* విశాఖపట్నం నుండి తగరపువలస వైపు వెళ్తున్న కూల్డ్రింక్స్ లోడుతో ఉన్న మినీ ట్రాన్స్పోర్ట్. టైరు పేలడంతో అదుపుతప్పి బోల్తాపడింది. 16 వ నంబర్ జాతీయ రహదారిపై రెండు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్. సంఘటన స్థలానికి చేరుకున్న పీఎం పాలెం ట్రాఫిక్ పోలీసులు.
* కడప జిల్లా రైల్వే కోడూరు కోడూరు రేంజి అటవీ శాఖ పరిధిలో 26 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనతనిఖీ చేస్తుండగా ఈ దుంగలు బయటపడ్డాయి. ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసినట్లు సబ్ డిఎఫ్ ధర్మరాజు ఎఫ్ఆర్ఓ నయీమ్ అలీ తెలిపారు
* ఆమదాలవలస రైల్వే స్టేషన్ లో, పాసింజర్ రైలు ఢీకొని వ్యక్తి మృతి. మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా?. లేక ట్రాక్ దాటుతుండగా, రైలు ఢీ కొన్నదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు. దర్యాప్తు చేస్తన్నరు. ఈ కారణంగా రెండు గంటలు ఆలస్యంగా రైళ్లు నడుస్తున్నాయి…
* శాఖ ఏవోబీలో ఓ బోటు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన కెచ్చుల సంజీవ రెడ్డి, పాంగి తులసమ్మ గల్లంతవగా. ముగ్గురు సురక్షితంగా ఉన్నారు. గల్లైంతైన వారిది. విశాఖ- తూర్పుగోదావరి- ఒడిశా సరిహద్దుల్లో గల మర్రిగూడెం. వీరంతా మర్రిగూడెం నుంచి అల్లూరు కోట వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది…
* శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత. సుడాన్ దేశస్తురాలి వద్ద 233.2 గ్రాముల అక్రమ బంగారం పట్టివేత. దుబయ్ నుండి హైదరాబాద్ వచ్చిన మహిళ. నింధితతురాలు బంగారాని వివిధ రకాలైన అభరణల రూపంలో, తయారు చేసి వేసుకున్న. షు లలో లోదుస్తులలో, బంగారం తరలిస్తుండగా, పట్టుబడింది.పట్టుబడ్డ బంగారం విలువ 11 లక్షలు ఉంటుందని ఆధికారులు వెల్లడించారు.
* కడప జిల్లా రైల్వే కోడూరు కోడూరు రేంజి అటవీ శాఖ పరిధిలో 26 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనతనిఖీ చేస్తుండగా ఈ దుంగలు బయటపడ్డాయి. ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసినట్లు సబ్ డిఎఫ్ ధర్మరాజు ఎఫ్ఆర్ఓ నయీమ్ అలీ తెలిపారు
* సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. ఏపీజీవీబీ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న దివ్యా రెడ్డి (25) తన రూమ్ లో హత్యకు గురయ్యారు.
* సనత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. రౌండ్ టేబుల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిపై మహిళ దాడికి పాల్పడింది. పాఠశాల విద్యార్థులు ఆటలాడుతూ అల్లరి చేస్తున్నారని ….. బాలుడిపై మహిళ, ఆమె భర్త దాడి చేశారు. అతను ఏమీ చేయలేదని తోటి విద్యార్థి చెప్పినా వదల్లేదు.దెబ్బలకు తట్టుకోలేక బాలుడు కాళ్లు పట్టుకుని వేడుకున్నా ఆమె కనికరించలేదు. లేబర్ పిల్లలు, చిల్లరగాళ్లు అంటూ నోటికొచ్చినట్లు తిట్టింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు విద్యార్థిపై దాడికి పాల్పడిన దంపతులను అదుపులోకి తీసుకున్నారు.
