*ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాసారు. రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజమండ్రిలో బెంచ్ ఏర్పాటు చేయాలనీ కోరారు. ఈ సంధబ్ర్హంగా జగన్ తండ్రి వైఎస్ విషయన్ని ప్రస్తావించారు. పద్నాలుగేళ్ళ క్రితం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజమండ్రిలో బెంచ్ పెట్టాలని ఆలోచన చేశారని గుర్తు చేసారు. కాబట్టి ఈదిశగా ప్రభుత్వం ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని.. హైకోర్టు బెంచ్ కు రాజమండ్రి అనుకూలమని లేఖలో ప్రస్తావించారు. రాజమండ్రిలో హైకోర్టు అనుకూలమని లేఖలో ప్రస్తావించారు. రాజమండ్రిలో హైకోర్టు ఏర్పాటు ను పరిశీలించాలని జగన్ ను కోరారు. చాలా రోజులుగా హైకోర్టు బెంచ్ ల వ్యవహారం ఎపీల చర్చ జరుగుతోంది.
* అమిత్ షాతో కేజ్రీవాల్ భేటీ
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించి సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి షా నివాసానికి వెళ్లిన కేజ్రీవాల్ ఆయనతో సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది. అనంతరం ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను కేజ్రీవాల్ ట్విటర్లో వెల్లడించారు. ‘హోంమంత్రి అమిత్‌షాను కలిశాను. ఈ సమావేశం చాలా ఫలప్రదంగా జరిగింది. దిల్లీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించాం. దిల్లీ అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని పరస్పరం అంగీకారానికి వచ్చాం ’ అని ట్విటర్లో పేర్కొన్నారు.
* మీడియాను నియంత్రిస్తే పతనం ప్రారంభమైనట్టే: ఉండవల్లి
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని చానల్స్ ప్రసారాలను నిలిపివేశారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సాక్షి పేపరు, చానల్ లేదని, మీడియా మొత్తం రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకమని.. అయినా ఆయన ఏనాడు మీడియా జోలికి పోలేదని అన్నారు. మీడియాను ఆపేయాలనే ప్రయత్నం చేయలేదన్నారు. ఆయన డైరెక్టుగానే ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాశారని, ఆ రెండు పేపర్లు అంతేనని చెప్పేవారే తప్ప.. వాటిని ఆపాలనే ప్రయత్నం చేయలేదన్నారు. ఇప్పుడు రాజమండ్రిలో రెండు చానల్స్ రావడంలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. తనకు తెలిసిన విషయం ఏమిటంటే జగన్ ప్రభుత్వమే ఆ రెండు చానల్స్‌ను ఆపమందని తెలిసిందన్నారు. ఇంతకుముందు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కూడా ఇలాగే చేశారని అన్నారు. జగన్‌కు తెలియదేమో చానల్స్ నిలిపివేయడం చాలా తప్పని అన్నారు. వెంటనే రెండు చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన వార్తలను చూసి భయపడిన మరుక్షణం పతనం ప్రారంభమైనట్టేనని ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.
* జగన్ చర్య.. వైఎస్ఆర్కు వెన్నుపోటు పొడవటమే: తులసి రెడ్డి
శాసనమండలిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసనసభలో చేసిన తీర్మానం.. వైఎస్ఆర్కు వెన్నుపోటు పొడవటమే అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి వ్యాఖ్యానించారు. కక్షపూరితంగా అహంభావంతో మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేశారని విమర్శించారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశంలో, రాష్ట్రంలో గాంధేయవాదానికి, గాడ్సేవాదానికి మధ్య సైద్ధాంతిక పోరాటం జరుగుతోందన్నారు. సైద్ధాంతిక పోరాటంలో అంతిమ విజయం గాంధేయవాదానిదే అని చెప్పుకొచ్చారు. ఏపీకి బీజేపీ చేసిన మోసం, ద్రోహం మరో పార్టీ చేయలేదన్నారు. ప్రత్యేక హోదాకు పంగనామం పెట్టారని, విభజన హామీలు అమలు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వంపై తులసి రెడ్డి ఫైర్ అయ్యారు.
