ఏపీలో పలువురు ప్రముఖుల ఇళ్ళపై ఐటీ దాడులు చేస్తోంది. ఇందులో ముఖ్యంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పీఏగా వ్యవహరించిన శ్రీనివాస్ ఇంటిపై ఐటీ దాడులు నిర్వహిస్తోంది. చంద్రబాబు ఉమ్మడి ఏపీలో రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నుంచి రాష్ట్ర విభజన తరువాత 2014లో సిఎం అయ్యాక కూడా శ్రీనివాస్ పీఏగా బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబుకు శ్రీనివాస్ వీరవిధేయుడిగా పేరుంది.శ్రీనివాస్ సాధారణ పరిపాలన శాఖ ఉద్యోగి. ఆయన ప్రకాశం జిల్లాకు చెందినవాడు. 2014లో రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆ సమయంలో పీఏగా వ్యవహరించి శ్రీనివాస్ భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదులు ఐటీ శాఖకు అందాయి. ఫిర్యాదు అందుకున్న ఐటీ శాఖ హైదరాబా,విజయవాడలలో ఉన్న ఆయన నివాసాలపై ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది.
బాబు మాజీ పీఏ శ్రీనివాస్‌పై ఐటీ పంజా
Related tags :