*** కావల్సినవి:
అన్నం- రెండు కప్పులు, నవ్వులు- నాలుగు చెంచాలు, ఎండుమిర్చి- ఐదు, ఇంగువ- చిటికెడు, సెనగపప్పు- చెంచా, నువ్వుల నూనె- ఐదు చెంచాలు, ఉప్పు- తగినంత.
*** తయారీ విధానం:
ముందుగా బాణలిని పొయ్యి మీద పెట్టి నూనె లేకుండా నువ్వుల్ని వేయించి తీసి పెట్టుకోవాలి. అదే బాణలిలో మరో చెంచా నూనె వేడిచేసి ఎండుమిర్చి, సెనగపప్పు, ఇంగువ వేయించి దింపేయాలి. ఈ తాలింపులో తగినంత ఉప్పు, వేయించిన నువ్వులు కలిపి మరీ మెత్తగా కాకుండా పొడిలా చేసుకుని తీసుకోవాలి. బాణలిలో మిగిలిన నూనె వేడిచేసి అన్నం, చేసుకున్న నువ్వులపొడి వేసుకుని రెండింటినీ బాగా కలిపితే చాలు.