DailyDose

కోర్టులో కన్నీరు పెట్టిన నిర్భయ తల్లి-నేరవార్తలు

Nirbhaya's Mother Cries In Court-Telugu Crime News Roundup Today

* నిర్భయ దోషుల‌ను ఉరితీత విషయంలో జరుగుతున్న జాప్యంపై ఆమె తల్లి ఆశాదేవి పాటియాలా హౌస్ కోర్టు హాలులో భావోద్వేగానికి గురయ్యారు. మా హక్కుల సంగతేంటి? అని ప్రశ్నిస్తూ భోరుమని ఏడ్చేశారు. నిర్భయ కేసులో దోషులైన ముఖేష్, పవన్, అక్షయ్, వినయ్‌ల ఉరితీతకు కొత్త తేదీ (డెత్ వారెంట్లు) ఇవ్వాలని కోరుతూ నిర్భయ తల్లిదండ్రులు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆశాదేవి కన్నీటి పర్యంతమయ్యారు. రెండు చేతులూ జోడించి వేడుకుంటున్నా. దయచేసి డెత్ వారెంట్లు జారీ చేయండి. నేను కూడా మనిషినే. ఈ దురదృష్ట ఘటన జరిగి ఏడేళ్లకు పైగా అయింది అంటూ ఆశాదేవి కంటతడి పెట్టారు. అయితే తన తరఫున వాదించేందుకు న్యాయవాది ఎవరూ లేరంటూ దోషుల్లో ఒకడైన పవన్‌ గుప్తా కోర్టుకు విన్నవించాడు. దీంతో అతడికి తక్షణమే కోర్టు న్యాయ సహాయం అందించింది. ఎంపానెల్డ్‌ న్యాయవాదుల జాబితాను ఇచ్చి లాయర్‌ను ఎంచుకోవాలని సూచించింది. అనంతరం డెత్ వారెంట్ల పిటిషన్లపై విచారణను గురువారానికి వాయిదా వేసింది.
*తుకుడే తుకుడే గ్యాంగ్ అని వస్తున్న వార్తల పై కేంద్ర ప్రభుత్వం వద్ద ఎలాంటి సమాచారం లేదని పార్లమెంటుకు తెలిపారు. హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అంతేకాదు తుకుడే తుకుడే గ్యాంగ్ అనే పదం ఎలా పుట్టుకొచ్చిందో తనకు తెలియదని చెప్పారు.
* కడప జిల్లా.. ప్రొద్దుటూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో యువకుడు ఆత్మహత్యాయత్నం.స్టేషన్ ఆవరణలో పురుగుల మందు తాగేందుకు యత్నించిన మనోహర్.పురుగుల మందు తాగుబోతు౦డగా అడ్డుకున్న పోలీసులు.తన చిన్నాన్న కుమార్ పెట్టిన కేసు విషయంలో విచారణలో భాగంగా మనోహర్ ను స్టేషన్ కు పిలిపించిన పోలీసులు.
* గుంటూరు జిల్లాఅన్యాయంగా పెన్షన్లు తీశారని ధూళిపాళ్ల నిరసన.పొన్నూరు ఎంపిడిఓ కార్యాలయం ఆవరణలో బాధితులతో నిరసన.చీరాల పరిధిలో పనిచేస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్ ని వేరొక వ్యక్తితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సదరు మహిళా కానిస్టేబుల్ భర్త. చీరాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో భర్త పిర్యాదు.
