగన్ తాకట్టు పెట్టారని, కేంద్ర బడ్జెట్లో నిధులు తగ్గడానికి ఆయనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కోర్టు వాయిదాలపై ఆలోచనలతో కేంద్ర నిధుల కోసం ప్రయత్నించలేదని, 15వ ఆర్థిక సంఘం నిధుల్లో రాష్ట్ర వాటా 0.2 శాతం తగ్గటంవల్ల రూ.1,521 కోట్లు రాష్ట్రం కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్రానికి చెప్పటంలో వైకాపా విఫలమవడం వల్లే బడ్జెట్లో కేటాయింపులు తగ్గాయన్నారు. ‘కేంద్ర బడ్జెట్పై సీఎం జగన్ ఎందుకు స్పందించలేదు? కేసుల భయంతోనే ఊరుకున్నారా? 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు.
*జగన్కు మద్దతివ్వాలన్న భావనలో రైతులు: మంత్రి కొడాలి నాని
సీఎం జగన్కు మద్దతివ్వాలన్న భావనలో అమరావతికి చెందిన పలువురు రైతు కూలీలు, రైతులు ఉన్నారని పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెళ్లి రైతులకు న్యాయం చేస్తామంటే కుట్రలు అంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆదివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘పింఛను జాబితా నుంచి అర్హులైన వారిని ఒక్కరినీ తొలగించలేదు. గతంలో 39 లక్షల మందికి పింఛన్లు ఇస్తే ఇప్పుడు 54 లక్షల మందికి ఇస్తున్నాం. దీన్ని బట్టి అర్హుల సంఖ్య పెరిగినట్లా.. తగ్గినట్లా? రాష్ట్రానికి యెల్లో వైరస్ పట్టుకుంది. ఇది కరోనా కన్నా ప్రమాదకరం. మా దృష్టిలో మండలి రద్దయినట్లే. తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డికి వయసొచ్చినా బుద్ధి మాత్రం రాలేదు. జగన్ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తే రాజకీయాలు వదిలేసి సినిమాలు చేసుకుంటానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గతంలో అన్నారు. ఇప్పుడు ఆయన సినిమాల్లో నటిస్తున్నందున పరోక్షంగా జగన్ బాగా పరిపాలిస్తున్నారని అంగీకరించినట్లే కదా’ అని వ్యాఖ్యానించారు.
*వర్సిటీ విద్యార్థులు, ఆచార్యులపై చర్యలు చేపట్టాలి: తెదేపా
తిరుపతిలోని ఎస్వీయూ, శ్రీపద్మావతి విశ్వవిద్యాలయ విద్యార్థులతో పాటు, అక్కడి ఆచార్యులపై చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి ఎన్.అమరనాథరెడ్డి, తెదేపా జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, సమన్వయ కార్యదర్శి సురేంద్రకుమార్, ఎమ్మెల్సీలు రాజసింహులు, గౌనివారి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే మనోహర్ ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లెలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహించిన రాజకీయ సదస్సుకు ఆయా విశ్వవిద్యాలయ ఆచార్యులు ఒక్కో విశ్వవిద్యాలయం నుంచి ఆరు బస్సుల్లో విద్యార్థులను తరలించారని ఆరోపించారు.
*వర్సిటీ విద్యార్థులు, ఆచార్యులపై చర్యలు చేపట్టాలి: తెదేపా
తిరుపతిలోని ఎస్వీయూ, శ్రీపద్మావతి విశ్వవిద్యాలయ విద్యార్థులతో పాటు, అక్కడి ఆచార్యులపై చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి ఎన్.అమరనాథరెడ్డి, తెదేపా జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, సమన్వయ కార్యదర్శి సురేంద్రకుమార్, ఎమ్మెల్సీలు రాజసింహులు, గౌనివారి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే మనోహర్ ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లెలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహించిన రాజకీయ సదస్సుకు ఆయా విశ్వవిద్యాలయ ఆచార్యులు ఒక్కో విశ్వవిద్యాలయం నుంచి ఆరు బస్సుల్లో విద్యార్థులను తరలించారని ఆరోపించారు.
*భాజపా నేతలు ఎలా సమర్థిస్తారు?:కర్నె
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దక్షిణాది రాష్ట్రాలతోపాటు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసేదిగా ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ అన్నారు. ఈ బడ్జెట్ ఫెడరల్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలోని తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో కర్నె ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణను ముందునుంచి మెచ్చుకుంటూ వెనకనుంచి వెక్కిరిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా పాలిత రాష్ట్రాలకు ఓ నీతి.. భాజపాయేతర రాష్ట్రాలకు మరో నీతి.. అనే విధంగా కేంద్ర బడ్జెట్ ఉందని దుయ్యబట్టారు. అన్ని రంగాల్లో పురోగమిస్తున్న తెలంగాణను తిరోగమన దిశలో తీసుకెళ్లేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని కర్నె ప్రభాకర్ ఆక్షేపించారు. కర్ణాటకు న్యాయం చేసి తెలంగాణకు అన్యాయం చేస్తే రాష్ట్ర భాజపా నేతలు ఎలా సమర్థిస్తారని నిలదీశారు
*కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.5,000-7,500 వరకు అందిస్తామని.. విద్యుత్, నీటి వినియోగదారులకు క్యాష్బ్యాక్ స్కీమ్స్ అమలు చేస్తామని ప్రకటించింది. దిల్లీ కాంగ్రెస్ చీఫ్ సుభాష్ చోప్రా, పార్టీ నేతలు ఆనంద్ శర్మ, అజయ్ మాకెన్ ఆదివారమిక్కడ మేనిఫెస్టోను విడుదల చేశారు.తాము అధికారంలోకి వస్తే నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొంది. వాయు కాలుష్యం నివారణ, రవాణా సదుపాయాల అభివృద్ధికి బడ్జెట్లో 25 శాతం కేటాయిస్తామని హామీ ఇచ్చింది. ‘యువ స్వాభిమాన్ యోజన’ కింద డిగ్రీ పూర్తి చేసిన వారికి రూ.5వేలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి రూ.7,500 చొప్పున అందజేస్తామని తెలిపింది. రూ.15కే భోజనం అందించే 100 ఇందిరా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామంది. తాము అధికారంలోకి వస్తే సీఏఏపై సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని, ఎన్ఆర్సీ అమలు చేయబోమని, ఎన్పీఆర్ను ప్రస్తుత రూపంలో తీసుకురాబోమని సుభాష్ చోప్రా వెల్లడించారు.
