భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ చాను కొత్త జాతీయ రికార్డు సృష్టించింది. జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో మంగళవారం మహిళల 49 కేజీల విభాగంలో స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 115 కేజీలు ఎత్తిన మీరా (రైల్వేస్) .. మొత్తం మీద 203 కేజీలు లిఫ్ట్ చేసి తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు (201) తిరగరాసింది. తెలంగాణ అమ్మాయి ప్రియదర్శిని 49 కేజీల విభాగంలో ఒక స్వర్ణం, ఒక కాంస్యంతో సత్తాచాటింది. స్నాచ్‌లో 70 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 98 కిలోలు, మొత్తంగా 168 కేజీల బరువులెత్తింది. ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం, అంతర్ రాష్ట్ర విభాగంలో స్వర్ణ పతకాలు కైవసం చేసుకుంది.
వెయిట్‌లిఫ్టింగ్‌లో తెలంగాణా అమ్మాయికి స్వర్ణం
Related tags :