తేజ తెరకెక్కించిన ‘లక్ష్మీ కళ్యాణం’తో టాలీవుడ్‌కు పరిచయమైంది కలువ కళ్ళ సుందరి కాజల్ . కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘చందమామ’ సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది. 12 ఏళ్ళ కెరీర్‌లో ఎన్నో మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరించింది. రేపు ప్రఖ్యాత సింగపూర్ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ క్రమంలో కాజల్ వీడియో ద్వారా విషయాన్ని నెటిజన్స్‌కి చేరవేసింది. తన విగ్రహాన్ని మేడం టుస్సాడ్స్ లో పెడుతున్నందుకు తెగ సంతోషిస్తుంది కాజల్. కాగా ఈ మ్యూజియంలో ఇప్పటికే తెలుగు చిత్రసీమకు సంబందించి మహేష్ బాబు, ప్రభాస్ వంటి నటుల విగ్రహాలు కోలువుదీరాయి. ఈ విగ్రహాలతో పాటు హిందీ చిత్ర సీమ నుండి అమితాబ్, హృతిక్ రోషన్ , కాజోల్, కరీనా కపూర్ వంటి అనేక మంది నటీ నటుల మైనపు విగ్రహాలు అక్కడ ఉన్నాయి. కాజల్ ప్రస్తుతం తెలుగులో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న మోసగాళ్లు చిత్రంలో నటిస్తోంది. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు 2లో కూడా కథానాయికగా మెరవనుంది.
టుస్సాడ్స్‌లో కాజల్ విగ్రహం
Related tags :