కెనడాలోని ఆల్బర్టా రాష్ట్రంలోని కాల్గరి నగరంలో అనగదత్త సొసైటీ ఆఫ్ కాల్గరి ఆధ్వర్యంలో ఏప్రిల్ 5 నుంచి 15 వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా శ్రీలలితా సహస్రనామ కోటి కుంకుమార్చన, రుద్రహోమాన్ని అత్యంత భక్తి శ్రద్ధల నడుమ జరిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకు గాను లలిత, శైలేష్, కమిటీ సభ్యులు సహాయ సహకారాలు అందించారు. అంతేకాకుండా 11 రోజులపాటు నిర్వహించిన ఈ వసంతోత్సవాల్లో వికారినామ తెలుగు సంవత్సరం, శ్రీరామనవమి, గడిపడ్వా వేడుకలను కూడా నిర్వహించారు. ప్రతిరోజు లలితా సహస్రనామ హోమం, రుద్ర హోమం నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా చివరిరోజైన 11వ రోజు శివ కామేశ్వరి, శ్రీలలితా త్రిపురసుందరి అమ్మవార్ల కల్యాణం రమణీయంగా సాగింది. ఈ వేడుకలకు 300లకుపైగా తెలుగు కుటుంబాలు హాజరయ్యారు. ఈ కార్యక్రమాలను నిర్విఘ్నంగా నిర్వహించేందుకు సహాయసహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులు ప్రశంసా పత్రాలు, మెమొంటోలు అందజేశారు. ఈ సందర్భంగా 11 రోజుల పాటు నిర్వహించిన వివిధ రకాల హోమాలు, యజ్ఞాలు, కుంకుమార్చల ప్రాముఖ్యతను ప్రధాన అర్చకులు పండిట్ రాజ్‌కుమార్, పండిట్ జయరామన్ భక్తులకు తెలియజేశారు.
కాల్గరిలో వసంత నవరాత్రి ఉత్సవం
Related tags :