* పెనుబల్లి మండలం రామచంద్ర రావు బంజర్ వద్ద బైక్ ను ఢీకొట్టిన లారీ.బైక్ పై వెళ్తున్న 9నెలల గర్భిణి బలుసుపాటి కల్యాణి(20) అక్కడికక్కడే మృతి.మృతదేహం చిద్రం కావటం తో మృతురాలి కడుపులోని శిశువు 10 మీటర్ల దూరంలో పడి మృతి.గర్భిణి అయిన కల్యాణి పెనుబల్లి లోని హాస్పటల్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన…
* సింగపూర్‌లో హిందీ ఎంటర్‌టైన్మెంట్ క్లబ్స్ నడిపిస్తున్న భారత దంపతులు మల్కర్ సవ్లారామ్ అనంత్(51), ప్రియాంక భట్టాచార్య రాజేష్(31)… ముగ్గురు బంగ్లాదేశీ మహిళలను పనిలో పెట్టుకొని జీతాలు ఇవ్వకుండా హింసించిన కేసులో అక్కడి న్యాయస్థానం ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే ఇద్దరికి చెరో 7,500 సింగపూర్ డాలర్లు(రూ. 3,85,382) ఫైన్ వేసింది. అంతేగాక ముగ్గురు మహిళలలో ఎవరికైతే జీతం చెల్లించలేదో ఆమెకు 4,878 సింగపూర్ డాలర్లు(రూ. 2,50,652) ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. గతేడాది నవంబర్‌లో ఈ కేసు సింగపూర్ కోర్టులో విచారణకు రాగా… దంపతులను కార్మికుల అక్రమ రవాణా కింద న్యాయస్థానం దోషిగా తేల్చింది. మంగళవారం వారికి శిక్షను ఖరారు చేసింది. భార్య ప్రియాంకను మహిళలను వ్యభిచారం రోంపిలోకి దించేందుకు ప్రత్నించిన కేసులో దోషిగా తేలితే… భర్త కార్మిక అక్రమ రవాణాలో దోషిగా తేలాడు.
* ప్రేమ విఫలమైందని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది.
* నందిగామ ,పౌరసరఫరాల శాఖకు సంబంధించిన రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న లారీని కంచికచర్ల వద్ద పట్టుకున్న విజిలెన్స్ అధికారులుతెలంగాణ రాష్ట్రం ఎర్రుపాలెం నుండి యానం కు అక్రమంగా తరలి వెళ్తున్న రేషన్ బియ్యం డ్రైవర్ పిల్లి వెంకటేశ్వరరావు ని అదుపులోకి తీసుకొని విచారించిన అధికారులు.
* మధ్య ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ రైతుపై కొందరు సామూహిక దాడి చేయడంతో అతను మృతి చెందాడు. ఈ ఘటన ధార్ జిల్లాలోని మనావర్ తాలూకాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో పోలీసులు గ్రామ సర్పంచ్ బీజేపీనేతను అరెస్టు చేశారు. ఖిరాకియా గ్రామంకు ఈ రైతు తన ఐదుగురు స్నేహితులతో కలిసి వచ్చాడు. అయితే వారు అనుమానంగా కనిపించడంతో చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే వారని భావించి 200 మంది గ్రామస్తులను సర్పంచి రెచ్చగొట్టాడు. దీంతో ఈ రైతుపై ఆ గ్రామస్తులు దాడి చేశారు. ఇతనితో పాటు వచ్చిన వారిపై కూడా దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి ..
* జ‌మాతుల్ ద‌వా చీఫ్ హ‌ఫీజ్ స‌యీద్‌కు పాకిస్థాన్ కోర్టు అయిదేళ్ల జైలు శిక్ష‌ను విధించింది. ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు ఆర్థిక సాయం చేసిన కేసులో ఆయ‌న‌కు ఈ శిక్ష ఖ‌రారైంది. ముంబై దాడుల సూత్ర‌ధారి హ‌ఫీజ్‌పై రెండు టెర్ర‌ర్ ఫైనాన్సింగ్ కేసులు ఉన్నాయి.
* ఇంట్లో పనివాళ్లుగా చేరి, చోరీలకు పాల్పడుతున్న నలుగురు చోరీ ముఠాను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ. 1.5 కోట్ల విలువైన బంగారం, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు.
* ఢిల్లీలో గల ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్‌ వెళ్తున్న ఓ వ్యక్తిని భద్రతా సిబ్బంది అరెస్ట్‌ చేశారు.
* ఢిల్లీలో దారుణం జ‌రిగింది. ఒకే ఇంట్లో అయిదుగురు మృతిచెందారు. దంప‌తుల‌తో పాటు వారి ముగ్గురి పిల్ల‌లు అనుమానాస్ప‌ద రీతిలో ప్రాణాలు కోల్పోయారు.
