రసాయనాలతో పండించే పంటల కంటే ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం ద్వారా కాన్సర్ ముప్పు తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
కారణాలేవైనా ప్రజల్లో రోజురోజుకి కాన్సర్ ముప్పు పెరుగుతోంది. ఈ సమస్య వచ్చిన తర్వాత బాధపడే బదులు రాకముందే జాగ్రత్తలు తీసుకోవడం మేలు.
ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం ద్వారా కాన్సర్ రిస్క్ తగ్గుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎటువంటి రసాయనాలు వేయకుండా పండించడం వల్లే ఇది సాధ్యమని తేల్చారు. ఆర్గానిక్ ఫుడ్ ఆరోగ్యానికి ఎంతో మేలు అని ముందు నుంచీ తెలుసు… తాజాగా ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు శాస్త్రవేత్తలు.
70వేల మందిపై కొనసాగిన సరికొత్త పరిశోధన… పరిశోధనల్లో ఆర్గానిక్ ఫుడ్‌ని తీసుకోవడం ద్వారా కాన్సర్ రిస్క్ 25 శాతం తగ్గిందని తేలింది.
సాధారణ ఆహార పదార్థాలను రసాయనాలు వేసి పండిస్తారు కాబట్టి ఆ రసాయనాల వల్ల కాన్సర్ వచ్చే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాబట్టి రసాయనాలతో పండించిన ఫుడ్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిదని వెల్లడిస్తున్నారు.
ముఖ్యంగా.. మహిళలపై కొనసాగిన పరిశోధనల్లో.. ఆర్గానిక్ ఫుడ్ తినేవారు.. తినని వారికంటే 25శాతం కంటే తక్కువగా కాన్సర్‌ని ఎదుర్కున్నారని తేలింది. ఆర్గానిక్ ఫుడ్ తినేవారు బ్రెస్ట్ కాన్సర్ కారకాలను తక్కువగా కలిగి ఉన్నారని తేల్చారు వైద్యులు.