రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై బస్సు యాత్ర చేపట్టేందుకు తెదేపా అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఈనెల 17 నుంచి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రజాచైతన్య యాత్ర చేపట్టాలని తెదేపా విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. సుమారు 45 రోజులపాటు ఇది కొనసాగే అవకాశముంది. ఈ బస్సు యాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడంతో పాటు, పెట్టుబడులు, మూడు రాజధానులు, సంక్షేమ పథకాల్లో కోత తదితర అంశాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబు ఎండగట్టనున్నారు. తెదేపా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల ఆధ్వర్యంలో ఈ యాత్రలు నిర్వహించనున్నారు. అయితే బస్సు యాత్రను ఎక్కడి నుంచి ప్రారంభిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరో రెండు మూడు రోజుల్లో ఈ యాత్ర రూట్ మ్యాప్ ఖరారయ్యే అవకాశముంది.
మరోసారి చంద్రబాబు బస్సు యాత్ర
Related tags :