ఏపీ ఈఎస్ఐలో 2014-19 మధ్య రూ.70 కోట్ల మేర అవినీతి జరిగిందని విజిలెన్స్ అధికారులు గుర్తించిన నేపథ్యంలో తెదేపా సీనియర్ నేత, అప్పటి కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. ఈఎస్ఐ అవకతవకల్లో తన పాత్ర ఉందంటూ వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ‘టెలీ హెల్త్ సర్వీసెస్’ తాను కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పటి నిర్ణయమన్నారు. ఏపీ కంటే ముందు తెలంగాణలో దీనిని ప్రారంభించారని, తెలంగాణలో మాదిరిగానే ఏపీలోనూ అమలు చేయాలని నోట్ పంపానని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా ఏ ఒక్కరికో దీనిని కేటాయించాలని ఆదేశించలేదని, కేంద్రం ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. దురుద్దేశంతోనే ఓ వర్గం మీడియా తనపై అసత్యాలు ప్రచారం చేస్తోందని అచ్చెన్న ఆరోపించారు.
అది నా నిర్ణయమే
Related tags :