ScienceAndTech

భారతీయుల టిక్‌టాక్ లెక్కలు

Here's how much time Indians spend on tiktok?

వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌కి అడిక్ట్ అవుతున్నోళ్ల సంఖ్య బాగా పెరిగిపోతోంది. తమలో దాగి ఉన్న టాలెంట్‌ను పది మందికి తెలిసేలా చేసేందుకు ఓ వేదిక దొరకడంతో ఈ యాప్‌లో వీడియోలు పెడుతున్న వాళ్లు ఎక్కువైయ్యారు. ఇది టిక్‌టాక్‌కి ఒక వైపు మాత్రమే. అయితే, టిక్‌టాక్‌లో వీడియోలను టైమ్ పాస్‌కి, వినోధం కోసం చూస్తూ ఆనందించే వాళ్లు కూడా ఎక్కువ మందే ఉన్నారు. ఇలా టిక్‌టాక్‌లో గంటలకొద్దీ గడిపేవాళ్లకి కొదవే లేదు. టిక్‌టాక్‌పై సర్వే చేసిన అమెరికాకు చెందిన డేటా అనలిటిక్స్ కంపెనీ యాప్ యానీ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ యాప్‌లో గంటల కొద్దీ గడుపుతూ ఇండియన్స్.. టిక్‌టాక్‌ పాత రికార్డుల్నే బ్రేక్ చేశారని ఈ సంస్థ తెలిపింది. 2019 సంవత్సరం మొత్తంలో టిక్‌టాక్‌ యాప్‌పై మనోళ్లు 550 కోట్ల గంటల సమయం గడిపేశారు.ఈ సమయాన్ని సంవత్సరాల్లోకి మారిస్తే 6 లక్షల 27 వేల ఏళ్ల కాలానికి సమానమవుతుంది.
2018లో ప్రపంచ వ్యాప్తంగా అందరూ కలిపి టిక్‌టాక్‌ యాప్‌లో గడిపిన టోటల్ టైమ్ కన్నా ఎక్కువ2019లో ఒక్క ఇండియన్స్ స్పెండ్ చేసిన సమయం ఎక్కువని అని ఆ సంస్థ వెల్లడించింది. దీంతో టిక్‌టాక్ పాత రికార్డుని మనోళ్లు తిరగరాశారన్నమాట.
*యాక్టివ్ యూజర్లలో రెండో ప్లేస్
టిక్‌టాక్‌లో యాక్టివ్ యూజర్లు ప్రతి నెలా 90 శాతం పెరుగుతున్నారని సర్వే తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా యాక్టివ్ యూజర్లలో చైనా తొలిస్థానంలో ఉంటే రెండో స్థానంలో ఇండియా ఉంది. 2019 డిసెంబరులో ఇండియా తర్వాతి స్థానంలో ఉన్న 11 దేశాల టోటల్ కన్నా మనోళ్లు టిక్‌టాక్‌లో గడిపిన సమయమే ఎక్కువ. ఇండియన్స్ ఈ యాప్‌లో డీప్‌గా లీనమైపోతున్నారని సర్వే సంస్థ చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా 2019లో ఈ యాప్ డౌన్‌లోడ్స్ భారీగా పెరిగాయి. గత ఏడాదిలో 74 కోట్ల మంది టిక్‌టాక్‌ని తమ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ సంఖ్య 2018లో జరిగిన డౌన్‌లోడ్స్ 65.5 కోట్ల కన్నా 13 శాతం ఎక్కువ.
*ఇండియాలో కొద్ది రోజుల పాటు నిషేధం
చైనాకు చెందిన ఈ యాప్‌లో పిల్లలకు అడల్ట్ కంటెంట్ అందుబాటులోకి వస్తోందంటూ గత ఏడాది ఏప్రిల్‌లో మద్రాస్ హైకోర్టు టిక్‌టాక్‌పై నిషేధం విధించింది. పోర్నోగ్రఫీ, అడల్ట్ కంటెంట్ తొలగిస్తామని, అటువంటి వీడియోలు యాప్‌లో లేకుండా చూసుకుంటామని ఆ సంస్థ హామీ ఇవ్వడంతో నిషేధం తొలగించింది కోర్టు. గూగుల్ ప్లే స్టోర్‌లో ఆ యాప్ అందుబాటులో లేని కొద్ది రోజుల్లోనే టిక్‌టాక్‌ యాజమాన్యానికి 33 శాతం ఆదాయం తగ్గిపోయింది. ఇండియాలో నిషేధం ఉన్న ఆ కొన్నాళ్లు ప్రతి రోజూ 3.5 కోట్లు నష్టం వచ్చిందని ఆ సంస్థ వెల్లడించింది.