NRI-NRT

చికాగోలో ఘనంగా సంక్రాంతి

TAGC Sankranthi 2020 Celebrated In Chicago

చికాగో మహానగర తెలుగు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి, గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చికాగోలోని హిందూ టెంపుల్‌ ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1న ఏర్పాటు చేశారు. టీఏజీసీ సంఘం అధ్యక్షులు ప్రవీణ్‌ వేములపల్లి, క్రాంతి వేములపల్లి, ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌, వెంకట్‌ గూనుగంటి, ముఖ్య కార్యదర్శి అంజిరెడ్డి కందిమళ్ల ఇతర ప్రముఖులు గణపతి ప్రార్థన, జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు రైతులు ప్రాముఖ్యతను, వారి కష్టాలను తెలుగు సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ విశిష్టతను, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను, పర్యావరణ ప్రాముఖ్యతను చాటుతూ వివిధ నృత్య ప్రదర్శలతో వివరించారు.