సినీనటుడు నాగశౌర్యపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు అందింది. డ్రైవర్ల పట్ల ఆయన అవమానకరంగా మాట్లాడారంటూ రాష్ట్ర ట్యాక్సీ డైవర్ల ఐకాస నాయకులు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో నాగశౌర్య చేసిన వ్యాఖ్యలకు గాను బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నాగశౌర్య , మెహరీన్ జంటగా నటించిన ‘అశ్వథ్థామ’ చిత్రం ఇటీవల విడుదలైంది. రమణ తేజ దీన్ని తెరకెక్కించారు. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మల్పూరి నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం మంచి టాక్‌ను తెచ్చుకుంది.
మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు

Related tags :