‘చదువు చారెడు… బలపాలు దోసెడు’ అన్నట్లు చిన్నారుల బ్యాగు చూడండి. ముఖ్యంగా ఒకట్రెండు తరగతులు చదువుతున్న చిచ్చరపిడుగుల పెన్సిల్ బాక్స్‌లో చిన్నవి, పెద్దవి బోలెడు పెన్సిల్స్ కనిపిస్తాయి. కొంతమంది చిన్నారులకు రాయడం కంటే పెన్సిల్స్‌ను అదేపనిగా చెక్కడం సరదా. దాంతో ఒక పెన్సిల్ ఒకటిరెండు రోజుల్లో పొట్టిదైపోతుంది. ఇలా వారి దగ్గర చాలా పెన్సిల్ ముక్కలు ఉంటాయి. పట్టుకోవడానికి వీల్లేకుండా ఉండే వీటిని అటు పారేయలేం, ఇటు వాడలేం. ఇలాంటి ఇబ్బందులు తీర్చడానికే మార్కెట్లో పెన్సిల్ ఎక్స్‌టెన్షనర్స్ దొరుకుతున్నాయి. పొడవుగా ఉండే వీటిలో ఈ చిన్ని పెన్సిల్‌ను దూర్చేస్తే సరి. పెన్సిల్ మొత్తం అయిపోయేవరకు చక్కగా ఉపయోగించవచ్చు. రాయడం తేలికే.. ఏమంటారు.
పిల్లలు పెన్సిల్స్ పారేస్తున్నారా?
Related tags :