*ప్రాంతీయ విద్వేషాలకు అడ్డాగా సీమ:కళా
ప్రశాంతంగా ఉన్న రాయలసీమను వైకాపా ప్రభుత్వం ప్రాంతీయ విద్వేషాలకు అడ్డాగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షడు కళావెంకట్రావు మండిపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడే మాటలకు.. వ్యవహరిస్తున్న తీరుకు ఏమాత్రం పొంతన లేదని విమర్శించారు. అమరావతిపై ప్రజల దృష్టి మరల్చేందుకే రాయలసీమలో కుట్ర రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నారావారిపల్లెలో వైకాపా తలపెట్టిన బహిరంగ సభ తెదేపా అధినేత చంద్రబాబుపై కక్షకు నిదర్శనమన్నారు. ప్రతీకారం చుట్టే సీఎం జగన్ పరిపాలన సాగుతోందని.. ఇదే చొరవ పాలనపై చూపడం లేదని కళా వెంకట్రావు ఆక్షేపించారు. హైకోర్టు చీవాట్లు పెట్టినప్పటికీ ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని మండిపడ్డారు. వైకాపా సభకు అనుమతిచ్చారని.. తెదేపాకు నిరాకరించడం ద్వారా పోలీసులు ద్వంద్వ వైఖరి తెలుస్తోందని కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
*గతంలా కాదు.. దిల్లీలో పరిస్థితి మారింది!
ఎన్నికల్లో గెలుపు భాజపాదే: కిషన్ రెడ్డి
దిల్లీ అసెంబ్లీకి త్వరలో జరగబోయే ఎన్నికల్లో భాజపా అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ఆదివారం ఆయన దిల్లీలోని తన నివాసంలో తెలుగువారితో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఇంతకుముందుతో పోలిస్తే దిల్లీలో పరిస్థితి మారింది. ఆప్ పోవాలి.. భాజపా రావాలని దిల్లీ ప్రజలు కోరుకుంటున్నారు. దిల్లీకి కేంద్రం ఇస్తున్న నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. దేశ వ్యతిరేక శక్తులు, విభజనవాదులతో కలిసి ఆప్ దిల్లీలో పాలన కొనసాగిస్తోంది. షహీన్బాగ్లో కేజ్రీవాల్ ధర్నాలు చేయిస్తున్నారు. సీఎం కావడమే లక్ష్యంగా ఉచిత పథకాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రజలు ఉచిత పథకాలు కోరుకోవడం లేదు.. మౌలిక సదుపాయాలు, గృహకల్పన, కాలుష్య రహిత దిల్లీని కోరుకుంటున్నారు. దిల్లీలో భాజపాని ఓడించాలని కాంగ్రెస్ కుట్ర పన్నింది. ఆప్ను గెలిపించాలనే కాంగ్రెస్ పోటీ నుంచి తప్పుకుంది. ఆప్ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కోరుకుంటోంది’’అని కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు.
*తెలంగాణపై కేంద్రానికి వివక్ష: కేసీఆర్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై తెలంగాణ సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రతిపాదనలు పూర్తి నిరాశాజనకంగా ఉన్నాయన్నారు. శనివారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై సీనియర్ అధికారులతో దాదాపు నాలుగు గంటల పాటు కేసీఆర్ సమీక్షించారు. కేంద్రం చేసిన కేటాయింపులు తెలంగాణ పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల్లో కేంద్రం భారీగా కోత విధించిందని చెప్పారు. నిధుల కేటాయింపుల విషయంలో తెలంగాణ పట్ల వివక్ష చూపించారని మండిపడ్డారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా నిష్పత్తిని తగ్గించడం దారుణమన్నారు. నిధుల కోత వల్ల రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఏర్పడుతుందని చెప్పారు.
*తుగ్లక్ చర్యల వల్లే నిధులు రాలేదు:యనమల
ముఖ్యమంత్రి జగన్ తుగ్లక్ చర్యల వల్లే కేంద్ర బడ్జెట్లో ఏపీకి నిధులు కేటాయించలేదని శాసనమండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. వైకాపా అవినీతి, అసమర్థ పాలనతో రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లిందన్నారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టే సామర్థ్యం సీఎం జగన్లో లోపించిందని యనమల విమర్శించారు. రాష్ట్రంలో గత 8నెలల్లో అభివృద్ది పనులన్నీ ఆపేశారని, పోలవరం సహా, కీలక ప్రాజెక్టులన్నీ నిలిపేశారని ఆరోపించారు. రాజధానికి నిధులు వద్దని ప్రధానికి ఇచ్చిన తొలి వినతిలోనే సీఎం జగన్ చెప్పారని యనమల ఆక్షేపించారు.