Food

గడ్డి రసం తాగితే బరువు తగ్గుతారంట

Telugu Food And Diet News-Grass Juice For Weight Loss

అధికంగా బరువు ఉన్నవారు తగ్గాలనుకునే ఆలోచనలో ఉన్నారా? అయితే ఉదయాన్నే పరిగడుపున గరిక జ్యూస్ తీసుకుంటే బరువు సులభంగా తగ్గుతారు. గరిక జ్యూస్ తాగిన రెండు గంటల తర్వాత ఆహారాన్ని తీసుకోవాలి. ఈ జ్యూస్ సేవించడం ద్వారా చురుకుదనం ఏర్పడుతుంది. దీంతో రక్తహీనత నుంచి బయట పడవచ్చు. రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది.ఉదర రుగ్మతలు తొలిగిపోతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో చక్కెర స్థాయిలను ఈ జ్యూస్ నియంత్రిస్తుంది.జలుబు, సైనస్, అస్తమా వ్యాధులకు ఇది చెక్ పెడుతుంది. నరాల బలహీనత, చర్మ వ్యాధులను తొలిగిస్తుంది. జీర్ణసమస్యలు ఉన్నవారు బ్రష్ చేసిన తర్వాత గరిక రసం తీసుకుంటే అజీర్తి సమస్యను దూరం చేస్తుంది.ఇది క్యాన్సర్ కారకాలను నశింపజేస్తుంది. నిద్రలేమిని దూరం చేస్తుంది.