* నన్ను ప్రజలే కాపాడుకుంటారు: చంద్రబాబు
వైకాపా ప్రభుత్వ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఒకప్పుడు రాష్ట్రం ఎలా ఉంది.. ఈ 9 నెలల్లో ఎలా ఉందో ఆలోచించాలని ప్రజలకు ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తెదేపా ప్రజాచైతన్య యాత్రను ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం మార్టూరులో చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు, తెదేపా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని వైకాపాకు ఓటు వేశారని.. ఇప్పుడు అనుభవిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. తెదేపా నేతలు, కార్యకర్తలను శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.
*ఆ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించలేరు: యనమల
శాసనమండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీ ఏర్పాటు నిర్ణయం ఎవరూ ప్రశ్నించలేనిదని, అలా చేస్తే పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధమని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. సెలెక్ట్ కమిటీకి బిల్లులు వెళ్లినప్పుడు అనేక మార్లు మూజువాణి లేదా ఓటింగ్ లేకుండానే నిర్ణయం తీసుకున్నవేనని గుర్తుచేశారు. ఇలాంటివి మెజారిటీ సభ్యుల అభిప్రాయాలకు అనుగుణంగా సభ మూడ్‌ని బట్టే జరుగుతాయన్నారు.సభలో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా రూలింగ్ ఇచ్చే అధికారం ఛైర్మన్‌కి ఉందని యనమల అన్నారు. న్యాయస్థానం తీర్పును ఎవరూ ప్రశ్నించరాదని చట్టంలోని 212 నిబంధన స్పష్టం చేస్తుందని, ఒక కార్యదర్శి… మండలి ఛైర్మన్ నిర్ణయాన్ని ఎలా ప్రశ్నిస్తారని నిలదీశారు. శాసనమండలి నిబంధనలన్నీ పార్లమెంట్ వ్యవహారాలకు అనుబంధంగా రూపొందించినవేనన్నారు. మండలి ఛైర్మన్ నిర్ణయాన్ని ధిక్కరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకునే సర్వ అధికారాలు ఛైర్మన్‌కు ఉన్నాయని, ఛైర్మన్ రూలింగ్ నిర్ణయమే తప్ప మరొకటి కాదని యనమల స్పష్టం చేశారు.
*బొప్పూడిలో చంద్రబాబుకు ఘనస్వాగతం
ప్రకాశం జిల్లా పర్యటనకు విచ్చేసిన తెదేపా అధినేత చంద్రబాబుకు బొప్పూడిలో ఘన స్వాగతం లభించింది. తెదేపా నేతలు దామచర్ల జనార్దన్, ఏలూరి సాంబశివరావు, కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్, స్వామి, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసేపట్లో తెదేపా ప్రజా చైతన్యయాత్రను ప్రారంభించనున్నారు.ప్రజా చైతన్యయాత్రలో భాగంగా ఇవాళ పర్చూరు, సంతనూతలపాడు, అద్దంకి, ఒంగోలు నియోజకవర్గాల్లో చంద్రబాబు బస్సు యాత్ర నిర్వహించనున్నారు. సాయంత్రం ఒంగోలులో ర్యాలీ నిర్వహించి అద్దంకి బస్టాండ్ వద్ద బహిరంగసభలో పాల్గొననున్నారు
*అదానీ కంపెనీనీ తుగ్లక్ సేన తరిమేసింది: లోకేశ్
వైకాపా ప్రభుత్వం చేతగానితనం వల్లే అదానీ కంపెనీ ఏపీ నుంచి వెళ్లిపోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అధికారం చేపట్టిన 9 నెలల కాలంలో రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేని వాళ్లు అదానీ సొంత అవసరాల కోసం వేరే రాష్ట్రానికి వెళ్లిపోతోందనడం వారి చేతగానితనాన్ని బయటపెట్టుకోవడమేనని దుయ్యబట్టారు. రూ.70 వేల కోట్ల పెట్టుబడితో 28 వేల మందికి ప్రత్యక్షంగానూ, 85 వేల మందికి పరోక్షంగానూ ఉద్యోగాలు కల్పించే అదానీ కంపెనీని తుగ్లక్ సేన తరిమేసిందని ఆక్షేపించారు. ఉత్తరాంధ్ర ప్రాంత నిరుద్యోగ యువతకు రావాల్సిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఉన్న ఉద్యోగస్తులను తరలించడం అభివృద్ధి వికేంద్రీకరణో.. యువతకి కొత్త ఉద్యోగాలు కల్పించడం అభివృద్ధి వికేంద్రీకరణో ఆలోచించాలని లోకేశ్ హితవు పలికారు.
