DailyDose

తెలంగాణ మంత్రి నుండి మహిళకు ముప్పు-నేరవార్తలు

Minister Mallareddy Land Scam Maya-Telugu Crime News Roundup Today

*టీఆర్ఎస్ నేత తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చి పడింది. తన భూమిని మంత్రి గారు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని దానిని అడ్డుకోవడమే నేరమన్నట్లుగా తనకు మంత్రి నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఓ మహిళా నేరుగా రాష్ట్ర మనవ హక్కుల కమిషన్ నే ఆశ్రయించింది. అంతేకాకుండా ఆమె మంత్రి మల్లారెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేసారు.
* వికారాబాద్‌ జిల్లాలోని పరిగి పోలీస్‌స్టేషన్‌లో ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం చేశాడు. యువతి కిడ్నాప్‌ కేసులో హరినాథ్‌ అనే యువకుడిని పోలీసులు ఈ ఉదయం అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తీసుకువచ్చారు. కాగా యువకుడు పోలీస్‌స్టేషన్‌లోనే మణికట్టు వద్ద కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో పోలీసులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
* అక్రమ ఆయుధాల కేసులో ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ ఇద్దరిని అరెస్ట్‌ చేసింది. పట్టుబడ్డ వ్యక్తులు ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాల్లో అక్రమంగా ఆయుధాలను సరఫరా చేస్తున్నట్లుగా సమాచారం. నిందితుల వద్ద నుంచి 22 ఆధునాతన ఆయుధాలు, 32 బోర్‌ పిస్టల్స్‌, 10 లైవ్‌ కాట్రిడ్జెస్‌ ను స్వాధీనం చేసుకున్నారు
* భువనగిరిలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 16న పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న స్వామి, ఉమ అనే ఈ జంట రెండు రోజుల్లోనే ఆత్మహత్యకు పాల్పడింది.
* ఫోటో తీయించుకునేందుకు స్టూడియోకి వెళ్లిన మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు షాపు యజమాని సలీం. ఈ సంఘటన నేరేడ్ మెట్, సైనిక్ పురి లో సోమవారం జరిగింది. నిన్న ఉదయం పాస్ ఫొటో కోసం ఓ మైనర్ బాలిక స్థానిక RS డిజిటల్ ఫోటో స్టూడియోకి వెళ్లింది. ఫొటో తీసే క్రమంలో డోర్ క్లోజ్ చేసి ఆమెపై చేతులు వేసిన సలీం.. తర్వాత అత్యాచారం చేసే ప్రయతం చేసాడు. బాలిక అరుచుకుంటూ బయటకి పరుగులు తీసి స్థానికులకు సలీం ప్రవర్తన గురించి తెలిపింది.
* సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో ఇటీవల గంగరాజు అనే వ్యక్తిపై కాల్పుల జరిపిన సదానందం వాడిన తుపాకులు పోలీసులవేనని విచారణలో తేలింది.
* సంగారెడ్డి జిల్లాలోని గుమ్మిడిదల మండలం అన్నారం గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామ శివారులోని కొత్తకుంట చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు.
*పంజాబ్ లోని లుధియానాలో భారీ బ్యాంకు దోపిడీ జరిగింది. నలుగురు దుండగులు తుపాకితో బెదిరించి ముప్పై కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్ళారు. లుధియానాలోని ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ బ్యాంకులో సోమవారం ఈ ఘటన జరిగింది. దుండగులు దోచుకెళ్ళిన బంగారం విలువ సుమారు రూ.పన్నెండు కోట్లుగా అంచనా వేస్తున్నారు.