* సికింద్రాబాద్ లోని రైల్ నిలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై స్కూల్ కు వెళ్తున్నతండ్రీ కొడుకులిద్దరికీ గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తండ్రి గిరి మృతి చెందాడు. కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కారు అతివేగమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు.
*కేరళలో పోలీస్ త్రైనీల మెనూలో బీఫ్ ను తొలగించారన్న వార్తల నేపధ్యంలో కోజికోడ్ లోని ఓ పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు బీఫ్ కర్రీ బ్రెడ్ ను పంచారు.
*దేశంలో పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరపట్టిక పై తీవ్ర దుమారం రేగుతున్న వేళ హైదరాబాద్ లో 127 మందికి అదార్ సంస్థ నోటీసులు ఇవ్వడం సంచలనం మారింది.
*ప్రకాశం జిల్లాలో తెదేపా నేతలకు ప్రభుత్వం షాక్ ఇచ్చిది. గ్రానైట్ తవ్వకాలకు భారీ జరిమానా విధించింది. వీరిలో భాజపా రాజ్యసభ సభ్యుడు గరికపాటి నరసింహారావు అడ్డ్డంకి తెదేపా ఎమ్మెల్యే గోతిపాటి రవికుమార్ మాజీ మంత్రి సిద్దా రాఘవరావు ఉన్నారు.
*కాశ్మీర్ లో మరోసారి భాదతా దళాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది.
*ఎన్ని కఠినచట్టాలు వచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడంలేదు. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రం కబీర్‌ధామ్ జిల్లాలోని టారెగావ్ అటవీ ప్రాంతంలో ఓ మహిళపై నలుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 17న బాధిత మహిళ గ్రామస్థులతో కలిసి సమీపంలోని మావై గ్రామంలో జరుగుతున్న జాతరకు వెళ్లింది. తిరిగి గ్రామానికి వస్తున్న క్రమంలో సున్రేహా గ్రామం వద్ద నలుగురు వ్యక్తులు కారులో వచ్చి, తామూ అటువైపే వెళ్తున్నామని ఆమెను కారులో ఎక్కించుకున్నారు. ఆ తర్వాత దుండగులు గ్రామంవైపు కాకుండా సమీపంలో అటవీప్రాంతంలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు 24 గంటల్లోనే నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడైన ఆదిత్యతో పాటు మన్‌హరన్, రాజారాం, బోరందేవ్‌లపై ఐపీసీ సెక్షన్ 376, 36 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులంతా 22 నుంచి 29 మధ్య వయస్కులే.
*విశాఖ ఏవోబీలో ఓ బోటు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన కెచ్చుల సంజీవ రెడ్డి, పాంగి తులసమ్మ గల్లంతవగా. ముగ్గురు సురక్షితంగా ఉన్నారు. గల్లైంతైన వారిది. విశాఖ- తూర్పుగోదావరి- ఒడిశా సరిహద్దుల్లో గల మర్రిగూడెం. వీరంతా మర్రిగూడెం నుంచి అల్లూరు కోట వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది…
*ఆమదాలవలస రైల్వే స్టేషన్ లో, పాసింజర్ రైలు ఢీకొని వ్యక్తి మృతి. మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా?. లేక ట్రాక్ దాటుతుండగా, రైలు ఢీ కొన్నదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు. దర్యాప్తు చేస్తన్నరు. ఈ కారణంగా రెండు గంటలు ఆలస్యంగా రైళ్లు నడుస్తున్నాయి.
*సనత్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. రౌండ్ టేబుల్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఓ విద్యార్థిపై మహిళ దాడికి పాల్పడింది. పాఠశాల విద్యార్థులు ఆటలు ఆడుకుంటూ అల్లరి చేస్తున్నారని ఆగ్రహంతో బాలుడిపై మహిళ, ఆమె భర్త విచక్షణారహితంగా దాడి చేశారు.
