రోడ్డులేని ఊరికి గాడిదలే వాహనాలు..! తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని పెన్నగారమ్ నియోజకవర్గంలో జరగుతున్న ఎన్నికల కోసం ఎన్నికల సంఘం అధికారులు గాడిదలను వాడారు. కొట్టూరుమలై గ్రామానికి ఈవీఎంలను మోసుకువెళ్లేందుకు నాలుగు గాడిదలను ఈసీ అధికారులు కిరాయి తీసుకున్నారు. హైవేకి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామానికి రోడ్డు లేదు. ఆ ఊరికి వాహనాలు వెళ్లవు. అయితే ఈవీఎంలను మోసుకెళ్లేందుకు గాడిదలను వాడాల్సి వచ్చింది. ఆ ఊరిలో సుమారు 341 ఓటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈవీఎంలను మోసుకెళ్లిన గాడిదలకు సినిమా హీరోల పేర్లు పెట్టారు. రజనీ, కమల్, అజిత్, విజయ్ అని వాటికి పేర్లు కూడా ఉన్నాయి. చిన్నస్వామి అనే వ్యక్తికి చెందిన గాడిదలు ఈవీఎంను మోసుకువెళ్లాయి. 1970 నుంచి ఆ గ్రామానికి గాడిదల ద్వారానే ఎన్నికల సామాగ్రిని మోసుకువెళ్తున్నట్లు అతను చెప్పాడు. అయితే రోజూ ఒక గాడిదకు 2వేలు ఇస్తున్నారు.
గాడిదలను ఈసీ అధికారులు కిరాయి తీసుకున్నారు
Related tags :