* కలుషిత ఆహారం రెండేళ్ల చిన్నారి ప్రాణం తీసింది. కాస్త ఖరీదైన హోటల్ ఫుడ్ బాగుంటదని వెళ్తే ఆ కుటుంబాన్ని మొత్తం ఆస్పత్రిపాలు చేసింది.ఆ కుటుంబంలో విషాదం నింపింది. ఈ ఘటన బేగంపేటలోని ఓ హోటల్ లో జరిగింది.
* ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యే కాన్వాయ్ పై కాల్పులు కలకలం సృష్టించాయి. మెహ్ రౌలీ నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత నరేష్ యాదవ్ గుడికి వెళ్లి వస్తుండగా ఆయన కాన్వాయ్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆప్ కార్యకర్త ఒకరు మరణించగా మరొకరికి గాయాలయ్యాయి.
* సిరిసిల్ల ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్టూ డెంట్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఫిర్యాదుతో తంగళ్లపల్లి మండలం మండె పల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నేత, మాజీ సర్పంచి తంగళ్లపల్లి దేవయ్యను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ కేసులో మరో ఇద్దరిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు.
* ఆర్మీ కల్నల్ తన ఆఫీసులోనే సెక్స్ చేసేవాడంటూ ఇద్దరు జవాన్లు ఏకంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. కొన్నాళ్ల క్రితం రిటైర్ అయిన ఆఫీసర్‌ చేసే పనులను బయటపెట్టే ప్రయత్నం చేసినందుకు గతంలో తమను వేధించాడని లేఖ ద్వారా తెలిపారు.
* సోషల్ మీడియా అడ్డాగా ఆవారాగాళ్ళు రెచ్చిపోతున్నారు. అమ్మాయిల ఫొటోలతో బ్లాక్ మెయిలింగ్ కి దిగుతున్నారు. చెప్పినట్టు వినకపోతే ఫొటోలు మార్ఫ్ చేసి వైరల్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఇలాంటిదే ఆన్ లైన్ అప్లికేషన్ల డేటాతో యువతులకు వాట్సాప్ లో న్యూడ్ వీడియో కాల్స్ చేస్తున్న బ్లాక్ మెయిలర్ ని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. జాయింట్ కమిషనర్ అవినాశ్ మహంతి వివరాలు వెల్లడించారు.
* కర్నూలు జిల్లా నందికొట్కూరు ఆఫీసు రోడ్డులో దారుణం జరిగింది. కోడలు పద్మావతిపై అత్త పుల్లమ్మ కిరోసిన్ పోసి నిప్పంటించింది. దీంతో పద్మావతి తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే కర్నూలు ఆస్పత్రికి తరలించారు. మంటలను తట్టుకోలేక కోడలు అత్తను పట్టుకోవడంతో పుల్లమ్మకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
* ప్రముఖ చిత్ర, టీవీ నటుడు షాబాజ్‌ ఖాన్‌పై లైంగిక వేధింపుల కేసును నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఓ యువతిని లైంగిక వేధించినట్లు ఫిర్యాదు రావడంతో ఓషివారా పోలీసు స్టేషన్‌లో ఆయనపై ఐపీసీ సెక్షన్‌ 354, 509 కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బుధవారం పోలీసులు వెల్లడించారు. కాగా ఈ కేసు దర్యాప్తులో ఉన్నందున ఆయనపై ఇంతవరకు ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదని ఏఎన్‌ఐ న్యూస్‌ పేర్కొంది.
*తమ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం నుంచి భార్యను కాపాడే క్రమంలో భారత్‌కు చెందిన 32 సంవత్సరాల వ్యక్తి దుబాయ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దుబాయ్‌లోని ఉమ్‌అల్‌ క్విన్‌లోని తమ ఫ్లాట్‌లో కేరళకు చెందిన అనిల్‌ నినన్‌, నీను దంపతులు నివసిస్తున్నారు. సోమవారం వారి ఫ్లాట్‌లో మంటలు చెలరేగగా భార్య నీనును రక్షించే క్రమంలో అనిల్‌కు తీవ్ర కాలిన గాయాలయ్యాయి. స్ధానికులు అనిల్‌ దంపతులను అబుదాబిలోని మఫ్రాక్‌ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
*ట్రాఫిక్‌జామ్‌ కారణంగా ఓ పసివాని ప్రాణాలు పోయిన సంఘటన నగరంలో మంగళవారం చోటుచేసుకుంది. అత్యవసర చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆతృతతో బయల్దేరినా ప్రయోజనం శూన్యంగా పరిణమించింది. మంగళవారం ఉదయం ఈ విచారకర సంఘటన చోటుచేసుకోగా ఈ ఘటనలో ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బాలుడు అస్వస్థతకు గురికావడంతో స్థానిక వైద్యుడితో ఆ బాలుడికి చికిత్స అందజేశారు. సోమవారం రాత్రి అయినా ఆ బాలుడి ఆరోగ్యం కుదుటపడకపోవడంతో స్థానిక క్యాపిటల్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో అక్కడి వైద్యులు ఉన్నత చికిత్స కోసం కటక్‌ ఎస్సీబీ మెడికల్‌ కళాశాల ఆస్పత్రికి సిఫారసు చేశారు.
