కువైట్‌లోని రఫా నాదల్ అకాడమీ నిర్వహించిన అండర్-16 బాలికల టెన్నిస్ పోటీల్లో తెలుగు అమ్మాయి సాయి హర్షిత అడివి విజేతగా నిలిచింది. బుధవారం సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ పాల్గొని ఆమెకు ట్రోఫీ అందజేశారు. బహుమతుల ప్రదానోత్సవానికి కువైట్‌లోని పలువురు అధికారులు హాజరయ్యారు. కాగా, రఫా అకాడమీ ప్రస్తుతం షేక్ జబర్ అల్ అబ్దుల్లా అల్ జబర్ అల్ సబాహ్ ఇంటర్నెషనల్ టెన్నిస్ కాంప్లెక్స్‌తో కలిసి పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు చెందిన బాలశివ శ్రీకాంత్ అడివి, మోహిని విమల కిరణ్‌ల కుమార్తె హర్షిత. శ్రీకాంత్ స్థానిక ఆయిల్ కంపెనీలో టీపీఎల్ స్పెషలిస్టుగా పనిచేస్తుండగా ఆయన కుమార్తె తొమ్మిదో తరగతి చదువుతోంది.
కువైట్ టెన్నిస్ పోటీలో భీమవరం అమ్మాయి గెలుపు
Related tags :