అందానికి మరోపేరు పువ్వులు. రంగు రంగుల పూలు మానసిక ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. అందుకే వేడుకల్లో పూల బొకేలను బహుమతిగా ఇస్తుంటాం. అమ్మాయిల నగల్లోనూ అందలమెక్కాయి. ప్రస్తుతం ప్రెస్డ్ ఫ్లవర్ జువెలరీ ట్రెండ్ నడుస్తోంది. వీటిని ‘బొటానికల్ జువెలరీ’ అని కూడా అంటారు. విరబూసిన చిన్న పూలను గట్టిగా ఒత్తి పట్టి గాజు పెండెంట్ లోపల పెడతారు. ప్రెస్ చేసినా పూలు వాడవు. తాజాగా ఉంటాయి. ఎన్నాళ్లయినా చెక్కు చెదరవు. ఇలా ప్రెస్ చేసిన పూలతో చెవి రింగులు, గాజులు, ఉంగరాలు వంటి ఆభరణాలు తయారుచేస్తున్నారు డిజైనర్లు. వీటితోపాటు ఫోన్ కేస్‌లు, నెయిల్‌పాలిష్‌లుగా కూడా పచ్చిపూలను వాడుతున్నారు. పూలతోపాటు ఆకులను ఉపయెగిస్తున్నారు. నగలకు హైడ్రాంగియా, ఆర్కిడ్, లిలాక్, లావెండర్స్ లాంటి పూలనే ఉపయో గిస్తారు. పెండెంట్‌లో లేదా చెవిరింగులో పట్టేంత వాటినే ఎంపిక చేసుకుంటారు. ఇవన్నీ ఆన్‌లైన్ మార్కెట్లో లభిస్తున్నాయి.
నగలపై పూల మధురిమలు
Related tags :