*బంగ్లాదేశ్‌ నుంచి మలేషియాకు రోహింగ్యా శరణార్థులను తీసుకెళ్తున్న పడవ మంగళవారం బంగాళాఖాతంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. దీని గురించి సమాచారం అందుకున్న బంగ్లాదేశ్‌ కోస్ట్‌గార్డు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని 73 మందిని కాపాడారు.
*సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బీదర్ నుంచి సూర్యాపేట వెళ్తున్న బస్సులో ఓ మహిళపై ఇద్దరు యువకులు దౌర్జన్యం చేశారు. బస్సులో నుంచి దింపేసి అత్యాచారానికి ఒడిగట్టారు. జహీరాబాద్‌ మండలం పస్తాపూర్‌ దగ్గర ఇద్దరు దుండగులు పోలీసులమని చెప్పి గుట్కా ప్యాకేట్లు తరలిస్తున్నావని, తనిఖీ చేయాలంటూ సదరు మహిళను బస్సు నుంచి దింపేశారు. పస్తాపూర్ గ్రామంలోని ఏసీబీ బ్యాంక్ వెనకవైపు తీసుకెళ్లిన మహిళపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమె దగ్గరున్న గుట్కా ప్యాకేట్లతో, దుండగులు పరారయ్యారు. బస్సుతో పాటు యువకుల దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి…
*జమ్మూ కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని కిష్ట్రావర్ జిల్లా డ్రాబ్‌షల్లా వద్ద ఓ కారు అదుపుతప్పి లోయలో పడిపోయంది. ఈ ప్రమాదంలో ఘటన స్థలంలోనే ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు.
*9 నెలలుగా జీతం చెల్లించలేదనే వేదనతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చంఢియా పట్టణంలో జరిగింది.
*దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేష్‌ యాదవ్‌ కాన్వాయ్‌పై మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఎమ్మెల్యే కాన్వాయ్‌పై ఆ దుండగుడు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన నరేష్‌ యాదవ్‌ గుడికి వెళ్లివస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
*నెల్లూరులో నర్సుకు వేధింపులు… ఆమ్లేట్ వేసుకొని రాత్రి రమ్మన్న డాక్టర్ఆమ్లేట్ తీసుకొని ఆమెను మేడపైకి తన గదిలోకి రావాలని కోరాడు. అక్కడకు వెళ్లిన ఆమెను తనతో పాటు పదినిమిషాల పాటు గడపాలన్నాడు.
*ప్రేమ కోసం మతం మారినా.. ప్రియురాలి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో హెచ్ఆర్‌సీని ఆశ్రయించిన బొబ్బిలి భాస్కర్‌ అలియాస్‌ అబ్దుల్‌ హునైన్‌ ప్రేమ కోసం చావడానికైనా సిద్ధం అంటున్నాడు. కేసు దర్యాప్తు నిమిత్తం ఇవాళ మానవ హక్కుల సంఘం ఎదుట హాజరయ్యాడు.