* రిమాండ్‌లో ఉన్న ఓ ఖైదీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన భద్రాచలం సబ్‌ జైల్‌లో చోటుచేసుకుంది. వివరాలు చూసినైట్లెతే.. ప్రవీణ్‌కుమార్‌ అనే వ్యక్తి భద్రాచలం సబ్‌జైల్‌లో రిమాండ్‌ఖైదీగా ఉన్నాడు. కాగా, ఉన్నట్టుండి ఒక్కసారిగా అతను రేకుతో చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన పోలీసులు.. సదరు ఖైదీని ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావమైన ఖైదీకి.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
* ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్తరు క్యాన్లలో అక్రమంగా తరలిస్తున్న విదేశీ కరెన్సీని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది పట్టుకున్నారు. ఇక్కడి టెర్మినల్ 3 చెకిన్‌ కౌంటర్‌ వద్ద ఓ వ్యక్తి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో అతడిని అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దిల్లీకి చెందిన మొహమ్మద్‌ ఆర్షి (40) అనే ఈ వ్యక్తి ఎయిరిండియా విమానంలో దుబాయికి వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. అతడి బ్యాగులను ఎక్స్‌-రే స్కానర్‌లో అధికారులు తనిఖీ చేశారు. కొన్ని గుడ్డ సంచుల్లో అత్తరు క్యాన్లు కనిపించాయి. వాటిల్లో చుట్టలుగా చుట్టి, దాచి ఉంచిన కువైట్‌ దీనార్లు, సౌదీ రియాళ్లు బయటపడ్డాయి. వాటి మొత్తం విలువ రూ.42.35 లక్షలని అధికారులు వెల్లడించారు. వీటికి సంబంధించి సరైన పత్రాలు ఏవీ అతడు చూపలేకపోయాడు. ఆ మొత్తాన్ని దుబాయిలోని అపరిచిత వ్యక్తులకు అప్పగించమన్నారని చెప్పాడు. దీంతో నిందితుడిని కస్టమ్స్‌ అధికారులకు అప్పగించారు.
* తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నల్లతాచుపాము కలకలం రేపింది. కోరుకొండ రోడ్డులోని రత్నంపేట పశువుల పాకలోకి చొరబడింది. గమనించిన స్థానికులు స్నేక్‌ హెల్పర్‌ను సంప్రదించారు. స్నేక్‌ హెల్పర్‌ ఈశ్వర్‌ పామును చాకచక్యంగా పట్టుకున్నాడు. 7అడుగుల పొడవు, 5కేజీల బరువు ఉన్న ఈ పాము గోధుమ తాచు రకానికి చెందిందని ఈశ్వర్‌ తెలిపాడు. అధికారుల అనుమతితో పామును అడవిలో వదలనున్నట్లు చెప్పారు.
*గతేడాది పుల్వామా దాడ్డి అనంతరం అజ్ఞాతంలోకి వెళ్ళిన ఉగ్రవాద సమస్త జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ కు సంబందించిన కెలక సమాచ్గారాన్ని ఇంటలిజెన్స్ సేకరించింది. పాకిస్తాన్, బహవల్పూర్ లో బాంబులు కూడా నాశనం చేయలేని ఐ ఇంట్లో దాక్కున్నాడని నిఘావర్గాలు గుర్తించాయి.
* ప్రముఖ బెంగాలీ నటుడు, తృణమూల్‌ కాంగ్రెస్‌ మాజీ ఎంపీ తపస్‌ పాల్‌ మంగళవారం హఠాత్తుగా కన్నుమూశారు. ఇటీవల మహారాష్ట్ర వెళ్లిన ఆయన కోల్‌కతా తిరిగి వస్తుండగా ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కుప్పకూలారు. చికిత్స పొందుతూ నేడు తెల్లవారుజామున మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు
* గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై కారు ప్రమాద ఘటనను మరువక ముందే.. మితిమీరిన వేగంతో హైదరాబాద్‌లో వంతెనపై నుంచి కారు కిందపడిన ఘటన మరో ప్రాంతంలో చోటు చేసుకుంది
*పంజాబ్‌లోని లుధియానాలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఐఐఎఫ్‌ఎల్‌ రుణ సంస్థలోకి చొరబడి సిబ్బందిని బెదిరించి 20 నిమిషాల వ్యవధిలో 25 కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు. సినీఫక్కీలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం 10.15 సమయంలో లుధియానాలోని ఐఐఎఫ్‌ఎల్‌ రుణ సంస్థ కార్యాలయంలోకి ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు వచ్చారు. బయట మరొకరిని కారులో సిద్ధంగా ఉంచారు. సిబ్బందిని బెదిరించి తాళాలు తీసుకున్న దుండగులు వారిని తాళ్లతో బంధించి బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన జరిగిన సమయంలో రుణ సంస్థకు చెందిన రక్షణ సిబ్బంది అక్కడ లేరని పోలీసులు చెప్పారు. 20 నిమిషాల వ్యవధిలో ఇదంతా జరిగిపోయిందని.. సుమారు 25 నుంచి 30 కిలోల ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారని పోలీసులు పేర్కొన్నారు.