*పవన్‌పై వైకాపా ఎమ్మెల్యే రమేష్ వ్యాఖ్యలకు నిరసనగా ర్యాలీ
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా నాయకుల తరఫున ముఖ్యమంత్రి జగన్ క్షమాపణలు చెప్పాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. పవన్ కల్యాణ్‌పై వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు జనసేన కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాటలో శ్యాంసన్ అనే కార్యకర్త కింద పడి స్పృహ కోల్పోయారు. పోలీసుల పిడిగుద్దుల వల్లే శ్యాంసన్ స్పృహ కోల్పోయాడని, అతన్ని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు నాయకులు తెలిపారు. అనంతరం పోతిన మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసుల పాలన సాగుతోందని, 144, 30 సెక్షన్ల నడుమ ప్రభుత్వం పాలన చేస్తోందని ఆరోపించారు.
*కులాల వారీగా జనగణన చేపట్టాలి
దేశ జనగణనలో కులాల వారీగా వివరాలు సేకరించాలని 14 బీసీ సంఘాలు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశాయి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, పలు బీసీ సంఘాల నేతలు వెంకటేశ్, సురేశ్, నందగోపాల్, రాఘవ, రాంకోఠి ముదిరాజ్, రాజేందర్, రామకృష్ణ తదితరులు మంగళవారం కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. దేశంలో బీసీల జనాభా వివరాలు లేకపోవడంతో రిజర్వేషన్లు, బడ్జెట్ కేటాయింపుల సందర్భంగా సమస్యలు ఎదురవుతున్నాయని ఆయనకు వివరించారు.
*కేసీఆర్‌పై పాటల సీడీ ఆవిష్కరణ
ముఖ్యమంత్రి కేసీఆర్ 66 వ పుట్టిన రోజు సందర్భంగా తెరాస రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్ రూపొందించిన ‘‘ఆరు ఆరు అరవయ్యారు..ఆత్మగల్ల కేసీయారు’’ అనే పాటల సీడీని మంగళవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ పాటలను సీఎం ప్రజాసంబంధాల అధికారి రమేశ్ హజారీ రాశారు. కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ ఛైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్ నాంపల్లి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెలంగాణ హోటళ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధి వెంకట్‌రెడ్డి సీఎంను కలిసి మొక్కను అందజేశారు. కేసీఆర్ జన్మదిన వేడుకలు మంగళవారం డెన్మార్క్‌లో తెరాస ప్రవాస విభాగం అధ్యక్షుడు గంట జయచందర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
*రైతు సమస్యలు పరిష్కరించండి: జీవన్‌రెడ్డి
ఎన్నికలో గెలిచిన అధికార తెరాస పైశాచిక ఆనందం పొందుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. అన్నదాతల సమస్యలు పరిష్కరిస్తే సీఎం కేసీఆర్ జన్మదినాన్ని రైతు దినోత్సవంగా చేసుకుందామని ఆయన ప్రతిపాదించారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రూ.లక్ష రుణమాఫీ జరగక, వడ్డీ రాయితీ సొమ్ము విడుదల కాక, కొత్త రుణాలు మంజూరు లేక రైతులు ఇబ్బందుల్లో ఉన్నారన్నారు.
