వాలంటైన్స్ డే సమీపిస్తోంది. ప్రస్తుతం వాలంటైన్స్ వీక్ నడుస్తోంది.
‘రోజ్ డే’, ‘ప్రపోజ్ డే’ తరువాత ఈ రోజు (ఫిబ్రవరి 9) ప్రేమికులు ‘చాక్లెట్ డే’ చేసుకుంటున్నారు.
నేడు ప్రేమికులు ప్రత్యేకమైన చాక్లెట్లను పరస్పరం పంచుకుంటారు.
ప్రేమికుల రోజు సందర్భంగా పలు సంస్థలు ‘విష్ ఆన్ చాక్లెట్ డే’ పేరుతో చాక్లెట్లను రూపొందించి మార్కెట్లోకి విడుదల చేశాయి.
చాక్లెట్లు తినడం వలన జీవితం చక్కగా సాగుతుందనే భావనతో ప్రేమికులు వాటిని పరస్పరం పంచుకుంటారు.
చాక్లెట్లో థియోబ్రోమిన్, కెఫిన్ ఉండటం వలన, వీటిని తిన్న వెంటనే శరీరానికి శక్తి లభిస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం సమకూరుతుంది.