Health

అబార్షన్ తర్వాత తీసుకోవల్సిన జాగ్రత్తలు ఇవి

Ladies Health News In Telugu-Precautionary Measures After Abortion

కొంతమంది మహిళలకు అనేక కారణాలతో అబార్షన్ అవుతుంటుంది. ఇది నిజంగా దురదృష్టకర సంఘటన. దీని తర్వాత స్త్రీలు చాలా బలహీనంగా మారతారు. కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. అలాంటి సమయంలోనూ ఆరోగ్యం కుదుట పడాలంటే కొన్ని ఆహారపదార్థాలను మీ డైట్‌లో చేర్చుకోవాలి.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

అబార్షన్ తర్వాత..

అబార్షన్ అనంతరం కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మహిళల ఆరోగ్యం కాస్తా కుదుటపడుతుంది. ఈ సమయంలో అన్ని విషయాల్లోనూ తగినన్నీ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఆహారం విషయంలో.. ఎందుకంటే.. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల కోల్పోయిన శక్తి తిరిగి వస్తుంది.. అదే విధంగా ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది.

గుడ్లు, ఛీజ్..

ఈ సమయంలో శరీరానికి అధిక పోషణ కావాలి కాబట్టి గుడ్లు, ఛీజ్, పాల పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. దీని వల్ల శరీరం తిరిగి శక్తిని అందుకుంటుంది. కాబట్టి రెగ్యులర్‌గా ఉడకబెట్టిన గుడ్లు, ఛీజ్, పాలు, పదార్థాలను చేర్చుకోండి.

​పసుపు..

యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉండే పసుపుని అబార్షన్ తర్వాత అధికంగా తీసుకోవాలి. దీని వల్ల స్త్రీ శరీరంలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్, వాపులు, నొప్పులు రాకుండా ఉంటాయి. ఇందుకోసం గోరువెచ్చని పాలల్లో పసుపు కలుపుకుని తాగండి. ఇలా చేస్తుంటే కొన్ని రోజుల్లోనే ఉపశమనం కలుగుతుంది.

​కుంకుమ పువ్వు…

కుంకుమ పువ్వు ఎక్కువగా గర్భ సమయంలో తీసుకుంటారు. కానీ, దీనిని అబార్షన్ అనంతరం కూడా తీసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే ఇందులో ఎక్కువగా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. దీనిని పాలల్లో కలుపుకుని రోజూ తాగడం వల్ల స్త్రీలకు కాస్తా శక్తి వస్తుంది. కాబట్టి అబార్షన్ జరిగిన కొన్ని రోజుల వరకూ కుంకుమ పువ్వు కలిపిన పాలను తాగాలని సూచిస్తున్నారు నిపుణులు.

​ఐరన్ సప్లిమెంట్స్..

అదే విధంగా గర్భస్రావ సమయంలో రక్తం పోతుంది. ఈ కారణంగా శరీరంలో బ్లడ్ లెవల్స్ తగ్గుతాయి. దీని నుంచి మీ శరీరం కోలుకోవాలంటే ఐరన్ డోస్ పెరిగేలా చూసుకోవాలి. దీని వల్ల గర్భాశయం, వాటి గోడలు శుభ్రం అవుతాయి. కాబట్టి రెగ్యులర్‌గా ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి.

​ఐరన్, కాల్షియం ఫుడ్..

ఎక్కువగా ఐరన్, కాల్షియం ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. దీని వల్ల మీ గర్భాశయం త్వరగా కోలుకుంటుంది. ఎర్రటి రాస్ బెర్రీస్, చెర్రీస్, పండ్లు తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల మీరు ఒత్తిడి వంటి సమస్యలకు దూరంగా ఉంటారు. అందుకే ఎక్కువగా వీటిని తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

​ఫ్లాక్స్ సీడ్స్…

అబార్షన్ జరిగిన తర్వాత తీసుకోవాల్సిన ఫుడ్‌లో ఫ్లాక్స్ సీడ్స్ ఒకటి.. అంటే అవిసెలు.. వీటిని తీసుకోవడం వల్ల యుట్రస్‌కి మేలు జరుగుతుంది. అదే విధంగా రోగ నిరోధకత కూడా పెరుగుతుంది. కాబట్టి వీటిని కూడా తీసుకోవడం మంచిది.

​నీటిని ఎక్కువగా తీసుకోండి..

ఏ సమయంలోనైనా నీరు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ఎక్కువగా నీరు తీసుకుంటుండి.. దీని వల్ల గర్భాశయం కూడా మొత్తం శుభ్రం అవుతుంది. మీ శరీరం డీ హైడ్రేట్‌గా ఉంటుంది.