తిరుమల ముఖద్వారం దగ్గర ఆధ్యాత్మికత ఉట్టిపడేలా స్వాగత ఆర్చీని నిర్మించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటోంది. భక్తులు ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసి తిరుమలకు చేరుకోగానే ముఖ ద్వారం వద్ద ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆర్చి కనిపించేలా నిర్మించనున్నారు. ఇందుకోసం టీటీడీ పాలకమండలి కోటి 70 లక్షలు మంజూరు చేసింది.
తిరుమల జీఎన్సీ టోల్ గేట్ దగ్గర నిర్మించిన ఆర్చి ఎప్పుడో దశాబ్దాల క్రితంది. గతంలో తిరుమలకు రాకపోకలన్నీ ఇదే ఆర్చి ద్వారా జరిగేవి. అయితే క్రమంగా వాహనాల రద్దీ పెరగడంతో ఆర్చికి తూర్పువైపున తాత్కాలిక షెడ్లు వేసి అందులో నుంచి తిరుపతికి వెళ్లే వాహనాలను అనుమతిస్తున్నారు. ఇక తిరుమలకు వచ్చే వాహనాలను పాత ఆర్చి ద్వారానే తిరుమలలోకి ప్రవేశిస్తున్నాయి. ఈ ప్రాంతంలోనే తిరుమలకు వచ్చిన అనుమానిత వాహనాలను విజిలెన్స్ సిబ్బంది మరోమారు తనిఖీలు చేస్తుంటారు. అయితే తిరుమల విస్తరణకు తగినట్లుగా స్వాగత ఆర్చీలు విస్తరించలేదన్నది అధికారుల భావన
అదనపు ఈవో ధర్మారెడ్డి సూచన మేరకు స్వాగత ఆర్చి విస్తరించి నాలుగు లైన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అంటే, తిరుమల కొండపైకి వచ్చే వాహనాలు, అలాగే తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే వాహనాల కోసం వేర్వేరుగా లైన్లను ఏర్పాటు చేస్తారు.
ఇందులోనే తిరుమలకు వచ్చిన అనుమానిత వాహనాలను మరోమారు తనిఖీలు చేసే అవకాశం ఉంటుంది. ఇక తిరుపతికి వెళ్లే వాహనాలను కూడా అత్యవసర పరిస్థితుల్లో తనిఖీలు చేయడానికి వీలుగా ఈ స్వాగత ఆర్చీని నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
స్వాగత ఆర్చీ పనులు ఇప్పటికే ప్రారంభించిన టీటీడీ.. టోల్ గేట్ దగ్గర గతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లను తొలగించింది. త్వరలోనే నాలుగు లైన్ల స్వాగత ఆర్చి తిరుమలకు వచ్చే భక్తులకు కనువిందు చేయనుంది.
తిరుమల ముఖద్వారం దగ్గర ఆధ్యాత్మికత ఉట్టిపడేలా స్వాగత ఆర్చ్.
కొత్త ఆర్చ్ నిర్మించేందుకు టీటీడీ చర్యలు.
కోటి 70 లక్షలు మంజూరు చేసిన టీటీడీ పాలకమండలి.
తిరుమల జీఎన్సీ టోల్ గేట్ వద్ద దశాబ్దాల క్రితం నిర్మించిన ఆర్చ్.
తిరుమల విస్తరణకు తగ్గట్టు స్వాగత ఆర్చ్‌లు విస్తరించలేదనే భావన.
త్వరలోనే నాలుగు లైన్ల స్వాగత ఆర్చ్ నిర్మాణం.
పాత ఆర్చ్ ద్వారానే తిరుమలకి వాహనాలు.
వాహనాలను మరోమారు తనిఖీ చేస్తున్న విజిలెన్స్ సిబ్బంది.
తిరుమల, తిరుపతికి వెళ్లే వాహనాల కోసం లైన్లు
తాత్కాలిక షెడ్లను తొలగింపు…
తిరుమలలో నూతన స్వాగత ద్వారం
Related tags :