*ఒడిశాలోని భద్రక్‌ జిల్లా బారిక్‌పూర్‌ వద్ద ఇవాళ ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. లారీ, టూరిస్ట్‌ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారందరిని భద్రక్‌ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. టూరిస్టులంతా ఉత్తరప్రదేశ్‌ నుంచి పూరీకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 55 మంది యాత్రికులు ఉన్నారు…
*చైనాలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఒకవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగగా.. వ్యాధి బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. చైనా ఆరోగ్య శాఖ అధికారుల సమాచారం మేరకు కరోనా మహమ్మారికి 1,016 మంది మృత్యువాత పడ్డారు. వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయిన వారి సంఖ్య 42, 638కి చేరింది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణుల బృందం ఒకటి మంగశవారం బీజింగ్‌ను చేరుకుని వైరస్‌ నిరోధక చర్యల్లో సాయం అందించడం మొదలుపెట్టిందని చైనా ఆరోగ్య కమిషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. వైరస్‌ కారణంగా ఒక్కరోజే 108 మంది మరణించారని, 2,478 కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపింది.
*కన్న కూతురినే గర్భవతిని చేశాడో తండ్రి. దాదాపు ఆరు నెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకున్నది.
*వేరువేరు చోట్ల ఇద్దరు వ్యక్తులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా మ్యాక్సొసైటీ ఎంఎంటీఎస్, ఈదులనాగులపల్లి రైల్వే స్టేషన్ల వద్ద చోటు చేసుకున్నాయి. నాంపల్లి రైల్వే సీఐ శ్రీనివాస్, వికారాబాద్ రైల్వే ఎస్ఐ వెంకట్రెడ్డిలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
*ఆర్థిక ఇబ్బందులతో.. జీవతపై విరక్తి చెంది దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ చావుకు ఎవ రూ కారణం కాదని సూసైడ్ నోట్ రాసి, ఒకే ఫ్యానుకు ఉరివేసుకుని తనువుచాలించారు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుం ది.
*అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్ తనయుడు శుబాన్సో పుల్(20) బ్రిటన్లో అనుమానాస్పద స్థితిలో మృత్యువాతపడ్డారు. ససెక్స్లోని బ్రిఘ్టన్లో తన అపార్ట్మెంట్లో ఆయన శవమై కనిపించారు. శుబాన్సో.. కలిఖో మొదటి భార్య కుమారుడు. ఆరు నెలల క్రితమే ఆయన ససెక్స్ విశ్వవిద్యాలయంలో చేరారు. 2016 ఆగస్టు 9న కలిఖో పుల్ ఆత్మహత్య చేసుకున్నారు.
*ఓ లారీ అతివేగం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తిలోని పెద్దచెరువుకట్ట సమీపంలో మంగళవారం జరిగింది. ఎల్కతుర్తి నుంచి హన్మకొండ వైపు ప్రయాణికులతో వస్తున్న ఆటోను హన్మకొండ నుంచి కరీంనగర్ వైపు అతి వేగంగా వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఎల్కతుర్తి మండలం బావుపేటకు చెందిన మర్రి శ్రీకాంత్(20), హసన్పర్తికి చెందిన అటికేటి గట్టమ్మ(50) అక్కడికక్కడే మరణించారు.
*దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆప్ తరఫున మెహరోలి నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే నరేశ్యాదవ్ వాహనశ్రేణిపై మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఎమ్మెల్యే తన సహచరులతో ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ఆగంతకులు ఆరు, ఏడు బుల్లెట్లు వినియోగించినట్లు పోలీసులు తెలిపారు. రెండు ముఠాల మధ్య గొడవలే ఈ కాల్పులకు కారణమని వారు భావిస్తున్నారు.
* ఓ శరణాలయంలో అనేక మంది బాలికలపై లైంగికంగా, శారీరకంగా దాడులకు పాల్పడిన బ్రజేష్ ఠాకుర్ సహా 12 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ దిల్లీలోని అదనపు సెషన్స్ జడ్జి సౌరభ్ కుల్శ్రేష్ఠ మంగళవారం తీర్పు వెలువరించారు. తీర్పును ఎగువ న్యాయస్థానంలో సవాల్ చేస్తామని కొందరు నిందితుల తరఫున వాదించిన న్యాయవాది తెలిపారు.
