Movies

నాన్‌సెన్స్

Manju Warrier Responds To Stupid Gossips

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా ‘ఖైదీ’ ఫేం లోకేశ్‌ కనకరాజు దర్శకత్వంలో ఓ సినిమాలో రానుందంటూ ఇటీవల కొంతకాలం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో రజనీకాంత్‌ సరసన ‘అసురన్‌’ ఫేం మంజు వారియర్‌ నటించనున్నారంటూ సోషల్‌మీడియా కోడై కూస్తోంది. ఈ నేపథ్యంలో నటి మంజు వారియర్‌.. తన గురించి వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. రజనీకాంత్‌ సినిమా గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తమని ఆమె తేల్చి చెప్పారు. ‘రజనీకాంత్‌ సినిమాలో హీరోయిన్‌గా నేను నటించనున్నానంటూ గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా విషయంపై ఇప్పటివరకూ నన్ను ఎవరూ అధికారికంగా సంప్రదించలేదు. ఇదో అవాస్తవ వార్త. సోషల్‌మీడియాలో ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో నాకర్థం కావడం లేదు’ అని మంజు తెలిపారు.