*మీరు గాంధీ వైపా… గాడ్సే పక్షమా?
అధికార దాహంతోనే జేడీ(యూ) అధినేత నీతీశ్‌కుమార్ భాజపాతో జతకట్టారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్ ఆరోపించారు. మహాత్మాగాంధీ వైపా, ఆయన్ని హతమార్చిన నాథూరాం గాడ్సే పక్షాన నిలుస్తారా అనేది నీతీశ్ చెప్పగలరా అని ప్రశ్నించారు. జేడీ(యూ) నుంచి బహిష్కృతుడైన తర్వాత ప్రశాంత్ తొలిసారిగా మంగళవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడారు. బిహార్ ప్రయోజనాల కోసమే భాజపాతో జేడీ(యూ) కలిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు రప్పించలేకపోయారన్నారు.
*సీఏఏతో మైనారిటీలకు ఏమీ కాదు: పళనిస్వామి
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) విషయంలో డీఎంకే పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అన్నారు. 2020-21 బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆ రాష్ట్ర శాసనసభలో సీఏఏపై వాడీవేడీ చర్చ జరిగింది. డీఎంకేకు చెందిన ఎమ్మెల్యే టి మనో తంగరాజ్ మాట్లాడుతూ.. సీఏఏకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఇంతలో ముఖ్యమంత్రి పళనిస్వామి జోక్యం చేసుకుని… సీఏఏ వల్ల భారత్‌లోని మైనారిటీలపై ఉండే ప్రభావం ఏమిటో వివరించాలని డీఎంకే నాయకులను ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఎప్పటికీ మైనారిటీలకు నష్టం కలిగించే చట్టాల్ని అనుమతించదని చెప్పారు. ‘సీఏఏ కారణంగా తమిళనాడులో ఏ మైనారిటీ వర్గంపై ప్రభావం పడుతుందో చెప్పాలని ప్రశ్నిస్తూ.. మేము మీ లాగా ప్రజల్ని తప్పుదోవ పట్టించం’ అని విమర్శించారు. ఈ క్రమంలో తంగరాజ్ మళ్లీ స్పందిస్తూ.. సీఏఏకు వ్యతిరేకంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో తీర్మానం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. దానికి సీఎం స్పందిస్తూ.. ‘పౌరసత్వ సవరణ చట్టం కేంద్రం పరిధిలో ఉంటుంది.. దానితో రాష్ట్రాలకు సంబంధం ఉండదు’ అంటూ బదులిచ్చారు.
*ప్రజల దృష్టి మరల్చేందుకే యాత్ర: కన్నబాబు
ప్రభుత్వం చేసిన అపరాధాలేమిటో చెప్పిన తర్వాతే తెదేపా అధినేత చంద్రబాబు బస్సు యాత్ర చేపట్టాలని మంత్రి కన్నబాబు డిమాండు చేశారు. తన మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ ఇంట్లో జరిగిన ఐటీ దాడుల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే చంద్రబాబు బస్సు యాత్ర చేపట్టారని విమర్శించారు. సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు.
*ధాన్యం అమ్మిన డబ్బులు ఇంకా ఇవ్వలేదు: పవన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు రూ.2016 కోట్లు బకాయి పడిందని, మాట తప్పి రైతులను మోసం చేసిందని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్మిన 48 గంటల్లో సొమ్ములు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఆ మాట తప్పిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పంట అమ్ముకుని వారాలు గడుస్తున్నా ఇప్పటికీ డబ్బులు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. లక్షమందికి పైగా రైతులు రెండో పంట పెట్టుబడికి డబ్బుల్లేక ఇబ్బంది పడుతుంటే సంబంధిత శాఖలు ఏం చేస్తున్నాయని పవన్ ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలుకు నిధులు కేటాయించారా.. లేదా? కేటాయిస్తే ఆ నిధులు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజమండ్రిలో పెట్టమని ఉండవల్లి లేఖ-రాజకీయం
Related tags :