*పాఠశాలలో చదువుతున్న కుమార్తెకు మధ్యాహ్న భోజనం ఇచ్చి బయలుదేరిన ఓ తండ్రి, సోదరితో కబుర్లు చెప్పి వాటిని నెమరేసుకుంటున్న ఓ సోదరుడు ప్రమాదంలో చనిపోయారు. ఈ విషాద ఘటన సోమవారం కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది.
*పరీక్షల్లో తప్పాననే మనస్తాపంతో ఓ బీటెక్‌ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతను ముఖానికి ప్లాస్టిక్‌ సంచి చుట్టుకొని.. నోట్లో పైపుల ద్వారా ఆక్సిజన్‌ వదులుకొని సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు.
*పంజాబ్‌లోని లూధియానాలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. భారీ దోపిడీకి పాల్పడ్డారు. సినీ ఫక్కీలో గోల్డ్‌ లోన్‌ సంస్థలోకి చొరబడిన ఐదుగురు దుండగులు 25 కిలోలకు పైగా ఆభరణాలు దోచుకెళ్లారు
*ఆఫ్రికాలోని బూర్కినాఫాసోలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. క్రిస్టియన్లను లక్ష్యంగా చేసుకొని చర్చి వద్ద జరిపిన కాల్పుల్లో చర్చి పాస్టర్‌ సహా 24 మంది మృతి చెందారు. ఈ ఘటనలో 18 మందికి గాయాలయ్యాయి.
*గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహితపై ముగ్గురు యువకులు సామూహికంగా అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత మహిళ సోమవారం గ్రామీణ మంగళగిరి ఠాణాలో ఫిర్యాదు చేయడంతో విషయం బయటకొచ్చింది.
*మంటల్లో చిక్కుకున్న తన భార్యను రక్షించబోయి మృత్యుఒడికి చేరిన ఘటన అబుదాబీలో జరిగింది. కేరళకు చెందిన అనిల్‌ నైనన్‌(32)తన భార్య నీనూ, కుమారుడు(4)తో కలిసి అబుదాబీలో ఉంటున్నారు. అయితే గత వారం, రాత్రి సమయంలో వీరు ఉంటున్న అపార్టుమెంట్‌ కారిడార్‌లో మంటలు చెలరేగాయి.
*గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై కారు ప్రమాద ఘటనను మరువక ముందే.. మితిమీరిన వేగంతో హైదరాబాద్‌లో వంతెనపై నుంచి కారు కిందపడిన ఘటన మరో ప్రాంతంలో చోటు చేసుకుంది. ఎర్రగడ్డ-భరత్‌నగర్‌ వంతెనపై జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
*ప్రయాణ ప్రాంగణంలో నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. అందులో ప్రయాణికులు కూడా ఉన్నారు. తీరా మార్గమధ్యంలో లారీకి ఢీకొట్టి, అక్కడే వదిలేసి పరారైన ఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరులో చోటుచేసుకుంది
*ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన యువకుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.4వేల జరిమాన విధిస్తూ నాంపల్లి మెట్రోపాలిటిన్‌ జడ్జి కె.సునీత సోమవారం తీర్పు చెప్పారు. గోల్కొండ పోలీసుల కథనం ప్రకారం… గోల్కొండ నయాఖిలాకు చెందిన అజ్మత్‌ఖాన్‌(26) వెల్డింగ్‌ పనిచేస్తున్నాడు. 2018 జులై 29న ఇతడు 5ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు.
* బేగంపేట పీఎస్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కృశే గార్డెన్ అపార్టుమెంట్ సమీపంలో రక్తపు మడుగులో ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి..100 కి కాల్ చేసి సమాచారమందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహం ఎవరిదో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
*అక్రమంగా భారత్లోకి ప్రవేశించిన 9 మంది బంగ్లాదేశీయుల (హిందువులు)ను త్రిపుర పోలీసులు అరెస్ట్ చేశారు.