*సినీఫక్కీలో జరిగిన దొంగతనాన్ని ఏలూరు పోలీసులు ఛేదించిన వైనం బుధవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు… ఓ వ్యక్తి ప్రైవేట్ ఫైనాన్స్‌లో దాదాపు అరకేజీ బంగారాన్ని తాకట్టు పెట్టాడు. (నిన్న) మంగళవారం ఫైనాన్స్ కార్యాలయానికి ఆ వ్యక్తి ఫోన్ చేసి ఇంటికి వచ్చి తన నగలను అప్పగిస్తే డబ్బులు ఇస్తానని తెలిపాడు
*గుబ్బల మంగమ్మ గుడికి భక్తులతో వెళుతున్న వ్యాన్ బోల్తాపడి తొమ్మిదిమందికి తీవ్ర గాయాలైన ఘటన బుధవారం జంగారెడ్డిగూడెం మండలంలో చోటు చేసుకుంది.
*ఆటోను ఢీకొట్టి. కారు పల్టీ కొట్టిన ఘటన హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వద్ద జరిగింది. ప్రమాద సమయంలో ఆటోలో ఉన్న ఏడుగురు దినసరి కూలీలున్నారు. వారికి గాయాలయ్యాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. స్థానికుల సమచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…
*చిన్నమండెం బెంగళూరు ప్రధాన రహదారిలోని రెడ్డివారిపల్లె బస్టాండ్ సమీపంలో, బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కారు అదుపుతప్పి బోల్తా పడటంతో, ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు కేశాపురం పంచాయతీలోని ముండ్లావాండ్లకోటకు చెందిన దామోదర్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు…
*జమ్మూకశ్మీర్ లో భద్రతాబలగాలు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బుధవారం ఉయదం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్వామా జిల్లా త్రాల్ సెక్టార్‌లోని ఓ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం అందింది. దీంతో భద్రతాబలగాలు నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి. వీరి రాకను పసిగట్టిన ముష్కరులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులతో తిప్పికొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు వారి వివరాలను సేకరించేందుకు యత్నిస్తున్నారు. ఇంకా ఎవరైనా ముష్కరులు ఉన్నారేమో అనే అనుమానంతో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి…
*హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు సమీపంలో, జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ఆర్టీసీ బస్సును అతి వేగంగా వస్తున్న ఏపీ10AA7733 నంబరు గల కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు సికింద్రాబాద్ నుంచి కొండాపూర్ వెళ్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని. క్షతాగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు కారులో ఉన్న యువకులు మద్యం సేవించారా లేక అతివేగంతో వచ్చారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు…
*మియాపూర్‌లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి వాహనాలను ఢీకొట్టి సమీపంలోని హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో హోటల్‌లో కూర్చున్న అప్జల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. నలుగురు ద్విచక్రవాహనదారులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..
*తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక కూతురు గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నది. తండ్రీకూతుళ్లు ఒకే రోజున మృతిచెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
*ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఏజెన్సీలో భద్రతా బలగాలపై మావోయిస్టులు విరుచుకుపడ్డారు. సుక్మా జిల్లా కిస్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అంబుష్ వేసి సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న జవాన్లపై కాల్పులు జరిపారు.
*సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్లో యువతి దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని దుండగులు యువతి గొంతు కోసి హత్య చేశారు. మృతురాలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన దివ్య(24)గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
*రామగుండం రైల్వేస్టేషన్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. రైలు కిందపడి జవాన్ మృతి చెందాడు.
* ఓ బాలికపై లైంగికదాడి చేసిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలో బుద్దసముద్రం గ్రామంలో చోటుచేసుకున్నది.
*తండ్రి మరణాన్ని తట్టుకోలేని ఓ యువతి.. ఆయన మృతదేహాన్ని తీసుకువస్తూ.. దారిలో గోదావరిలోకి దూకేసింది. ఆరవెల్లి సాయిప్రియ (32) మంచిర్యాల జిల్లా కోటపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఇంకా వివాహం కాలేదు. ఆమె తండ్రి వసంత్ సోమవారం మంచిర్యాల నుంచి చెన్నూరుకు వస్తుండగా జైపూర్ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు.
