Kids

పరీక్షలకు భయపడకండి

Telugu Kids News-Throw Away Exam Fear With These Tips

పరీక్షల సమయం సమీపిస్తోంది. ఇప్పటికే పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ తదితర పరీక్షల తేదీలను ప్రకటించారు. ఏ విద్యార్థిని పలకరించినా వారిలో ఒత్తిడి కనిపిస్తూనే ఉంది. ఇప్పటికే జేఈఈ మెయిన్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ తరుణంలో విద్యార్థులకు ర్యాంకులు, మార్కులు తప్ప వేరే ధ్యాసే ఉండటం లేదు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ దశలో సాధారణ విద్యార్థులు సైతం పోరాట యోధులుగా మారాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ స్వీయ రచన ఎగ్జామ్‌ వారియర్స్‌ (పరీక్షా యోధులు) పుస్తకం ఎంతో ఆలోచింపజేస్తోంది. పలువురు మహనీయులు వారి విద్యార్థి దశలో పరీక్షలంటే ఎలా ఉండేవారు.. వాటిని ఎలా ఎదుర్కొన్నారు.. ఎలా విజయం సాధించారో తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి విద్యార్థికి ఉంది.
***ఆత్మవిశ్వాసానికి పరీక్ష- ‘ఆత్మకథ’లో మహత్మా గాంధీ
నేను మెట్రిక్‌ పరీక్షలు రాసేందుకు పోర్‌బందర్‌ వెళ్లేందుకు ఇష్టపడలేదు. మా అమ్మ కొంగు పట్టుకుని వదలలేదు. అప్పుడు ఆమె మంచి మాటలు చెప్పి నాలోని పరీక్షల భయాన్ని పోగొట్టారు. గురువు తరుణ్‌సింగ్‌ సైతం పరీక్షలంటే ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించేవే తప్ప జ్ఞానాన్ని పరీక్షించేవి కాదన్నారు. దీంతో భయం పోయి, రెట్టింపు ఉత్సాహంతో పరీక్షలు రాసి… పాఠశాల ప్రథముడిగా నిలిచా.
***సానుకూల దృక్పథంతో ముందుకు..- బిల్‌గేట్స్‌
ఈ పరీక్షలు నా తెలివితేటలను పరీక్షించేందుకా? నా తల్లిదండ్రులను సంతోష పెట్టేందుకా అనిపించింది. దీనికి మా అమ్మ స్పందిస్తూ.. జీవితాన్ని ఇంకెంత మెరుగుపరుచుకోవాలి, ఏఏ పద్ధతులు పాటిస్తే ఇంకా మంచి జరుగుతుందో చెప్పేందుకే పరీక్షలు… అవి ఓటమికి కాదన్నారు.
***మానసిక సంసిద్ధతే ప్రధానం- డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌
పరీక్షలంటే విద్యార్థుల్ని సన్నద్ధం చేయడమంటే వారితో అదే పనిగా చదివించడం.. రాయించడమే కాదు. వారిని మానసికంగా సంసిద్ధుల్ని చేయాలి. నేను ఏడో తరగతి చదివినప్పుడు పరీక్షలకు వెళ్లనని ఏడ్ఛా అప్పుడు నా గురువు భుజం మీద చేయి వేసి, నీలో ఉన్న జ్ఞానాన్ని నీకు తెలిసిన భాషలో సొంతంగా ఆలోచించి భావాన్ని వ్యక్తం చేయడమే నీ పని. ఫలితాన్ని వదిలేయ్‌ అన్నారు. అంతే కాదు నువ్వు రాసేది మూడు గంటల పరీక్షే కావచ్ఛు. జీవితంలో ఎదురయ్యే పరీక్షలు కావచ్ఛు అప్పటి నుంచి ప్రతి పరీక్షను అలవోకగా, మానసికస్థైర్యంతో ఎదుర్కొన్నా.
***వాటిని భూతంగా చూపొద్దు- వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌లో ఏపీజే అబ్దుల్‌ కలాం
నా జీవితంలో ఎదురైన మొదటి పరీక్షలో ఎంతో ఆందోళన చెందా. భయంగా ఉందని మేనమామ షంషుద్దీన్‌తో చెప్పాను. భయాందోళనలు లేకుండా పరీక్షలకు సన్నద్ధమవడమే చదువుపరంగా మనం సాధించే అతిపెద్ద విజయమని ఆయన నాలో ఆత్మవిశ్వాసం నింపారు. పిల్లల్లో ప్రేరణ నింపకపోయినా ఫర్వాలేదు. పెద్దలు మాత్రం పరీక్షలను వారి ముందు భూతంగా చూపించి భయపెట్టవద్దని తల్లిదండ్రులకు, గురువులకు సూచిస్తున్నా.
***వర్రీయర్స్‌గా కాదు- – పరీక్ష యోధులు పుస్తకంలో ప్రధాని నరేంద్ర మోదీ వారియర్స్‌గా మారి పోరాడాలి. ఒక ఏడాది కఠోర శ్రమ తరువాత తమ సామర్థ్యాలను ప్రదర్శించే పరీక్షలను ఒక ఆనందకరమైన సందర్భంగా చూడాలి. వాటిని పండుగలా చేసుకోవాలి. అప్పుడు ఎలాంటి ఒత్తిడి ఉండదు.