*పాల్వంచ బస్టాండ్ లో గుగులోత్ శిరీష అనే మహిళ తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి, తాను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బస్టాండ్ సిబ్బంది, స్థానికులు వెంటనే వారిని కొత్తగూడెంలోని ఆస్పత్రికి తరలించారు. శిరీష చిన్నకుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
*హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఓ వ్యాపారి ఇంట్లో డిసెంబరు 8న రూ. కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను బిహారీ ముఠా దొంగిలించింది. చోరీ చేశాక ముఠా సభ్యులు బిహార్లోని మధుబని ప్రాంతానికి పారిపోయారు.
*బంజారాహిల్స్లోని ఓ వ్యాపారి ఇంట్లో డిసెంబరు 8న రూ. కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను బిహారీ ముఠా దొంగిలించింది. చోరీ చేశాక ముఠా సభ్యులు బిహార్లోని మధుబని ప్రాంతానికి పారిపోయారు. బంగారు నగలను అమ్మి సొమ్ము చేసుకున్నారు. వజ్రాల నగలు మాత్రం మూటగట్టి ఓ ఇంట్లోని పశువుల కొట్టంలోని భూమిలో పాతిపెట్టారు. మరికొంత గోడలో దాచిపెట్టారు. ఆరుగురు నిందితుల్లో నలుగురిని అరెస్టు చేసిన పోలీసుల బృందం సొత్తును చాకచక్యంగా స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ నగర కమిషనర్ అంజనీకుమార్ బుధవారం హైదరాబాద్లో వెల్లడించారు.
*అనారోగ్యంతో తమ్ముడు మృతి చెందితే… ఆ విషాదాన్ని తట్టుకోలేక కొన్ని గంటల వ్యవధిలో ఆయన అన్న కూడా అసువులు బాసిన సంఘటన ఇది. మహబూబాబాద్ గ్రామీణ మండలంలోని సింగారం గ్రామ సర్పంచి గంగుల తేజమ్మ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి స్వయానా అక్క. ఆమె భర్త గంగుల రామలింగయ్య (75). ఆయన సోదరుడు గంగుల నారాయణ (60) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. తమ్ముడి మృతిని తట్టుకోలేక విలపించిన రామలింగయ్య కూడా ఉదయం 11 గంటలకు తనువు చాలించారు. ఒకే రోజు సోదరులద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కడియం శ్రీహరి గ్రామానికి వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు
*డంపింగ్ యార్డు వద్ద చిత్తు కాగితాలు ఏరుకుని బతికే ఆ తల్లిదండ్రుల ఆశలను ఓ వాహనం చిదిమేసింది. ఏడాది వయసున్న వారి కుమారుడిని బలి తీసుకుంది. కూకట్పల్లి ఠాణా పరిధిలో బుధవారం జరిగిన ఈ దుర్ఘటనపై బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటకకు చెందిన శ్రీకాంత్, శ్రీకన్య దంపతులు వలస వచ్చి మెదక్ జిల్లాలోని నర్సాపూర్లో ఉంటున్నారు. పాత దుస్తులు, చిత్తు కాగితాలు, ఇతర వస్తువులు ఏరుకుని జీవనం సాగిస్తుంటారు. వారు బుధవారం ఉదయం మూసాపేట పరిధిలోని కైత్లాపూర్ డంపింగ్ యార్డు వద్ద పాత దుస్తులను ఏరుకుంటున్న సమయంలో వారి కుమారుడు సాయి (1) అక్కడే ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో చెత్తతో వచ్చిన జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటో డ్రైవర్ తాళ్లపళ్లి కిషన్ అజాగ్రత్తగా నడిపి చిన్నారి సాయిని ఢీకొట్టాడు. తీవ్ర గాయాలైన బాబును ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు డ్రైవర్ను ఆదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశా
*ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసుతో పాటు పలు ఘటనల్లో నిందితునిగా ఉన్న మావోయిస్టు జిప్రో హబికా పోలీసుల వద్ద లొంగిపోయినట్లు ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి ఎస్పీ హృషికేష్ డి.ఖిలారి తెలిపారు
