ఆస్ట్రేలియాలో కార్చిచ్చు బాధితుల సహాయార్థం మెల్‌బోర్న్ వేదికగా జరిగిన గిల్‌క్రిస్ట్ ఎలెవన్×పాంటింగ్ ఎలెవన్ బుష్‌ఫైర్ బాష్ ఛారిటీ మ్యాచ్‌లో దిగ్గజ క్రికెటర్లు అలరించారు. ఎన్నో ఏళ్ల విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టినా ఎంతో ఉత్సాహంగా ఆడారు. అయితే గిల్‌క్రిస్ట్ ఎలెవన్‌పై పాంటింగ్ ఎలెవన్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాంటింగ్ సేన నిర్ణీత 10 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. పాంటింగ్ (26, 14 బంతుల్లో; 4×4), లారా (30, 11 బంతుల్లో; 3×4,2×6) సత్తా చాటారు. గిల్లీ జట్టులో వాల్ష్, సైమండ్స్, యువరాజ్ తలో వికెట్ తీశారు.
అనంతరం బరిలోకి దిగిన గిల్లీసేన ఆరు వికెట్లు కోల్పోయి 103 పరుగులే చేసింది. షేన్ వాట్సన్ (30, 9 బంతుల్లో, 2×4,3×6), సైమండ్స్ (29, 13 బంతుల్లో; 3×4,2×6), గిల్లీ (17,11 బంతుల్లో 2×4,1×6) రాణించారు. యువీ (2) నిరాశపరిచాడు. పాంటింగ్ ఎలెవన్ బౌలర్లలో బ్రిట్ లీ రెండు, హోడ్జ్ ఒక్క వికెట్ తీశారు. ఈ మ్యాచ్ ఇన్నింగ్స్ విరామంలో సచిన్ బ్యాటు పట్టి అలరించాడు. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎలీస్ పెర్రీ సవాలును స్వీకరించి బ్యాటింగ్ చేశాడు.