శ్రీదేవి నట వారసురాలిగా బాలీవుడ్ అరంగేట్రం చేసింది జాన్వీకపూర్. తొలి సినిమా `ధడక్`తోనే అభిమానులను ఫిదా చేసింది. తన అందంతోనూ, నటనతోనూ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం ఐఏఎఫ్ తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్‌లో నటిస్తోంది. స్టైల్ ఐకాన్‌గా చెప్పుకునే జాన్వి జిమ్ డ్రెస్ కూడా సూపర్ పాపులర్. పొట్టి బట్టలు వేసుకుని జిమ్‌కు వచ్చే జాన్వి స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ ఫొటోల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వి స్పందించింది. `అభిమానులు ఇంతకుముందు నా దగ్గరకు వచ్చి నా తొలి సినిమా `ధడక్` గురించి మాట్లాడేవారు. ఆ సినిమా బాగుందని, అందులో నా నటన చాలా బాగుందని చెప్పేవారు. ఇప్పుడేమో నేను జిమ్‌కి వేసుకునే దుస్తులు చాలా బాగుంటున్నాయ్ అంటున్నారు. వారు అలా మాట్లాడుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగని వారినేం తప్పు పట్టను. ఎందుకంటే అందరూ అందం, దుస్తుల మీదే దృష్టి పెడతారు. మున్ముందు నేను వేసుకునే పొట్టి దుస్తుల గురించి కాకుండా, నా సినిమాల గురించి మాట్లాడుకుంటారని అనుకుంటున్నా`ని జాన్వి ఆశాభావం వ్యక్తం చేసింది.
నా బట్టల సంగతి వదిలేయండి ప్లీజ్
Related tags :