*దుబాయ్ నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న రూ.కోటి విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, ముంబయి విమానాశ్రయాల్లో అక్రమ బంగారం రవాణాను గుట్టు రట్టు చేశారు. దుబాయ్ నుంచి విమానంలో హైదరాబాద్ వచ్చిన ముగ్గురు ప్రయాణికులను తనిఖీ చేయగా సుత్తిలో దాచిన 931 గ్రాముల బంగారం దొరికింది. ముంబయి విమానాశ్రయంలోనూ దుబాయ్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడిని తనిఖీ చేసి అతని వద్ద కూడా సుత్తిలో దాచిన 931 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
*ఖాతాదారులకు చెందిన సొమ్ము కొల్లగొట్టిన నేరంపై సబ్ పోస్టుమాస్టర్కు ఐదేళ్ళ కఠిన కారాగార శిక్ష విధిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని లక్ష్మీదేవిపల్లి తపాలా కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో (2006-2009) సబ్ పోస్టుమాస్టర్ శ్రీధర శ్రీనివాసు.. ఖాతాదారులకు చెందిన సంతకాలను ఫోర్జరీ చేసి రూ.45,32,839 కొల్లగొట్టాడు. దీనిపై 2010 మార్చి 30వ తేదీన సీబీఐ కేసు నమోదు చేసింది. అనంతరం విచారణ జరిపిన న్యాయస్థానం ఐపీసీ 409, 420, 468, 471 చట్టాల కింద ఒక్కో నేరానికి మూడేళ్ళ జైలు శిక్ష.. అవినీతి నిరోదక చట్టం సెక్షన్ 13(1), 13(2)ల కింద శ్రీనివాసుకు ఐదేళ్ళ కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది.
*ప్రేమికురాలు ఆత్మహత్య చేసుకుందన్న బాధతో ప్రేమికుడూ ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖ జిల్లా యలమంచిలి ప్రాంతంలోని నెహ్రూనగర్కు చెందిన ఈరిగిల వెంకటేష్ (23), విశాఖలోని గోపాలపట్నంకు చెందిన యువతి(19) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తమ పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించరేమోననే వారు చర్చించుకొనే వారు. మంగళవారం రాత్రి కూడా వెంకటేష్తో మాట్లాడిన యువతి తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఫోన్ పెట్టేసింది. కంగారుపడిన వెంకటేష్ యువతి సోదరికి ఫోన్ చేసి చెప్పాడు. అయితే అప్పటికే ఆమె ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన అనంతరం నగరంలోని తన సోదరి ఇంటికి వచ్చిన వెంకటేష్.. బుధవారం ఉదయం చెట్టుకు ఉరివేసుకున్నాడు. తాను లేనిదే నేను ఉండలేనని ఆత్మహత్య చేసుకునే ముందు వెంకటేష్ తన సోదరుడికి చెప్పినట్లు తెలిసింది.
*వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను మోసం చేస్తున్నాడన్న అనుమానంతో నిద్రిస్తున్న భర్తపై ఓ భార్య మరుగుతున్న నూనె పోసింది. ఇటీవల బెంగళూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… నగరంలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న మంజునాథ్ (40) కుటుంబంతో కలిసి యశ్వంత్పూర్లోని మోహన్కుమార్ నగర్లో నివసిస్తున్నారు. పద్మతో 9 ఏళ్ల క్రితమే వివాహం కాగా.. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో మంజునాథ్కు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందన్న విషయంలో ఈ జంట మధ్య తరచూ గొడవ జరుగుతుండేది.
*విదేశీ కరెన్సీని అక్రమంగా తరలిస్తూ దిల్లీ నుంచి ఎయిరిండియా విమానంలో దుబాయ్ వెళ్లేందుకు యత్నించిన మురాద్ ఆలం అనే వ్యక్తిని ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు. వేరుశెనక్కాయలు, బిస్కెట్లు, ఇతర తినుబండారాల్లో విదేశీ కరెన్సీని పెట్టి అక్రమంగా అమెరికా, దుబాయ్ తీసుకెళ్లేందుకు నిందితుడు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న వాటిలో 2లక్షలకు పైగా సౌదీ రియాల్, 1500 ఖతర్ రియాల్, 1200 కువైట్ దినార్ ఉన్నాయి. 300 ఒమన్ రియాల్, 1800 యూరోలను కూడా ఇదే విధంగా మురాద్ తరలించేందుకు యత్నించాడని పోలీసులు తెలిపారు.
*ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫిరోజాబాద్లోని నాగ్లాఖాంగార్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి ప్రైవేట్ బస్సును లారీ వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. దాదాపు 31 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.