చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ బారిన పడి ఇప్పటికే 800 మందికి పైగా చనిపోయారు. వేలల్లో వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్నారు. అలా వైరస్ బారిన పడిన ఒక మహిళ పండంటి బాబుకు జన్మనిచ్చింది. అయితే వైద్యులు పుట్టిన బాలుడికి కూడా వెంటనే కరోనా టెస్టులు చేశారు. అదృష్టవశాత్తు బాలుడికి వైరస్ సోకలేదని వైద్యులు తెలిపారు. తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో శనివారం ఈ బాలుడు జన్మించాడు. వైద్యులు తగిన రక్షణ చర్యలు తీసుకున్న తర్వాత ఆపరేషన్ చేసి బాలుడిని బయటకు తీశారు. కరోనాను ఎదిరించి పుట్టిన ఈ బాలుడి వార్త సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తుంది. నెటిజన్లు అందరూ ఆ బాలుడిని లక్కీ బోయ్ అని అంటున్నారు. మరికొంత మంది అయితే బాలుడి ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
వైరస్ బాలుడు
Related tags :