*బయో ఎరువుల కంపెనీలపై రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న విజిలెన్స్ దాడుల్లº బాగంగా మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలోని గ్రీన్ప్లానెట్ కంపెనీలో సోదాలు జరిగాయి.
*దంపతుల మధ్య విభేదాల నేపథ్యంలో న్యాయం కోసం స్టేషన్ గుమ్మం తొక్కిన ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వంచించారన్న ఆరోపణపై గుంటూరు అర్బన్ జిల్లా నగరంపాలెం సీఐ కె.వెంకటరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. నెల్లూరు జిల్లాలో వెంకటరెడ్డి ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో ఓ వివాహిత తన భర్తతో గొడవలున్నాయంటూ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇదే అదనుగా తాను భర్త నుంచి విడాకులు తీసుకుంటే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని బాధితురాలు వాపోయారు. అతడు కూడా తన భార్య నుంచి విడాకులు తీసుకుంటానని తెలిపాడని వివరించారు. తాను భర్తతో విడాకులు తీసుకున్నాక సీఐ మొహం చాటేశాడని బాధితురాలు గుంటూరు అర్బన్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణలో సీఐ మోసం వెల్లడైందని ఎస్పీ వివరించారు. దీంతో అతన్ని సస్పెండ్ చేస్తూ ఐజీ వినీత్బ్రిజ్లాల్ ఉత్తర్వులిచ్చారు.
*పన్ను ఎగవేతకు పాల్పడిన ఓ వ్యక్తిని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అరెస్టు చేశారు. ఈ మోసం వెనుక బడా వ్యాపారులున్నట్లు అనుమానిస్తున్నారు. విశాఖకు చెందిన దుడ్డు శేఖర్ అనే వ్యక్తి.. వెంకటసాయి ట్రేడర్స్, శేఖర్ ట్రేడర్స్ పేరిట పాత ఇనుము వ్యాపారం చేస్తున్నట్లు గాజువాక వాణిజ్య పన్నులశాఖ సర్కిల్ కార్యాలయంలో 2018లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆయన ఆన్లైన్ వే బిల్లులను వినియోగించుకున్నందున రూ.14.40కోట్ల టర్నోవరుపై రూ.2.60కోట్ల పన్నును వాణిజ్యపన్నులశాఖకు చెల్లించాల్సి ఉంది.
*జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనపై నమోదు చేసిన కేసు విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్.శ్రీనివాసన్ అభ్యర్థనను హైకోర్టు నిరాకరించింది. తన వయసును దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత హాజరు నుంచి అయినా మినహాయింపు ఇవ్వాలన్న అభ్యర్థననూ తిరస్కరిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 15కి వాయిదా వేసింది.
*సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో యువతి దారుణ హత్యకు గురైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన యువతిని గుర్తు తెలియని దుండగులు ఆమె అద్దెకుంటున్న ఇంట్లోనే గొంతుకోసి హతమార్చారు. ఈనెల 26న యువతికి వివాహం జరగాల్సి ఉండగా హత్యకు గురైంది. యువతి గజ్వేల్ పట్టణంలోని ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్లో పనిచేస్తోంది. మంగళవారం సాయంత్రం విధులు పూర్తి చేసుకొని తను అద్దెకుంటున్న ఇంటికి చేరుకున్న అనంతరం ఆమె మెడకోసి దుండగులు చంపేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
*సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులను మృత్యువు కబళించింది. ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘోరం సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. గుమ్మడిదల మండలం అన్నారం కొత్త చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృత్యువాతపడ్డారు.
అరకేజీ బంగారం కేసు ఛేదించారు-నేరవార్తలు
Related tags :