తెలంగాణ పోలీసులపై ప్రముఖ సినీ నటి సాయిపల్లవి ప్రశంసల జల్లు కురిపించారు. ఇవాళ నగరంలోని హైటెక్ సిటీ హెచ్ఐసీసీలో షీ ఎంపవర్ ఉమెన్స్ కాంక్లేవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ నటి సాయిపల్లవి, సైబరాబాద్ సీపీ సజ్జనార్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సాయిపల్లవి మాట్లాడుతూ.. మహిళల కోసం తెలంగాణ పోలీసులు చేస్తున్న కార్యక్రమాలు నిజంగా గ్రేట్ అని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో మహిళలకు ఉన్న భద్రత ఎక్కడా లేదని పోలీసులపై ప్రశంసల జల్లు కురిపించారు. సిటీకి చదువు, ఉద్యోగాల కోసం వచ్చే యువతులు గతంలో చాలా భయపడేవారని అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. పోలీసులకు సహకరించడం మన బాధ్యత అని యువతకు సాయిపల్లవి సూచించారు.
పోలీసు రక్షతి రక్షితః
Related tags :