*తేనెటీగల దాడిలో ఓ వ్యక్తి మరణించారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. సంస్థాన్ నారాయణపురం మండలం చిమిర్యాల గ్రామానికి చెందిన చెర్కు జంగయ్య(48) వృత్తి రీత్యా డ్రైవర్. ఆయన ఇంటి ఎదుట వేప చెట్టుకు తేనె పట్టు ఉంది. సోమవారం వీచిన ఈదురు గాలులకు తేనెటీగలు చెల్లాచెదురై జంగయ్యపై దాడి చేశాయి. సొమ్మసిల్లి పడిపోయిన ఆయన్ను హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
*సపోటా గింజ గొంతులో ఇరుక్కుని ఓబాలుడు మృతి చెందాడు. జగిత్యాల జిల్లా మల్లాపూర్కు చెందిన అనుపురం సుజాత-లింగాగౌడ్ దంపతులకు ఇద్దరు కుమారులు. లింగాగౌడ్ సౌదీలో పనిచేస్తున్నాడు. సుజాత బీడీ కార్మికురాలు. ఈమె సోమవారం సాయంత్రం సపోటా పండ్లు కొని ఇంట్లో ఉంచింది. రెండో కుమారుడు శివకుమార్(4) సపోటా తింటుండగా గొంతులో గింజ ఇరుక్కుంది. శ్వాస ఆడక ఇబ్బంది పడుతున్న బాలుడిని కుటుంబీకులు మెట్పల్లి ప్రాంతీయాసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శివకుమార్ కన్నుమూశాడు.
*హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం పరిధి బీఎన్ రెడ్డి నగర్లో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు వెంకట్ రెడ్డి, నిశితగా గుర్తించారు. తమ చావుకు ఎవరూ బాధ్యులు కారని ఆత్మహత్య లేఖలో దంపతులు వెల్లడించారు. జీవించడం ఇష్టం లేకే చనిపోవడానికి నిర్ణయించుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
* వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తిలో ఆటో, లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. హసన్పర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరుగురు ప్రయాణికులతో హన్మకొండ వైపు వెళ్తున్న ఆటోను, వరంగల్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ హసన్పర్తి ఎస్బీఐ సమీపంలో ఢీకొంది. ఈ ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం బావుపేటకు చెందిన మర్రి శ్రీకాంత్(20), గట్టమ్మ అనే మహిళ ఘటనా స్థలంలోనే మృతి చెందింది.
*మూడు సంవత్సరాల చిన్నారి హత్యాచారానికి గురయిన దుర్ఘటన ఉత్తర్ ప్రదేశ్లో జరిగింది. ఈ ఘటన సీతాపూర్లోని మహోలీ ప్రాంతంలో సోమవారం చోటుచేసుకుంది. చిన్నారి మృతదేహం పొరుగింటిలోని ఒక బస్తాలో లభించింది. కాగా మైనర్ బాలికను అత్యాచారం చేసి…అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
*విద్యార్థినులు.. యువతులు.. మహిళల చరవాణులకు అశ్లీల వీడియోలు పంపుతూ అసభ్యంగా మాట్లాడుతున్న సైబర్ నేరస్థుడు కందగళ్ల భాస్కర్ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఐదు నెలల కిందట హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్కు వాట్సాప్ ద్వారా వందకుపైగా అశ్లీల వీడియోలు పంపించడం, అర్ధరాత్రి అపరాత్రి తేడాలేకుండా ఫోన్లు చేస్తుండటంతో ఆమె భరించలేక సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
*పేటీఎం కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నాం.. కేవైసీని అప్డేట్ చేసుకోవాలంటూ ఇద్దరిని ముగ్గులోకి దింపి రూ.2.75 లక్షలు కాజేశారు సైబర్ కేటుగాళ్లు. బాధితులు రాచకొండ సైబర్క్రైం పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగు చూసింది. న్యూనాగోల్కు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి(61)కి ఈ నెల 10వ తేదీన ‘ఎండీ అలర్ట్స్’ నుంచి ఎస్ఎంఎస్ వచ్చింది.
* నెల్లూరు జిల్లా ఉదయగిరి గవర్నమెంట్‌ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సులను వేధిస్తున్న గవర్నమెంట్‌ డాక్టర్‌ కు దేహశుద్ధి చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యులు. స్టాఫ్ నర్సులను లైంగికంగా వేదిస్తున్న డాక్టర్‌ రవీంద్రనాధ్ ఠాగూర్‌పై బాధితురాలి కుటుంబ సభ్యులు దాడి చేశారు.